Published On:

Telangana Inter Board: ఇంటర్ అకడమిక్ క్యాలెండర్ రిలీజ్.. దసరా, సంక్రాంతికి 8 రోజులే సెలవులు!

Telangana Inter Board: ఇంటర్ అకడమిక్ క్యాలెండర్ రిలీజ్.. దసరా, సంక్రాంతికి 8 రోజులే సెలవులు!

Telangana Board of Intermediate Education 2025-2026 Calendar Released: తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని జూనియర్ కళాశాలలకు సంబంధించిన జనరల్, ఒకేషనల్ కోర్సులను కవర్ చేస్తూ 2025-26 అకడమిక్ క్యాలెండర్ విడుదల చేసింది. మొత్తం విద్యాసంవత్సరానికి గానూ 226 రోజుల పాటు కళాశాలలు నడవనున్నాయి.

 

అలాగే, 2025-26 ఏడాదికి గానూ ప్రొవిజినల్ అప్లికేషన్ పొడిగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే జూనియర్ కళాశాలల యాజమాన్యం నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. దీంతో పాటు ఈ విద్యాసంవత్సరానికి దసరా సెలవులను సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 5 వరకు దసరా సెలవులు ఇవ్వనున్నట్లు తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ తెలిపింది.

 

అంతేకాకుండా, సంక్రాంతి సెలవులు జనవరి 11 నుంచి 18 వరకు సెలవులు ప్రకటించింది. ఇక, జూన్ 2 నుంచి కళాశాలలు ప్రారంభం కానుండగా.. మొత్తం 226 పనిదినాలు ఉండనున్నాయి. జనవరి చివరి వారంలో ఫ్రీఫైనల్ పరీక్షలు, ఫిబ్రవరి మొదటి వారంలో ప్రాక్టికల్స్, మార్చి మొదటి వారంలో పబ్లిక్ ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు. కాగా, ఈ విద్యా సంవత్సరం చివరి పని దినాన్ని 2026 మార్చి 31గా నిర్ణయించారు.

ముఖ్య తేదీలు ఇవే..

జూనియర్ కళాశాలలు పున:ప్రారంభం: 2025 జూన్ 2,
దసరా సెలవులు: 2025 సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 2,
హాఫ్ ఇయర్ పరీక్షలు: 2025 నవంబర్ 10 నుంచి 15,
సంక్రాంతి సెలవులు: 2026 జనవరి 11 నుంచి జనవరి 18,
ప్రీ ఫైనల్ పరీక్షలు: 2026 జనవరి 19 నుంచి జనవరి 24,
ప్రాక్టికల్ పరీక్షలు: 2026 ఫిబ్రవరి ఫస్ట్ వీక్,
థియరీ పరీక్షలు: 2026 మార్చి ఫస్ట్ వీక్,
చివరి పని దినం: 2026 మార్చి 31,
వేసవి సెలవులు: 2026 ఏప్రిల్ 1 నుంచి మే 31,
అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు: 2026 మే చివరి వారం,
2026-27 విద్యా సంవత్సరం పున:ప్రారంభం: 2026 జూన్ 1