Last Updated:

Horoscope: నేటి రాశి ఫలాలు (14 అక్టోబర్ 2022)

నేడు అన్ని రాశుల వారికి శుభదినంగా ఉంటుంది. మీ ఉదయాన్ని కాస్త వ్యాయామంతో మొదలుపెట్టడం ద్వారా ఈ రోజుంతా మీరు ఉల్లాసంగా ఉంటారు. అన్నిరాశుల వారికి ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తాయి. 

Horoscope: నేటి రాశి ఫలాలు (14 అక్టోబర్ 2022)

Horoscope: నేడు అన్ని రాశుల వారికి శుభదినంగా ఉంటుంది. మీ ఉదయాన్ని కాస్త వ్యాయామంతో మొదలుపెట్టడం ద్వారా ఈ రోజుంతా మీరు ఉల్లాసంగా ఉంటారు. అన్నిరాశుల వారికి ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తాయి.

1.మేష రాశి
గ్రహచలనం రీత్యా, అనారోగ్యం నుండి మీరు కోలుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. చికాకును, అసౌకర్యాన్ని పెంచే ఆర్థిక సమస్యలు మీ తల్లిదండ్రుల సహాయంతో గట్టెక్కుతాయి. ఉద్యోగస్థులకు నేడు అధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి. వ్యాపారాలు లాభదాయకంగా జరుగుతాయి. ఈ రోజు మీ వైవాహిక జీవితంలోకెల్లా అత్యుత్తమమైన రోజు కాగలదు.

2 .వృషభ రాశి
మీ ఆహారం గురించి తగిన జాగ్రత్త తీసుకోండి. ప్రత్యేకించి, మైగ్రెయిన్ రోగులు వారి భోజనాన్ని మానరాదు. ఇప్పటిదాకా అనవసరంగా డబ్బును ఖర్చుపెడుతున్నవారు, డబ్బు విలువను తెలుసుకుంటారు. మీరు కుటుంబంలోని ఇతరుల ప్రవర్తన వలన ఇబ్బంది పడతారు. రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడి అత్యధిక లాభదాయకం.
మానసిక ప్రశాంతతను నాశనం చేసే వ్యక్తులకు పనులకు కాస్త దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. ఈరోజు మీ వైహహిక జీవితం ఆనందంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు.

3. మిథున రాశి
బిజినెస్ అప్పుకోసం వచ్చిన వారిని, చూడనట్లుగా వదిలెయ్యండి. పెండింగ్ లోగల ఇంటి పనులు కొంత వరకు పూర్తవుతాయి. ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్త వహించండి. వైవాహిక జీవితంలో కొత్త మార్పులు వస్తాయి.

4. కర్కాటక రాశి
ఈ రోజు మీకు ఒత్తిడి అధికంగా ఉంటుంది. అన్ని ఒప్పందాలు, ఆర్థిక లావాదేవీలు జాగ్రత్తగా నిర్వహించడం అవసరం. మీకు ఓర్పు కొద్దిగానే ఉంటుంది. ఆచితూచి మాట్లాడడం ఈ రోజు చెప్పదగిన సూచన. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించడం తప్పనిసరి. జీవితంలో ఆనంద సమయం గడపడం కోసం కాస్త మీ సమయాన్ని కుటుంబ సభ్యుల కోసం గడపండి.

5. సింహ రాశి
ఈ రోజు మీకు కాస్త నిరుత్సాహంగా అనిపిస్తుంది. అవసరమైన ధనము లేకపోవటం కుటుంబలో అసమ్మతికి కారణము అవుతుంది. ఈ సమయంలో ఆలోచించి మీ కుటుంబ సభ్యలతో మాట్లాడి వారియొక్క సలహాలను తీసుకోండి. శారీరక ఆరోగ్యం కోసం ధ్యానం , యోగా చెయ్యండి. ఈ రోజు వ్యాపారులకు లాభసాటి రోజుగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ వహించండి.

6. కన్యా రాశి
ఈరోజు మీరు డబ్బును ఎక్కడ, ఎలా ఖర్చుపెట్టాలో తెలుసుకుంటారు. ఈ రోజు దూరప్రాంతాల నుండి బంధువులు మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులు మంచి ప్రతిభచూపి పైఅధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. మీ జీవిత భాగస్వామితో హాయిగా గడపండి. మీ వైవాహిక జీవితం ఈరోజు బాగుంటుంది.

7. తులా రాశి
ఈ రోజు మీరు లౌక్యంతో మీ మనసును వేధిస్తున్న సమస్యలను పరిష్కరించగలుగుతారు. ఎవరో తెలియనివారి సలహాల వలన పెట్టుబడి పెట్టడం వల్ల ఈరోజు ప్రయోజనాలు పొందుతారు. మీ స్నేహితులు, మీ వ్యక్తిగత జీవితం గురించి ఒక మంచి సలహాను ఇవ్వచూపుతారు. ఇది మీ జీవితంలోకెల్లా అత్యంత అద్భుతమైన రోజు కానుంది. ఈ రాశి వారికి ఈ రోజు వ్యాపారం బాగా కలిసి వస్తుంది. మీ జీవిత భాగస్వామితో ఆనంద క్షణాలను గడుపుతారు.

8. వృశ్చిక రాశి
మీ సానుకూలతావాదం తోను, మీపై మీకుగల నమ్మకంతోను, ఇతరులను మెప్పించగలరు. ఈ రోజు మీ ఆరోగ్యం బాగుంటుంది. అనుకోని లబ్ది పొందడం వలన ఆర్థిక పరిస్థితులు చక్కబడతాయి. ఈ రోజు మీ జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు.

9. ధనస్సు రాశి
ఈ రోజు ఈ రాశి వారు నిర్ణయాలు తీసుకోవడానికి వత్తిడికి గురి అవుతారు. మీ కోపాన్ని తగ్గించుకుని అందరితో మంచిగా ఉండండి, లేదంటే ఉద్యోగం పోయే ప్రమాదం ఉన్నది. ఇది మీ యొక్క ఆర్ధికస్థితిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. అనుకోని బాధ్యతలు మీ రోజువారీ ప్లాన్ లను చెదరగొడతాయి. మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని చక్కగా అర్థం చేసుకోవడం వల్ల మీరు చాలా సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు.

10. మకర రాశి
ఈ రోజు ఈ రాశివారికి అనేక మార్గాల నుండి ఆర్థిక లాభాలు వస్తుంటాయి. ఇంటిని మెరుగు పరుచుకునే ప్రాజెక్ట్ లు గురించి ఎక్కువగా పరిశీలిస్తారు. మీకు బాగా ఇష్టమైన వారినుండి బహుమతులు అందుతాయి. మీరు పని చేసే ఆఫీసులో మీకు మంచి ప్రశంసలు లభిస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీ వైహహిక జీవితంలో కొత్త మార్పులు వస్తాయి.

11. కుంభ రాశి
ఈరోజు మీ ఆశలు నెరవేరుతాయి. మీకు ఇంతవరకు లభించిన ఆశీస్సులు, అదృష్టాలు కలిసి వస్తాయి. గతంలో మీరుపడిన కష్టానికి ఈరోజు ప్రతిఫలం ఇప్పుడు దొరుకుతుంది. మీ సరదా స్వభావం వల్ల మీకు మంచి పేరు వస్తుంది. ఈ రోజుంతా మీ మూడ్ చాలా ఉల్లాసంగా ఉంటుంది. మీ భావోద్వేగాలని అదుపు చేసుకోండి. ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ వహించండి. ఈ రోజు మీకు ఉద్యోగంలో మంచి ప్రశంసలు లభిస్తాయి. మీ భాగస్వామితో ఈ రోజు ఆనందంగా గడుపుతారు.

12. మీన రాశి
ఈ రోజు ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకునేందుకు మీ కుటుంబ సభ్యులు సహాయపడతాయి. స్నేహితులు, కుటుంబ సభ్యులు, మీకు ప్రోత్సాహాన్ని అందిస్తారు.
అనుకోని కానుకలు, బహుమతులు బంధువులు, స్నేహితుల నుండి అందుతాయి. ప్రతి చిన్న విషయానికి మీ జీవిత భాగస్వామితో గొడవపడకండి. ఈ రోజు మీ వైహహిక జీవితం సరదాగా సాగుతుంది.

ఇదీ చదవండి: గ్రహణం రెండు రోజులు పాటు టీటీడీ దర్శనాలు బంద్

ఇవి కూడా చదవండి: