Deepika Padukone: ఏకంగా ఆ హీరోతో ఆరోసారి రొమాన్స్ చేయనున్న కల్కి బ్యూటీ..?

Deepika Padukone: హిట్ పెయిర్స్ ఎప్పుడు కనిపించినా.. అభిమానులు వారిని ఆదరిస్తూనే ఉంటారు. కొన్నిసార్లు సినిమాలో వారి మధ్య కెమిస్ట్రీ ఎలా ఉంటుంది అంటే.. ఈ జంట బయట కూడా పెళ్లి చేసుకుంటే బావుండు అనుకోక మానరు. అలాంటి హిట్ పెయిర్స్ లో బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్, దీపికా పదుకొనె ఒకటి. బాలీవుడ్ లో ఎన్ని హిట్ జోడీలు ఉన్నా వీరి తర్వాతే ఎవరైనా అని చెప్పొచ్చు. ఇప్పటికే వీరు 5 సినిమాల్లో జంటా కనిపించారు.
దీపికాకు మొదటి హిట్ ఓం శాంతి ఓం సినిమాతో వచ్చింది. ఆ సినిమాలో హీరో షారూఖ్ నే. ఇక ఈ సినిమా తరువాతా వీరి కాంబోలో చెన్నై ఎక్స్ ప్రెస్, హ్యాపీ న్యూ ఇయర్, పఠాన్, జవాన్ సినిమాలు వచ్చాయి. బాలీవుడ్ లోనే హిట్ కాంబోగా పేరు తెచ్చుకున్న ఈ జంట.. ఇప్పుడు మరోసారి అభిమానులను అలరించడానికి సిద్ధవుతున్నారు.
ప్రస్తుతం షారుఖ్ ఖాన్ నటిస్తున్న చిత్రాల్లో కింగ్ ఒకటి. సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో షారుఖ్ కుమార్తె సుహానా ఖాన్ కూడా నటిస్తోంది. ఇక అభిషేక్ బచ్చన్ విలన్ గా నటిస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో షారుఖ్ సరసన 6 వ సారి దీపికా నటిస్తోంది. జవాన్ లో కొద్దిసేపు మాత్రమే మెరిసిన ఈ భామ.. కింగ్ లో కీలక పాత్రలోనే మెరవనుందనీ తెలుస్తోంది.
ఇక ఈ సినిమా కాకుండా దీపికా బాలీవుడ్ లో మరో రెండు ప్రాజెక్ట్స్ ను ఓకే చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కల్కి తో తెలుగుతెరకు ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. ఆ తరువాత ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చి.. కొద్దిగా సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. మళ్లీ ఇప్పుడు ఈ భామ రంగంలోకి దిగిందని తెలుస్తోంది. మరి ఆరోసారి కూడా ఈ కాంబో హిట్ అందుకుంటుందా..? లేదా..? అనేది చూడాలి.