Last Updated:

Alia Bhatt: కూతురు ఫొటోలు డిలీట్‌ చేసిన ఆలియా భట్‌ – కారణమేంటంటే!

Alia Bhatt: కూతురు ఫొటోలు డిలీట్‌ చేసిన ఆలియా భట్‌ – కారణమేంటంటే!

Alia Bhatt Deletes Raha Pics: సినీ సెలబ్రిటీలు తమ పిల్లల విషయంలో చాలా గొప్యత పాటిస్తున్నారు. వారి ప్రైవసికి భంగం కలగకుండ ఉండేందుకు వారిని మీడియాకు దూరంగా ఉంచుతున్నారు. చాలా మంది సెలబ్రిటీలు తమ పిల్లలను బయట ప్రపంచానికి పరిచయం చేయకుండి ప్రైవసీ మెయింటైయిన్‌ చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో వారి ముఖాలు కనిపించకుండ ఫోటోలు పోస్ట్‌ చేస్తున్నారు. మీడియా కంటపడ్డ ఫేస్‌ కనిపించకుండ చేతులు అడ్డుపెడ్డుతున్నారు.

సెలబ్రిటీ కపుల్‌ విరాట్‌ కోహ్లి, అనుష్క శర్మల కూతురు వామికను ఇప్పటి వరకు పరిచయం చేయలేదు. ఆమె పుట్టి మూడేళ్లుపైనే అవుతున్నా ఇంతవరకు వామిక ముఖాన్ని రివీల్‌ చేయలేదు. అలాగే కొడుకు విషయంలోనూ అంతే గొప్యత పాటిస్తున్నారు. అలాగే రామ్‌ చరణ్‌, ఉపాసన దంపతులు కూడా క్లింకారను ఇంతవరకు చూపించలేదు. అయితే అలియా భట్‌ మొదట కూతురు రహా విషయంలో ప్రైవసీ మెయింటెయిన్‌ చేసిన గతేడాది క్రిస్మస్‌ సందర్భంగా కూతురిని మీడియాకు పరిచయం చేసింది. అంతేకాదు కూతురితో గడిపిన ఆనంద క్షణాలను కూడా సోషల్‌ మీడియాలోనూ పంచుకుంది. అయితే ఇప్పుడు సడెన్‌గా రహా ఫొటోలను డిలీట్‌ చేసింది.

తన ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి ఫోటో కూతురి ఫోటోలను తొలగించి అందరికి షాకిచ్చింది. ఆమె కనిపించని ఒకటి రెండు ఫోటోలు తప్పితే రహా ఫేస్‌ కనిపించేలా ఉన్న ఫోటోలన్నింటిని డిలీట్‌ చేసింది. ప్రస్తుతం ఈ అంశం సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది. అలియా ఈ నిర్ణయం వెనకు అసలు కారణం ఏంటనేది తెలియదు. కానీ, ఆమె డెసిజన్‌కి మాత్రం కొందరు మద్దతు ఇస్తుంటే మరికొద్దరు తప్పుబడుతున్నారు. “ఒక తల్లిగా తన కూతురు సంరక్షణ కోసం ఎలాంటి నిర్ణయమైన తీసుకోవచ్చు”, “మంచి నిర్ణయం తీసుకున్నారు”, “నిజం చెప్పాలంటే తన నిర్ణయం చాలా మంచిది.. మీడియా అర్థం చేసుకుని వారిని ఇబ్బంది పెట్టుకుండ, పిల్లల ప్రైవసిని రెస్పెక్ట్‌ చేస్తుందని ఆశిస్తున్నా” అంటూ నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు.

రహా క్యూట్‌ స్మైల్‌, తను మీడియాకు ఆనందంగా హాయ్‌ చెప్పడాన్ని కొందరు పిచ్చి జనాలు తట్టుకోలేకపోతున్నారని, దీంతో రహా అటెన్షన్‌ డిజార్డర్‌ ఉందంటూ చెత్త కామెంట్స్‌ పెడుతున్నారు. ఇలాంటి నెగిటివిటీ నుంచి రహాను దూరంగా ఉంచడం మంచిదే అంటున్నారు. అయితే ఇటీవల సైఫ్‌ అలీఖాన్‌పై దాడి జరిగిన తర్వాత భద్రత కోసం కరీనా కపూర్‌, సైఫ్‌లు తమ పిల్లల ఫోటోలను తీయొద్దని మీడియాకు నిబంధనలు పెట్టిన సంగతి తెలిసిందే. ఇక వారిని ఫాలో అవుతూ రహా రక్షణ, భద్రతలో భాగంగా అలియా ఈ నిర్ణయం తీసుకుందని సన్నిహితులు నుంచి సమాచారం.