Last Updated:

Avatar 2 : రిలీజ్ కి ముందే అవతార్ 2 పైరసీ…

ప్రఖ్యాత హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన దృశ్య కావ్యం " అవతార్ - థి వే ఆఫ్ వాటర్ ". నేడు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే అందరికీ షాక్ ఇస్తూ

Avatar 2 : రిలీజ్ కి ముందే అవతార్ 2 పైరసీ…

Avatar 2 : ప్రఖ్యాత హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన దృశ్య కావ్యం ” అవతార్ – థి వే ఆఫ్ వాటర్ “. నేడు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే అందరికీ షాక్ ఇస్తూ ప్రస్తుతం ఈ సినిమా పైరసీ ఆన్‭లైన్‭లో చక్కర్లు కొడుతోంది. రిలీజ్ కి ఒక రోజు ముందే ఈ సినిమా పైరసీ బారిన పడడం సినీ ప్రేక్షకులు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. 52 వేల స్క్రీన్స్ పైగా భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతున్న ఈ చిత్రం పైరసీకి గురి కావడం పట్ల సినీ ప్రముఖులు అంతా పెదవి విరుస్తున్నారు.

కాగా 2009 లో రిలీజ్ అయిన అవతార్ కి సీక్వెల్ గా ఈ సినిమా రానుంది. 160 దేశాల్లో పలు భాషల్లో రిలీజ్ అయిన ఈ సినిమా 20 వేల కోట్ల రూపాయలను వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఇప్పటి వరకు ఈ సినిమా రికార్డును ఏ సినిమా బ్రేక్ చేయలేకపోవడం గమనార్హం. ప్రపంచ వ్యాప్తంగా సినిమా రికార్డులన్నింటిని బద్దలు కొట్టిన అవెంజర్స్‌ ఎండ్‌ గేమ్‌ సైతం ఈ సినిమా కలెక్షన్లను క్రాస్ చేయలేకపోయింది. దీంతో ఆ రికార్డును మళ్ళీ జేమ్స్ కామెరూన్ అవతార్ 2 తో బీట్ చేస్తారని అంతా భావించారు. 13 ఏళ్ల తర్వాత ఆ మూవీకి సీక్వెల్ వస్తున్న ఈ తరుణంలో సినిమా ఇలా పైరసీ కావడం కలెక్షన్లను దెబ్బతీసేలా ఉందని సినీ ట్రేడ్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఎప్పటి నుంచో ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ఇది ఖచ్చితంగా షాకింగ్ న్యూస్ అని చెప్పాలి. ఇక ఈ సినిమా పైరసీ వీడియో ఇప్పటికీ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండటంతో, ఈ సినిమా డౌన్‭లోడ్ చేసుకుని చూడడమే కాకుండా, సినిమాపై తమ అభిప్రాయాలు సైతం వెల్లడిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలలో సైతం భారీ ఎత్తున బుకింగ్స్ చేసుకున్న ఈ సినిమా పట్ల ఆడియన్స్ లో వ రేంజ్ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆ విజువల్స్, యాక్షన్ సీన్స్ థియేటర్ లో చూసే అనుభూతి పొందాలని వెయిట్ చేస్తున్నారు. మరోవైపు సైబర్ పోలీసులు కూడా దీనిపై యాక్షన్ తీసుకునేందుకు చర్యలు చేపట్టినట్లు సమాచారం అందుతుంది.

ఇది కూడా చదవండి… అవెంజర్స్ ఎండ్ గేమ్ రికార్డు బ్రేక్ చేసిన అవతార్ 2 … ఏకంగా అన్ని వేల థియేటర్స్ లో రిలీజ్

 

ఇవి కూడా చదవండి: