Mangal Gochar 2025: కుజుడి సంచార ప్రభావం.. జూన్ నుండి వీళ్లు పట్టిందల్లా బంగారం!

Mangal Gochar n June 2025: జ్యోతిష్యశాస్త్రంలో.. కుజుడిని యుద్ధం, శౌర్యం, ధైర్యం, ఉత్సాహం, బలాన్ని సూచించే గ్రహంగా పరిగణిస్తారు. గ్రహాలన్నింటిలోకి కుజుడికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. కుజుడు ఒక నిర్దిష్ట కాలంలో తన రాశిని మారుస్తాడు. కుజుడు తన రాశిని మార్చుకున్నప్పుడు.. దాని ప్రభావం ప్రతి రాశిపైనా కనిపిస్తుంది.
ప్రస్తుతం కుజుడు నీచ రాశి అయిన కర్కాటక రాశిలో ఉన్నాడు. అదే సమయంలో.. కర్కాటక రాశిలో సంచారం తరువాత, కుజుడు జూన్ 7న తన రాశిని మార్చి సూర్యుని రాశి సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. జ్యోతిష్యశాస్త్రంలో.. కుజుడు, సూర్యుడి మధ్య స్నేహ సంబంధం ఉంటుంది. జూన్ నెలలో కుజుడు సింహరాశిలోకి ప్రవేశిస్తాడు కాబట్టి.. కొన్ని రాశుల వారికి అదృష్టం అనుకూలంగా ఉంటుంది. ఆ అదృష్ట రాశుల గురించి తెలుసుకుందామా..
మిథున రాశి: జూన్ నెలలో కుజుడి రాశి మార్పు చాలా శుభప్రదంగా ఉంటుంది. కుజుడు సింహరాశిలోకి ప్రవేశించడం వల్ల మిథున రాశి వారి ఆత్మవిశ్వాసం, ధైర్యం పెరుగుతాయి. మీ రాశిలో కుజుడు మూడవ ఇంట్లో సంచారము చేస్తాడు. ఫలితంగా మీ జీవితంలో ఆనందం పెరుగుతుంది. లాభ అవకాశాలు పెరుగుతాయి. కోర్టులో ఏదైనా కేసు నడుస్తున్నా కూడా వ్యక్తులు దానిలో విజయం సాధిస్తారు. జీవితంలో సానుకూల శక్తి విస్తరిస్తుంది. లాభ అవకాశాలు నిరంతరం పెరుగుతాయి.
తులా రాశి: రాశి వారికి.. సింహరాశిలో కుజుడు సంచరించడం చాలా ప్రయోజనకరంగా, పూర్తి పురోగతితో ఉంటుంది. మీరు మీ ఆఫీసుల్లో మంచి ఫలితాలను పొందుతారు. మీరు మీ లక్ష్యాలను సాధిస్తారు. ఉద్యోగస్తులకు వారి ఉద్యోగాలలో కొత్త అవకాశాలు లభిస్తాయి. మీకు భూమి, భవనం, వాహన సుఖం లభిస్తుంది. మీ ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది.
మీన రాశి: సింహరాశిలో కుజుడు సంచరించడం మీన రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. లాభ అవకాశాలు కూడా పెరుగుతాయి. మీ రాశిలో.. రెండవ, తొమ్మిదవ ఇంటి అధిపతి అయిన కుజుడు ఆరవ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. ఈ విధంగా మీరు ఎవరితోనైనా పోటీలో విజయాన్ని సాధిస్తారు. మీకు లాభం చేకూర్చే అనేక అవకాశాలు లభిస్తాయి. గౌరవం పెరిగే అవకాశం కూడా ఉంది. రియల్ ఎస్టేట్ కు సంబంధించిన కొన్ని మంచి అవకాశాలు కూడా మీకు లభిస్తాయి.