Last Updated:

Surya Grahan 2022 : సూర్య గ్రహణ సమయంలో ఈ పనులు చేయకండి !

సూర్య గ్రహణ సమయంలో ఈ పనులు చేయకండి !

Surya Grahan 2022 : సూర్య గ్రహణ సమయంలో ఈ పనులు చేయకండి !

Surya Grahan 2022 : అతి పెద్ద సూర్యగ్రహణం  ఈ ఏడాదిలో  అక్టోబర్ 25 న  కార్తీక అమావాస్య  రోజున  రాబోతుంది. దీపావళి పండుగ రోజున   సూర్య గ్రహణం  కావడంతో చాలా మందికి ఈ సారి  పండగపై స్పష్టత రాలేదు. అంతేకాకుండా దాదాపు  27 ఏళ్ల తర్వాత దీపావళి రోజునే సూర్యగ్రహణం రానుంది. ఈ సూర్యగ్రహణం  ప్రభావం కొన్ని రాశులవారిపై పడబోతోందని జోతిష్య శాస్త్రం  వారు వెల్లడించారు .అంతేకాకుండా చాలా మందికి సూర్యగ్రహణం  వల్ల వచ్చే చెడు ప్రభావం ఎదుర్కోవాల్సి కూడా ఉంటుంది.ఐతే  వీరు ఈ క్రమంలో పలు జాగ్రత్తలు పాటిండం  మంచిదని నిపుణులు వెల్లడించారు. అంతేకాకుండా చెడు ప్రభావం కూడా  బారిన పడకుండా పలు రకాల జాగ్రత్తలు కూడా పాటించడం మంచిదని జోతిష్య నిపుణులు  వెల్లడించారు.కార్తీక మాస అమావాస్య  2022  అక్టోబర్ 24 సాయంత్రం 05.27 నుంచి ఆ తర్వాత రోజు అక్టోబర్ 25 సాయంత్రం 04.18 వరకు ఉంటుంది. అయితే సూర్యగ్రహణం 24 అర్ధరాత్రి నుంచి 12 గంటలకు  ప్రారంభమవుతుంది.
ఆ సమయంలో ఎలాంటి పనులు చేయకూడదో ఇక్కడ తెలుసుకుందాం
1.సూర్యగ్రహణాన్ని అశుభకరమైన సంఘటనగా జ్యోతిష్య శాస్త్రంలో చెబుతున్నారు.ఐతే ఈ క్రమంలో పలు రకాల పనులు చేయకూడదని శాస్త్ర నిపుణులు వెల్లడించారు.
2.గ్రహణ సమయంలో ఏ రకమైన భోజనం చేయకూడదు.
3.అలాగే ఈ సమయంలో పళ్లు కూడా శుభ్రం చేసుకోకూడదు అంతేకాకుండా తల దువ్వుకోకపోవడమే మంచిది కాదని శాస్త్ర నిపుణులు తెలిపారు.
4.ముఖ్యంగా గర్భిణీ స్త్రీలైతే జాగ్రత్తగా ఉండాలి గ్రహణ సమయంలో ఇంటి పట్టునే ఉండాలి.
5.సూర్యగ్రహణం సమయంలో ఎలాంటి శుభ కార్యాలు జరగవు కాబట్టి ఈ సమయంలో దేవుని పూజలు కూడా చేయకూడదని నిపుణులు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి: