Last Updated:

Nenevaru: ఈ నెల 25న రిలీజవుతున్న ‘నేనెవరు’

ప్రముఖ ఎడిటర్ స్వర్గీయ కోలా భాస్కర్ తనయుడు కోలా బాలకృష్ణ హీరోగా, సాక్షి చౌదరి హీరోయిన్ గా నటించిన చిత్రం 'నేనెవరు'. ఈ చిత్రం నవంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

Nenevaru: ఈ నెల 25న రిలీజవుతున్న ‘నేనెవరు’

Tollywood: ప్రముఖ ఎడిటర్ స్వర్గీయ కోలా భాస్కర్ తనయుడు కోలా బాలకృష్ణ హీరోగా, సాక్షి చౌదరి హీరోయిన్ గా నటించిన చిత్రం ‘నేనెవరు’. ఈ చిత్రం నవంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. నిర్ణయ్ పల్నాటి దర్శకత్వం వహించిన చిత్రానికి భీమినేని శివప్రసాద్-తన్నీరు రాంబాబు నిర్మాతలు.

ఇటీవల విడుదలైన టీజర్ కు అనూహ్య స్పందన లభిస్తోందని, లవ్ – సస్పెన్స్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రం కచ్చితంగా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతుందని దర్శకుడు నిర్ణయ్ పల్నాటి తెలిపారు. హీరో కోలా బాలకృష్ణ, దర్శకుడు నిర్ణయ్, సంగీత దర్శకుడు ఆర్.జి.సారథిలకు చిత్రం చాలా మంచి పేరు తెస్తుందని నిర్మాతలు పేర్కొన్నారు.

ఈ చిత్రంలో తనిష్క్ రాజన్, గీత్ షా సహాయ పాత్రల్లో, బాహుబలి ప్రభాకర్ విలన్ గా నటించారు. రాజా రవీంద్ర, దిల్ రమేష్, డి.ఎస్.రావు తాగుబోతు రమేష్, వేణు, సుదర్శన్ రెడ్డి, నీరజ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. రాధ గోపి తనయుడు ఆర్.జి.సారథి ఈ చిత్రం ద్వారా సంగీత దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

 

 

follow us

సంబంధిత వార్తలు

Most Viewed Articles