Home / సినిమా వార్తలు
టాలీవుడ్ లో స్టైలిష్ స్టార్ గా పేరుగాంచిన అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈ యంగ్ డైనమిక్ హీరో క్రేజ్ ‘పుష్ప’ సినిమాతో ఖండాంతరాలు దాటింది. సౌత్, నార్త్ అని తేడాలేకుండా ప్రస్తుతం ఎక్కడ చూసిన బన్నీ హవానే కనిపిస్తుంది. కాగా ఇప్పుడు తాజా బన్నీ మరో అత్యున్నత అవార్డును అందుకున్నాడు.
జస్ట్ ఆర్టినర్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.2 మూవీగా రూపొందుతోన్న చిత్రం ‘మాయా పేటిక’. రమేష్ రాపార్తి దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రానికి మాగుంట శరత్ చంద్రా రెడ్డి, తారక్నాథ్ బొమ్మి రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రెబల్ స్టార్ ప్రభాస్ చిత్రంలో అతిధి పాత్రలో కనిపించనున్నారు. ప్రబాస్ నటిస్తున్న ప్రాజెక్ట్ కె నిర్మాతలు రామ్ గోపాల్ వర్మను ఒక చిన్న పాత్ర కోసం సంప్రదించారు. దానికి ఆయన ఓకే చెప్పినట్లు సమాచారం.
ఆ నటుడి ఎంట్రీ సాధరణమే. నటించిన చిత్రాల విజయాలు కూడా తక్కువే. కాని, విజయ చక్రాలెక్కిన ఆ చిత్రలే అతడిని దేశ వ్యాప్తంగా ప్రేక్షకుల మద్య ఠీవిగా నిలబడేలా చేసింది. బాహుబలి హీరోగా అభిమానుల గుండెల్లో సుస్ధిర స్థానాన్ని ఏర్పరుచుకొన్నాడు. అతగాడే ఆరడుగుల ఆజానుబాహుల ప్రభాస్
అందాలరాక్షసి సినిమాతో అరంగేట్రం చేసిన ఈ సొట్టబుగ్గల సుందరి లావణ్య త్రిపాఠిని తెలుగు ప్రేక్షకులు బాగా అభిమానించారు. సోగ్గాడే చిన్నినాయనా, భలేభలే మగాడివోయ్, చావుకబులు చల్లగా లాంటి సినిమాలతో ఈ ముద్దుగుమ్మకు మంచి క్రేజ్ వచ్చింది. అయోధ్యలో పుట్టిన ఈ అందాల తార తెలుగు, తమిళం, హిందీభాషల్లో పలు సినిమాల్లో నటించారు.
సమంత ఎంట్రీ మూవీలో చాలా సింపుల్‌గా ఉందని, వరలక్ష్మి శరత్ కుమార్, ఉన్ని ముకుందన్ చాలా బాగా నటించినట్లు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ట్విట్టర్లో సమంత మీద ప్రశంసల వర్షం కురుస్తోంది.
ఉదయ్ శంకర్ హీరోగా నటించిన రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ "నచ్చింది గాళ్ ఫ్రెండూ". జెన్నీఫర్ ఇమ్మాన్యుయేల్ నాయికగా నటించింది. ఈ చిత్రాన్ని శ్రీరామ్ మూవీస్ బ్యానర్ పై అట్లూరి ఆర్ సౌజన్య సమర్పణలో అట్లూరి నారాయణ రావు నిర్మించారు.
ప్రముఖ ఎడిటర్ స్వర్గీయ కోలా భాస్కర్ తనయుడు కోలా బాలకృష్ణ హీరోగా, సాక్షి చౌదరి హీరోయిన్ గా నటించిన చిత్రం 'నేనెవరు'. ఈ చిత్రం నవంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య త్వరలోనే ఓ ఇంటివాడు అవనున్నాడు. ఈ నెల 20న బెంగళూరులో అనూష అనే యువతితో ఏడడుగులు వేయనున్నాడు ఈ స్మార్ హీరో.
వాలీ మోహన్‌దాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘రంగోలి’’ సినిమాతో బాలనటునిగా నటించిన హమరేశ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. కాగా ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను పలువురు ఇండ్రస్ట్రీ ప్రముఖులు తమ సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు.