Deepika Padukone : మేము ఆ టైమ్ ని కూడా షెడ్యూల్ చేసుకుంటాం అంటున్న దీపికా పదుకొణె..
Deepika Padukone:దీపికా పదుకొణె ఎప్పుడు సినిమాలతో ఫుల్ బిజీ గా వుండే ఈ ముద్దు గుమ్మ ఈ మద్య సోషల్ మీడియా లో బాగా కనిపిస్తుంది. ఇటీవలే ‘జవాన్’లో కనిపించి ఆకట్టుకున్నారు.ఇప్పుడు తన మరో సినిమా షూటింగ్ లో వుండగా తన బిజీ లైఫ్ గురించి కొన్నిమాటలు ఇలా చెప్పుకుంది. తన భర్త
Deepika Padukone : బాలీవుడ్ బ్యూటీ “దీపికా పదుకొణె”.. ఎప్పుడు సినిమాలతో ఫుల్ బిజీ గా వుండే ఈ ముద్దు గుమ్మ ఈ మద్య సోషల్ మీడియా లో బాగా కనిపిస్తుంది. ఇటీవలే ‘జవాన్’లో కనిపించి ఆకట్టుకున్నారు.ఇప్పుడు తన మరో సినిమా షూటింగ్ లో వుండగా తన బిజీ లైఫ్ గురించి కొన్నిమాటలు ఇలా చెప్పుకుంది. తన భర్త రణ్‌వీర్‌తో కలిసి సమయాన్ని గడపడం ఎంతో ఇష్టమని దీపికా పదుకొణె చెప్పారు. అందుకోసం ప్రత్యేకంగా సమయాన్ని షెడ్యూల్ చేసుకుంటామని ఆమె వెల్లడించారు.
బాలీవుడ్ స్టార్స్ అయిన రణ్‌వీర్ సింగ్ – దీపికా పదుకొణె ఇద్దరు ఎప్పుడూ సినిమాలతో బిజీగా ఉంటారు. అందుకే వాళ్లిద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి కూడా సమయాన్ని షెడ్యూల్ చేసుకుంటారట. తాజాగా ఓ ఇంటర్వ్యూలో దీపికా ఈ విషయాన్ని గూర్చి వెల్లడించారు. ప్రస్తుతం దీపికా మాటలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.
దీపికా ‘నా భర్తతో సమయం గడపడం నాకు చాలా ముఖ్యం. కానీ, మా ఇద్దరికీ అంత తీరిక ఉండదు. ఇద్దరం వృత్తిపరంగా చాలా బిజీగా ఉంటాం. ఒక్కోసారి నెల రోజుల పాటు షూటింగ్ కోసం ప్రయాణం చేయాల్సి వస్తుంటుంది. లేదంటే ఆయన చిత్రీకరణ అయిపోయి ఇంటికి వచ్చే సమయానికి నేను షూటింగ్‌కు వెళ్లాల్సి రావొచ్చు. అర్ధరాత్రి, తెల్లవారు జామున ఇలా ఎప్పుడంటే అప్పుడు షూటింగ్‌ల కోసం బయటకు వెళ్లాల్సి ఉంటుంది. అందుకే మేం కలిసి గడపాల్సిన సమయాన్ని కూడా షెడ్యూల్ చేసుకుంటాం.
ఎంత సమయం గడిపామన్నది ముఖ్యం కాదు. గడిపిన కొంత సమయాన్ని ఎంత ఎంజాయ్ చేశామనేది ముఖ్యం. మేమిద్దరం ఏకాంతంగా ఉండే సమయాన్ని ఎంత ఇష్టపడతానో.. మా కుటుంబాలతో గడపడాన్ని కూడా అంతే ఇష్టపడతా. డ్యాన్స్ అంటే మాకు చాలా ఇష్టం. వారాంతాల్లో కొన్నిసార్లు నేను, రణ్‌వీర్ కలిసి తెల్లవారుజామున నాలుగు గంటల వరకు డ్యాన్స్ చేస్తాం’ అంటూ చెప్పారు. సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం దీపికా ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ‘కల్కి 2898 ఏడీ’లో నటిస్తున్నారు. ‘రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ’తో సందడి చేసిన రణ్‌వీర్ ‘సింగం అగైన్’ చిత్రంతో బిజీగా ఉన్నారు.