Bichagadu: బిచ్చగాడు సినిమాకు, నోట్ల రద్దు కు ఉన్న లింకేంటీ?
విజయ్ ఆంటోనీ స్వీయ దర్శకత్వంలో ‘బిచ్చగాడు 2’ చిత్రం మే 19న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన విషయం తెలిసిందే. విజయ్ ఆంటోనీ స్వీయ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో హీరోయిన్ గా కావ్య థాపర్ నటించింది.
Bichagadu: విజయ్ ఆంటోనీ స్వీయ దర్శకత్వంలో ‘బిచ్చగాడు 2’ చిత్రం మే 19న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన విషయం తెలిసిందే. విజయ్ ఆంటోనీ స్వీయ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో హీరోయిన్ గా కావ్య థాపర్ నటించింది. భారీ ఎత్తున రిలీజ్ అయిన ఈ చిత్రం మంచి టాక్ తెచ్చుకుని కలెక్షన్స్ రాబడుతోంది. అయితే ఈ సినిమా రిలీజ్ అయిన రోజే రూ. 2000 నోటును వెనక్కి తీసుకుంటున్నట్టుగా రిజర్వ్ బ్యాంక్ ఇండియా ప్రకటించింది.
అప్పుడు 500.. ఇపుడు 2000(Bichagadu)
బిచ్చగాడు 2 కి, రూ. 2 వేల నోటు ఉపసంహరణకు ఏంటీ సంబందం అనుకుంటున్నారా? అయితే, గతంలో బిచ్చగాడు సినిమా విడుదలైన ఏడాదిలోనే రూ. 500, రూ. 1000 నోట్లను రిజర్వ్ బ్యాంక్ ఆప్ ఆండియా రద్దు చేసింది. ప్రస్తుతం బిచ్చగాడు 2 విడుదల అయిన రోజే మళ్లీ రూ. 2 వేల నోటు వెనక్కి తీసుకుంటున్నట్టు ఆర్బీఐ వెల్లడించింది. దీంతో ఈ సినిమాకు, ఆ నోట్లకు ఏదో లింక్ ఉందని సోషల్ మీడియాలో మీమ్స్ , కామెంట్స్ హల్ చల్ చేస్తున్నాయి. 2016లో ఇండియాలోరూ. 500, రూ. 1000 నోట్లను రద్దు చేస్తూ కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అదే 2016 లో విజయ్ ఆంటోని బిచ్చగాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మళ్లీ ఇపుడు అంటే.. 2023 లో బిచ్చగాడు 2 రిలీజ్ అయింది.. ఇదే సమయానికి రూ. 2 వేల నోటును ఉపసంహరించుకున్నారు. దీంతో నోట్ల రద్దు పై బిచ్చగాడు ప్రభావం ఎంతో ఉందని నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ చేసుకుంటున్నారు.
బిచ్చగాడు టైమ్ లో 500/1000 నోట్ల ఉపసంహరణ
బిచ్చగాడు-2 రిలీజ్ టైమ్ కి 2000 నోట్ల ఉపసంహరణ
———————
ఈ లింకేమిటి సామీ? pic.twitter.com/N7xM4XtAsV— Nellore PeddaReddy (@Tenali_RK) May 19, 2023
రద్దుకు కారణమేంటంటే..
రిజ్వర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. రూ. 2 వేల నోట్లను ఉపసంహరించుకుంటూ శుక్రవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. తక్షణమే ఈ నోట్ల జారీని నిలిపివేయాలని బ్యాంకులను కూడా ఆదేశించింది. సెప్టెంబర్ 30 వరకు నోట్ల మార్పడి చేసుకోవాలని ప్రజలకు అవకాశం కల్పించింది. దేశంలో ఉన్న 19 ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో రూ. 2 వేల నోట్లు మార్చుకునే వీలు కల్పిస్తున్నట్టు పేర్కొంది. 2016 నోట్ల రద్దు సందర్భంగా రూ. 2 వేల నోట్లను ఆర్బీఐ చలామణిలోకి తీసుకువచ్చింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలోనే రూ. 2 వేల నోట్ల ముద్రణ నిలిపివేశామని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఇప్పుడు పూర్తి స్థాయిలో ఇతర డినామినేషన్‌కి చెందిన నోట్లు దేశ ప్రజల కరెన్సీ అవసరాలకు సరిపోయే మోతాదులో ఉండటంతో ‘క్లీన్ నోట్ పాలసీ’ కింద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ. 2000 నోట్లను రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించింది.