Published On:

NTR Fan Died: క్యాన్సర్‌తో పోరాటం – చివరి కోరిక తీరకుండానే ఎన్టీఆర్‌ అభిమాని మృతి

NTR Fan Died: క్యాన్సర్‌తో పోరాటం – చివరి కోరిక తీరకుండానే ఎన్టీఆర్‌ అభిమాని మృతి

Jr NTR Fan Died: క్యాన్సర్‌తో పోరాడుతున్న ఎన్టీఆర్‌ అభిమానికి కౌశిక్‌ కన్నుమూశాడు. తిరుపతికి చెందిన కౌశిక్‌ అనే వ్యక్తి ఎన్టీఆర్‌ వీరాభిమాని అనే విషయం తెలిసిందే. క్యాన్సర్‌తో ఆస్పత్రి బెడ్‌ ఉండి కూడా ఎన్టీఆర్‌తో తన చిరకాల కోరిక అని, దేవర మూవీ చూశాకే తాను కన్నుమూస్తానంటూ అప్పట్లో చేసిన కామెంట్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. అతడి వీడియో ఎన్టీఆర్‌ దృష్టికి వెళ్లగా.. తన అభిమానిక కోరిక మేరకు తారక్‌ వీడియో కాల్‌లో మాట్లాడి పరామర్శించాడు.

దేవర సినిమా చూడాలి..

“నువ్వు త్వరలోనే కోలుకుంటావు. నీ కోసం నేను ఆ దేవుడిని ప్రార్థిస్తాను. మేమంత నీతోనే ఉంటాం. ధైర్యంగా ట్రీట్‌మెంట్‌ తీసుకో.. వీలు చూసుకుని త్వరలోనే నేను నిన్ను కలుస్తాను. నువ్వు పూర్తిగా కోలుకున్నాక నీతో కలిసి దేవర మూవీ చూస్తాను చూద్దాం” అంటూ మరణంతో పోరాడుతున్న అభిమాని ముఖంలో చిరునవ్వు తెప్పించారు. అంతేకాదు అతడిలో ఆత్మవిశ్వాసాన్ని నింపి క్యానర్స్‌తో పోరాడే ధైర్యం ఇచ్చారు. అతడి చికిత్సకు కూడా ఆర్థిక సాయం అందించారు. కౌశిక్‌ క్యాన్సర్‌ చికిత్స కోసం ఎన్టీఆర్‌ అభిమానులు కూడా విరాళాలు అందించారు.

కోలుకున్న కౌశిక్

అలా అందరి సాయంతో క్యాన్సర్‌కు చికిత్స తీసుకున్న కౌశిక్‌ కోలుకున్నట్టు వైద్యులు తెలిపారు. దీంతో అతడిని డిశ్చార్జ్‌ కూడా చేశారు. క్యాన్సర్‌ నుంచి కోలుకున్నాడని అతడి తల్లిదండ్రులు ఎంతో సంతోషించారు. కానీ ఏమైందో ఏమో తెలియదు కానీ కౌశిక్‌ ఆకస్మాత్తుగా కన్నుమూశాడు. క్యాన్సర్‌ నుంచి కోలుకున్న అతడు మరణించడంతో తిరుపతిలో విషాద ఛాయాలు నెలకొన్నాయి. అయితే పోస్ట్ మెడికల్ కేర్ విషయంలో ఏదో తప్పిదం జరగడం వల్లే కౌశిక్‌ చనిపోయినట్టు తెలుస్తోంది.

హఠాత్తుగా కౌశిక్ చనిపోవడంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కూడా తల్లడిల్లిపోతున్నారు. జూనియర్‌ ఎన్టీఆర్‌ తన అభిమానుల పట్ల ఎంతో ప్రేమగా ఉంటారు. ప్రతి మూవీ ఈవెంట్స్‌లోనూ అందరు జాగ్రత్త ఉండాలని సూచిస్తుంటారు. అంతేకాదు తనకు సంబంధించి ఎలాంటి ఈవెంట్‌లో అయిన ఫ్యాన్స్‌ సమన్వయంతో ఉండాలని కోరుతుంటారు. తన కోసం ఏలాంటి సాహసాలు చేయొద్దని, మీ కుటుంబం గురించి ఆలోచించాలని ఎప్పడూ తన ఫ్యాన్స్‌ ఉద్దేశిస్తూ హెచ్చరిస్తుంటారు. ఇక అభిమానులు కోరికలు తీర్చడంలోనూ ముందుంటారు. కష్టాల్లో ఉన్నవారికి ఆర్థిక సాయం అందిస్తుంటాడనే విషయం తెలిసిందే.