Last Updated:

Horoscope: ఈ రాశుల వారికి నేడు అనుకోని లాభాలు కలుగుతాయి (04 అక్టోబర్ 2022)

ఈ రోజు అన్ని రాశులవారికి అనుకూల రోజుగా ఉంటుంది. వృశ్చిక, ధనస్సు రాశులవారికి ఈరోజు చాలా లాభదాయకంగా ఉంటుంది. అనుకోని రీతిలో లాభాలను పొందడం వల్ల ఆర్ధిక పరిస్థితులను చక్కదిద్దుకుంటారు. ఆరోగ్య సమస్యల పట్ల కాస్త జాగ్రత్తగా వహించండి. 

Horoscope: ఈ రాశుల వారికి నేడు అనుకోని లాభాలు కలుగుతాయి (04 అక్టోబర్ 2022)

Horoscope: ఈ రోజు అన్ని రాశులవారికి అనుకూల రోజుగా ఉంటుంది. వృశ్చిక, ధనస్సు రాశులవారికి ఈరోజు చాలా లాభదాయకంగా ఉంటుంది. అనుకోని రీతిలో లాభాలను పొందడం వల్ల ఆర్ధిక పరిస్థితులను చక్కదిద్దుకుంటారు. ఆరోగ్య సమస్యల పట్ల కాస్త జాగ్రత్తగా వహించండి.

1.మేష రాశి
ఈ రోజు ఈ రాశి వారు ఎక్కువగా అలసిపోతారు. ఎక్కువ ఒత్తిడికి లోనవ్వకండి. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చెయ్యండి. పని భారాన్ని సులువుగా తగ్గించుకునే మార్గాలను వెతకండి. ప్రతి సమస్యకు చిరునవ్వుతో సమాధానం వెతకండి. ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. పనికి తగిన గుర్తింపు వస్తుంది.ఈ రోజు మీ జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు.

2 .వృషభ రాశి

ఈ రోజంతా ఒత్తిడి , సందిగ్ధతలోనే మీరు ఉంటారు. మీరు మీ జీవిత భాగస్వామితో కలసి కొన్ని ఖరీదైనవస్తువులను కొంటారు. దాని ఫలితంగా మీకు ఆర్ధికంగా కొంత ఇబ్బందిగా ఉంటుంది. ఈ రోజు మీకు బాగా కలిసి వస్తుంది. మానసిక ప్రశాంతతను నాశనం చేసే వ్యక్తులకు పనులకు కాస్త దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. ఈరోజు మీ వైహహిక జీవితం మంచిగా సాగుతుంది. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు.

3. మిథున రాశి

ప్రతి సమస్యకు చిరునవ్వుతో సమాధానం చెప్పండి. మీరు పనిచేసే దగ్గర మీ సహుద్యోగులు మీకు కోపం తెప్పించే పనులు చేస్తారు. మానసిక ఒత్తిడిని తట్టుకోవడానికి యోగా చేయండి. ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్త వహించండి.మీకు డబ్బు అవసరమైనప్పుడు చేతికందదు. గతంలో పెట్టిన అధిక ఖర్చుల పర్యవసానాన్ని ఇప్పుడు అనుభవిస్తారు. మీ వైవాహిక జీవితంలో కొత్త మార్పులు వస్తాయి.

4. కర్కాటక రాశి

మొత్తం మీద ఈ రోజు మీ ఆరోగ్యం బాగుంటుంది. అనారోగ్యం ఉందనే ఆలోచనలు తీసెయ్యండి. ఆరోగ్యం, మానసిక ప్రశాంతత కోసం దానధర్మాలు చెయ్యండి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనండి తద్వారా సంతోషంగా ఉంటారు. జీవితంలో ఆనంద సమయం గడపడం కోసం కాస్త మీ సమయాన్ని కుటుంబ సభ్యుల కోసం గడపండి.

5. సింహ రాశి

ఈ రోజు మిమ్మల్ని అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి. మెడ, వెన్ను నొప్పులు మిమ్మల్ని తీవ్రంగా వేధిస్తాయి. వాటిని అశ్రద్ధ చెయ్యకండి. వృత్తిలో మీ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. మీరు పనిచేసే దగ్గర మంచి ఫలితాలను ఇవ్వడం కోసం శ్రమించి పనిచేస్తారు. కుటుంబ సభ్యులతో శాంతి పూర్వకమైన మరియు ప్రశాంతమైన రోజును గడుపుతారు.

6. కన్యా రాశి

ఈరోజు మీకు శ్రమతో కూడిన రోజేతప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది. త్వరగా డబ్బును సంపాదించెయ్యాలనే కోరికతో ఎక్కువగా శ్రమపడుతుంటారు. ఇతరుల జోక్యం వలన, మీ ప్రియమైన వారితో సత్సంబంధాలు దెబ్బతింటాయి. ఈ రోజు మీరు చేసే ఉమ్మడి వ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయి. కానీ మీరు భాగస్వాముల నుండి వ్యతిరేకతను ఎదుర్కొంటారు. మీ ఛార్మింగ్ వ్యక్తిత్వం, ప్రవర్తన మీకు కొత్త స్నేహితులను పొందడానికి తోడ్పడతాయి. మీ వైవాహిక జీవితం ఈరోజు బాగుంటుంది.

7. తులా రాశి

బిజీగా ఉండడం తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆర్థికసంబంధ సమస్యలు ఈరోజు తొలగిపోతాయి. మీరు ఆర్థికప్రయోజనాలను పొందగలరు ఇంటిలో సమస్య పరిష్కారం అవుతుంది. ఈ రాశి వారికి వ్యాపారం బాగా కలిసి వస్తుంది. సమయాన్ని వృధా చేయకుండా శ్రమించి పనిచేస్తారు. మీ జీవిత భాగస్వామితో ఆనంద క్షణాలను గడుపుతారు.

8. వృశ్చిక రాశి

ఈ రోజు మీ ఆరోగ్యం బాగుంటుంది. అనుకోని లబ్ది పొందడం వలన ఆర్థిక పరిస్థితులు చక్కబడతాయి. స్వీయ సానుభూతి కోసం సమయాన్ని వృధా చెయ్యకండి. జీవిత పాఠాలను ప్రయత్నించి, తెలుసుకోండి. మీ జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు.

9. ధనస్సు రాశి

మీ సౌమ్య ప్రవర్తన మెప్పు పొందుతుంది. తెలియని వారి సలహా వలన మీరు ఆర్థిక వృద్ధిని పొందుతారు. ఈరోజు మీరు ఒక టూర్ ప్లాన్ చేసుకుని వెళ్తారు తద్వారా మీకు ఆకర్షనీయమైన రాబడి కలుగుతుంది. ఈ రోజు మీ జీవిత భాగస్వామితో చాలా ఆనందంగా గడుపుతారు.

10. మకర రాశి

మీ ఖర్చుదారీతనాన్ని తగ్గించడానికి ప్రయత్నించండి. అలాగే ఈరోజు అవసరమైన వాటినే కొనండి. మీరు మీ మిత్రులతో సరదగా గడపటానికి బయటకు వెళ్లాలని చూస్తే ఖర్చుపెట్టే విషయంలో కాస్త జాగ్రత్తగా వ్యవహరించండి. మీరు ఒంటరిగా ఫీల్ అయినప్పుడు మీ కుటుంబం సహాయం తీసుకోండి. అది మిమ్మల్ని నిస్పృహ నుండి కాపాడుతుంది మీరు పని చేసే ఆఫీసులో మీకు మంచి ప్రశంసలు లభిస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీ వైహహిక జీవితంలో కొత్త మార్పులు వస్తాయి.

11. కుంభ రాశి

ఈ రోజుంతా మీ మూడ్ చాలా ఉల్లాసంగా ఉంటుంది. మీకు అంతరాయం కలిగించే భావోద్వేగాలను, కోరికలను అదుపులో ఉంచండి. మీ పాత సంప్రదాయం/ పాతకాలపు ఆలోచన మీ పురోగతిని ఆటంకపరుస్తుంది. ఈ రోజు మీరు ఇతరుల కోసం ఎక్కువ ఖర్చు పెట్టడానికి ఇష్టపడతారు. ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ వహించండి. ఈ రోజు మీకు ఉద్యోగంలో మంచి ప్రశంసలు లభిస్తాయి.

12. మీన రాశి

మీ తిండిని నియంత్రించండి. బలంగా ఉండడానికి వ్యాయామం చెయ్యండి. రియల్ ఎస్టేట్ రంగంలో తగినంతగా సొమ్మును మదుపు చెయ్యడం వల్ల మంచి లాభాలను గడిస్తారు. ప్రతి చిన్న విషయానికి మీ జీవిత భాగస్వామితో గొడవపడకండి. ఈ రోజు మీ ఆర్ధిక సమస్యలు మెరుగుపడతాయి. మీ వైహహిక జీవితం సరదాగా సాగుతుంది.

ఇదీ చదవండి: “చెప్పులే” ఆ అమ్మవారికి మొక్కుబడులు..!

ఇవి కూడా చదవండి: