Published On:

Puri- Setupathi: మరో స్టార్ ను దింపిన పూరి.. క్యాస్టింగ్ బావుంది.. కథ కూడా బావుంటే..

Puri- Setupathi: మరో స్టార్ ను దింపిన పూరి.. క్యాస్టింగ్ బావుంది.. కథ కూడా బావుంటే..

Puri- Setupathi: ఇండస్ట్రీ ఎలాంటిది అంటే.. 10 హిట్లు పడినా ప్రశంసించదు కానీ, అదే ఒక ప్లాప్ పడితే మాత్రం పాతాళానికి పడిపోయేలా ట్రోల్ చేస్తుంది. అలా ట్రోల్ చేసిన డైరెక్టర్స్ లో పూరి జగన్నాథ్ ఒకడు. ఆయన ఇండస్ట్రీకి ఎలాంటి హిట్స్ ఇచ్చాడు అనేది అందరికీ తెల్సిందే. కానీ, కొన్ని ప్లాప్స్ వచ్చేసరికి మాత్రం ఫ్యాన్స్.. పూరి పని అయిపోయిందని చెప్పుకొస్తున్నారు. లైగర్, డబుల్ ఇస్మార్ట్ సినిమాలు ఎలాంటి పరాజయాన్ని అందుకున్నయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

 

ఇక పూరి ఇప్పుడు ఎలాగైనా బౌన్స్ బ్యాక్ అవ్వాలని చూస్తున్నాడు. అందుకు తగ్గట్టే పావులు కదుపుతున్నాడు.  ఎలాగోలా తన కథతో స్టార్ హీరో విజయ్ సేతుపతిని ఒప్పించి బెగ్గర్ సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమా కోసం స్టార్ లను రంగంలోకి దింపుతున్నాడు. ఇప్పటికే ఈ చిత్రంలో రాధికా ఆప్టే, టబు నటిస్తున్నారు. ఇక తాజాగా మరో స్టార్ ను రంగంలోకి దింపాడు. వీరసింహారెడ్డి సినిమాతో తెలుగుకు పరిచయమైన కన్నడ నటుడు దునియా విజయ్.. ఇప్పుడు పూరి సేతుపతి సినిమాలో ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

 

“కర్ణాటక దేశం నుండి దేశవ్యాప్తంగా ప్రేక్షకుల హృదయాలకు చేరువైన నటుడు. ప్రతి ఒక్కరినీ మంత్రముగ్ధులను చేసే అద్భుతమైన పాత్ర కోసం పూరిసేతుపతి బృందం శాండల్‌వుడ్ డైనమో, నటుడు విజయ్‌కుమార్‌ను గర్వంగా స్వాగతిస్తోంది” అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది.

 

అయితే ఇంతమందిని స్టార్స్ ను దింపడం బావుంది కానీ, కథ కూడా బావుంటే ఇంకా బావుంటుంది. కథ లేకుండా ఇంతమంది స్టార్స్ ను తీసుకొని ప్రయోజనం ఏం ఉంటుంది అంటూ చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న  ఈ సినిమాతో పూరి తన సత్తా చుపిస్తాడేమో చూడాలి. 

ఇవి కూడా చదవండి: