Published On:

Hansika Motwani: గృహ హింస కేసు.. హైకోర్టుకు హన్సిక

Hansika Motwani: గృహ హింస కేసు.. హైకోర్టుకు హన్సిక

Hansika Motwani: బబ్లీ బ్యూటీ హన్సిక మోత్వానీ హైకోర్టును ఆశ్రయించింది. తనపై, తన కుటుంబంపై ఉన్న కేసును కొట్టివేయాలని ఆమె బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. హన్సిక అన్న ప్రశాంత్  మోత్వానీ భార్య, టీవీ నటి ముస్కాన్ జేమ్స్ .. భర్త కుటుంబంపై గృహ హింస కేసు పెట్టింది.  2020 లో పెళ్లి చేసుకున్న ఈ జంట.. రెండేళ్లు కూడా కలిసి ఉండలేదు. గతేడాది  ముంబై అంబోలి పోలీస్ స్టేషన్‌లో ముస్కాన్.. అత్తింటివారిపై కేసు నమోదు చేసింది.

 

హన్సిక, ఆమె తల్లి.. తమ కుటుంబ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారని, తన భర్త నుంచి వేరు చేయడానికి గొడవలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని ముస్కాన్ ఆరోపించింది. తన భర్త ప్రశాంత్ కూడా గృహ హింసకు  పాల్పడ్డాడని, వారు పెట్టిన ఒత్తిడి వలనే తనకు నాడీ సంబంధిత వ్యాధి వచ్చినట్లు ఆమె తెలిపింది.

 

ఇక ఈ కేసు ప్రస్తుతం కోర్టులో నడుస్తోంది. ఇక తాజాగా హన్సిక.. తన కుటుంబంపై ఉన్న కేసును కొట్టివేయాలని హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ సరంగ్ కోత్వాల్ , జస్టిస్ ఎస్.ఎం. మోదక్‌ లతో కూడిన ధర్మాసనం ముస్కాన్ కు నోటీసులు జారీ చేసింది. జూలై 3 కు ఈ కేసును వాయిదా వేసింది.

 

హన్సిక గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశముదురు సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన ఈ భామ.. స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది.  ఇక తెలుగులోనే కాకుండా తమిళ్ లో కూడా తన సత్తా చూపించింది. అక్కడ శింబుతో ప్రేమాయణం నడిపి మరింత గుర్తింపును తెచ్చుకుంది.

 

కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే హన్సిక.. తన బెస్ట్ ఫ్రెండ్ భర్తను రెండో వివాహం చేసుకుంది. వీరిద్దరి ప్రేమ, పెళ్లి  డాక్యుమెంటరీగా కూడా రిలీజ్ అయ్యింది. ఇకపోతే ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ వస్తున్న హన్సిక ఒక డ్యాన్స్ షోకు జడ్జిగా కూడా వ్యవహరిస్తోంది. మరి అంతకుముందులా ఈ చిన్నది తెలుగులో నిలదొక్కుకుంటుందో లేదో చూడాలి.