Home / సినిమా వార్తలు
మెగాస్టార్ చిరంజీవి తనయుడుగా తెలుగు సినీ పరిశ్రమలోకి ‘చిరుత’గా అడుగుపెట్టి, ఆ తర్వాత సినిమా ‘మగధీర’తో టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని, రికార్డ్ లన్ని తిరగరాసి మెగా తనయుడు నుంచి మెగా ధీరుడుగా మారాడు. నేటికీ 15 ఏళ్ళు తన నట ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నారు.
పెళ్లి సందD సినిమాలో హీరోయిన్గా నటించిన శ్రీలీల. ఇప్పుడు ఈ ముద్దు గుమ్మ కెరియర్ మూడు పువ్వులు ఆరు కాయలుగా మారింది. ఈ ముద్దుగుమ్మ తీసింది ఒక్క సినిమానే ఐనా తెలుగు ప్రేక్షాధారణ పొంది పెళ్లి సందD సినిమాతో మంచి పాపులారిటీని తెచ్చుకుంది.
విశ్వక్ సేన్ హీరోగా నటించిన సినిమా ఓరి దేవుడా సినిమా నుంచి "అవుననవా " పాట విడుదలైన సంగతి మనకి తెలిసిందే. ఈ పాటలోని లిరిక్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాలో మిథిలా పాల్కర్, ఆశా భట్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు.
రంజిత్, సౌమ్య మీనన్ హీరో హీరోయిన్లుగా రామకృష్ణ పరమహంస ని దర్శకుడి గా పరిచయం చేస్తూ మద్దిరెడ్డి శ్రీనివాస్ నిర్మిస్తున్న చిత్రం లెహరాయి. తాజాగా మేకర్స్ లెహరాయి చిత్రం నుండి "అప్సరస అప్సరస" అనే మరో సాంగ్ ను కూడా విడుదల చేశారు మేకర్స్. గేయ రచయిత శ్రీమణి రచించిన ఈ పాటని రేవంత్ ఆలపించారు.
ఇస్మార్ట్ శంకర్ "తో రామ్ పోతినేని హిట్ కొట్టినప్పటికీ రెడ్ మరియు వారియర్ ఫ్లాప్‌లు అతడిని బాగా దెబ్బతీశాయి. ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం ప్రకారం బోయపాటి శ్రీనుతో రామ్ కొత్త చిత్రం ఫైనాన్స్ సమస్యల కారణంగా ముందుకు సాగలేదు.
మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ చిత్రం నుంచి చిరు, సల్మాన్ ఖాన్ ల పాట విడుదలై అభిమానులను ఉర్రూతలూగించింది. తాజాగా ఈ చిత్రం నుంచి మరోపాటను విడుదల చేసారు మేకర్స్. నజభజ జజర అంటూ ఈ పాట భిన్నంగా సాగుతుంది.
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. తాజాగా టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశంసించే విధంగా ఓ ట్వీట్ చేశారు
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 'గాడ్ ఫాదర్' మూవీపై రోజురోజుకు అభిమానుల్లో అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో "అన్నయ్యా థాంక్యూ అంటూ" చిరంజీవికి సత్యదేవ్ ట్వీట్ చేశారు. మీరు నాకు జీవితంలో గుర్తుండిపోయే ఒక మైలురాయిని ఇచ్చారంటూ సత్యదేవ్ ట్వీట్టర్ వేదికగా వెల్లడించారు.
ప్రముఖ నటి ఆశా పరేఖ్‌ను 2020 సంవత్సరానికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీతగా ఎంపికచేసినట్లు సమాచార మరియు ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు.
డీజే టిల్లు సీక్వెల్ కోసం ప్రేక్షకులు ఈగర్‌గా ఎదురు చూస్తున్న తరుణంలో చిత్ర బృందం తీపి కబురు చెప్పింది. తాజాగా డీజె టిల్లు సీక్వెల్ షూటింగ్ మొదలయ్యింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.