Home / సినిమా
శ్రీహాన్ కోపంగా ‘నోరు అదుపులో పెట్టుకో, వాడు వీడు ఏంటి’ అని గట్టిగా ఇనయాపై అరిచేస్తాడు. ఆ తరువాత రేవంత్ కూడా కలుగజేసుకుని. ‘మొన్న అన్నావ్ వాడు అని, లాగికొడితే..’అంటాడు. దానికి ఇనయా ‘నన్ను కొడతానని ఎలా అంటావ్’ అంటూ ఇంట్లో హడావిడి చేస్తుంది. ఇలా ఈ రోజు బిగ్ బాస్ హౌస్‌లో రచ్చ నడుస్తుంది.
వెండితెరకు నూతన హీరోగా పరిచయం అవుతున్న విక్రాంత్ నటిస్తున్న భారీ బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ గా ‘స్పార్క్’ మూవీ తెరకెక్కుతుంది. దీనిలో ఛార్మింగ్ బ్యూటీస్ మెహ్రీన్ ఫిర్జాదా, రుక్సర్ థిల్లాన్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.
గ్రీన్ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి పుత్రులు ఇద్దరు కాళభైరవ, శ్రీసింహ మొక్కలు నాటారు.
‘నేను రాజకీయం నుంచి దూరంగా ఉన్నాను. కానీ, రాజకీయం నా నుంచి దూరం కాలేదు’ అంటున్నారు మెగాస్టార్ చిరంజీవి. చిరు హీరోగా మోహన్‌రాజా దర్శకత్వంలో పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా ‘గాడ్‌ఫాదర్’మూవీ తెరకెక్కుతుంది. కాగా ఈ మూవీ నుంచి తాజాగా విడుదలైన డైలాగ్ అటు అభిమానులను ఇటు రాజకీయనేతల్లోనూ మంచి పొలిటికల్ హీట్ పుట్టిస్తుంది.
జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా మంగళవారం శ్రీనగర్‌లో కాశ్మీర్ మొదటి మల్టీప్లెక్స్‌ను ప్రారంభించనున్నారు. ప్రముఖ థియేటర్ చైన్ ఐనాక్స్ సహకారంతో, బాదామి బాగ్ కంటోన్మెంట్ సమీపంలోని శివపోరా వద్ద మల్టీప్లెక్స్ మొత్తం 520 సీట్ల సామర్థ్యంతో మూడు సినిమా థియేటర్లను కలిగి ఉంది.
మెగా అభిమానులకు మెగా ఫీస్ట్... గాడ్ ఫాదర్ సినిమా నుంచి మరో అప్డేట్ వచ్చేసింది. ఇద్దరు మెగాహీరోలు చిరంజీవి, సల్మాన్ ఖాన్ కలిసి స్టెప్పులేసిన ‘తార్ మార్ తక్కర్ మార్’ సాంగ్ ను నేడు విడుదల చేస్తున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ 12 సంవత్సరాల తరువాత తన గడ్డ అయిన మొగల్తూరుకు వెళ్లనున్నారని తెలిసిన సమాచారం. సెప్టెంబర్ నెల 28న హైద్రాబాద్ నుంచి బయలు దేరి మొగల్తూరుకు వెళ్ళి, అక్కడే రెండు రోజులు ఉండనున్నారని తెలిసింది.
ఎన్నికల కోడ్ ఉల్లంఘనలో తాజాగా మంచు కుటుంబానికి కోర్టులో ఊరట కల్గింది. ఈ మేరకు విచారణను 8వారాలు నిలిపివేస్తూ హైకోర్టు తీర్పు నిచ్చింది.
"ఆషికి 3" చిత్రంలో కార్తిక్ ఆర్యన్ ఈ మూవీలో హీరోగా నటిస్తున్నాడు. అయితే తాజాగా ఈ సినిమాకు హీరోయిన్ గా దక్షిణాది స్టార్ బ్యూటీ రష్మిక మందన్నను ఎంపిక చేశారనే టాక్ వినిపిస్తుంది.
రూ.200 కోట్ల మనీలాండరింగ్ స్కామ్ లో బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఢిల్లీ పోలీస్ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ కార్యాలయానికి విచారణ నిమ్మిత్తం హాజరయింది.