Last Updated:

Asha Parekh: ప్రముఖ నటి ఆశాపరేఖ్‌ కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు

ప్రముఖ నటి ఆశా పరేఖ్‌ను 2020 సంవత్సరానికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీతగా ఎంపికచేసినట్లు సమాచార మరియు ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు.

Asha Parekh: ప్రముఖ నటి ఆశాపరేఖ్‌ కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు

Bollywood: ప్రముఖ నటి ఆశా పరేఖ్‌ను 2020 సంవత్సరానికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీతగా ఎంపికచేసినట్లు సమాచార మరియు ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు.సెప్టెంబర్ 30న జరగనున్న 68వ జాతీయ చలనచిత్ర అవార్డుల వేడుకలో ఈ అవార్డును ఆమెకు అందజేయనున్నారు

ఆశా పరేఖ్  10 సంవత్సరాల వయస్సులో తన నటనా జీవితాన్ని ప్రారంభించింది. దిల్ దేకే దేఖో, కటీ పతంగ్, తీస్రీ మంజిల్, బహరోన్ కే సప్నే, ప్యార్ కా మౌసమ్ వంటి 95 చిత్రాలలో నటించినందుకు ప్రసిద్ధి చెందింది. ఆమె 1952 చిత్రం ఆస్మాన్‌తో చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ను ప్రారంభించింది. రెండు సంవత్సరాల తర్వాత బిమల్ రాయ్ యొక్క బాప్ బేటీలో నటించింది. ఆశా పరేఖ్ నాసిర్ హుస్సేన్ యొక్క 1959 చిత్రం దిల్ దేకే దేఖోలో కథానాయికగా అరంగేట్రం చేసింది. ఇందులో ఆమె షమ్మీ కపూర్ సరసన నటించింది. ఆశా పరేఖ్ 1990ల చివరలో ప్రశంసలు పొందిన టీవీ డ్రామా కోరా కాగజ్‌కి దర్శకనిర్మాతగా వ్యవహరించింది. ఆమె 1998-2001 మధ్య సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ( సిబిఎఫ్ సి ) కి మొదటి మహిళా చైర్‌పర్సన్‌గా పనిచేసింది.

2017లో సినీ విమర్శకుడు ఖలీద్ మొహమ్మద్ ఆమె ఆత్మకధను ది హిట్ గర్ల్ పేరుతో రచించారు. ఆమె 1992లో దేశంలో నాల్గవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీతో సత్కరించబడింది. 2019కి గాను దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు రజనీకాంత్‌కు లభించిన విషయం తెలిసిందే.

 

ఇవి కూడా చదవండి: