Kalki 2 Shooting Update: ప్రభాస్ ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్ – ‘కల్కి 2’ షూటింగ్ అప్పుడే స్టార్ట్, బిగ్‌బి ఏమన్నారంటే!

Amitabh Bachchan Joins in Kalki 2 Shooting Soon: ప్రభాస్ చేతిలో ప్రస్తుతం అరడజన్‌పైగా సినిమాలు ఉన్నాయి. అన్నీ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్. అందులో ‘కల్కి 2’ ఒకటి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఎంతటి బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. విడుదలైన అన్ని భాషల్లోనూ సంచలనం సృష్టించింది. గతేడాది జూన్ 27న రిలీజైన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. నాగ్ అశ్విన్ విజన్, క్రియేటివిటీని ప్రతి ఒక్కరు కొనియాడారు. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్విన్ దత్ నిర్మించారు.
లోకనాయకుడు కమల్ హాసన్, బాలీవుడ్ బిగ్‌బి అమితాబ్ బచ్చన్, రాజేంద్రప్రసాద్, దీపికా పదుకొనె, దిశా పటానీ, శోభన, బ్రహ్మానందం వంటి అగ్రతారలు ముఖ్యపాత్రలో నటించారు. ఈ సినిమా రెండు పార్టులుగా వస్తున్న సంగతి తెలిసిందే. తొలి పార్ట్ విడుదలై బ్లాక్‌బస్టర్ విజయం సాధించింది. దీంతో రెండో పార్టు భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫస్ట్ పార్టు విడుదలై ఏడాది కావోస్తోంది. ఇంకా కల్కి 2కి సంబంధించి ఎలాంటి అప్‌డేట్స్ రావడం లేదు.
ఫౌజీ, ది రాజా సాబ్ తో బిజీ
ప్రస్తుతం ప్రభాస్ ఫౌజీ, ది రాజా సాబ్‌చిత్రాల షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. మరోవైపు సర్జరీ నిమిత్తం విదేశాలకు వెళ్లాడు. దీంతో ఇప్పట్లో కల్కి 2 షూటింగ్ మొదలయ్యే అవకాశం కనిపించడం లేదని అభిమానులంతా నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల బిగ్‌బి అమితాబ్ చేసిన కామెంట్స్ డార్లింగ్ ఫ్యాన్స్‌ని ఖుషి చేస్తోంది. అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యతగా ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ అనే రియాలిటీ షో వస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ షో లేటెస్ట్ సీజన్ పూర్తి చేసుకుంది. ఈ షో ఫినాలే తర్వాత అమితాబ్ బచ్చన్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన నెక్ట్స్ ప్లాన్ ఏంటీ? కొత్త సీజన్ ఎప్పుడనేది మీడియా ప్రశ్నించింది.
కల్కి 2 షూటింగ్ కి బిగ్ బి
దీనికి బిగ్‌బి స్పందిస్తూ.. తాను నెక్ట్స్ కల్కి 2 షూటింగ్‌లో పాల్గొంటానని చెప్పారట. ఆయన మాటలను బట్టి చూస్తే కల్కి 2 షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుందని తెలుస్తోంది. మేలో ఈ క్రెజీ సీక్వెల్ షూటింగ్ సెట్స్‌పైకి రానుందట. జూన్ 15 వరకు ఈ షెడ్యూల్ కొనసాగుతుందని, ఇందులో బిగ్‌బితో పాటు ప్రభాస్, ఇతర కీలక పాత్రలు పాల్గొంటాయని సమాచారం. ఇది తెలిసి డార్లింగ్ ఫ్యాన్స్ అంతా ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీ నిర్మాతలు స్వప్న-ప్రియాంక ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘కల్కి 2 – 2898 ఏడీ’కి సంబంధించిన దాదాపు 35 శాతం షూటింగ్ జరిగినట్టు చెప్పిన సంగతి తెలిసిందే.