Last Updated:

Horoscope Today: ఈ రాశుల వారికి మానసిక ఒత్తిడి.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే?

Horoscope Today: నేడు పలు రాశుల వారు ఒత్తిడి ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశుల వారు పలు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. అలాగే నేటి సోమవారం రాశిఫలాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా మీకోసం.

Horoscope Today: ఈ రాశుల వారికి మానసిక ఒత్తిడి.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే?

Horoscope Today: నేడు పలు రాశుల వారు ఒత్తిడి ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశుల వారు పలు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. అలాగే నేటి సోమవారం రాశిఫలాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా మీకోసం.

మేషం: నేడు ఈ రాశుల వారు.. అనుకున్న పనులను పూర్తి చేస్తారు. ఈ రోజు వారికి మంచిరోజు. కొత్త ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. ఏదైనా ఓ శుభవార్త వింటారు. ఉద్యోగంలో అధికారుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఇంటా బయటా కొద్దిగా ఒత్తిడి, శ్రమ ఉన్నప్పటికీ పనులన్నీ సంతృప్తి కరంగా పూర్తి అవుతాయి. ఆహార విహారాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండటం మంచిది. విద్యార్థులకు నేడు అనుకూలం.

వృషభం: కొత్త పనులు చేపట్టడానికి నేడు మంచి రోజు. కొత్త నిర్ణయాలు కూడా తీసుకుంటారు. లక్ష్యాల మీద దృష్టి పెట్టడం మంచిది. కొందరు బంధుమిత్రుల ఒత్తిడికి లొంగక పోవడం శ్రేయస్కరం. ఆర్థిక ప్రయత్నాలు సత్ఫలితాలను అందిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఈ రాశివారికి అనుకూలం. ఆరోగ్యంలో కొద్దిగా మెరుగుదల ఉంటుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో సహచరులు మీ బాధ్యతలను పంచుకుంటారు. విద్యార్థులు శ్రమ పడాల్సి ఉంటుంది.

ఈ రాశి వారికి శ్రమ తగ్గుతుంది (Horoscope Today)

మిథునం: ఉద్యోగానికి సంబంధించి ఈ రోజు చాలా బాగుంటుంది. కుటుంబంలో మాత్రం కొద్దిగా ప్రశాంతత తగ్గుతుంది. ముఖ్యమైన పనులలో శ్రమ మాత్రం మిగులుతుంది. ఆహార విహారాల్లో జాగ్రత్తలు పాటించడం చాలా మంచిది. ఆర్థిక పరిస్థితుల్లో పెద్దగా ఎదుగుదల కనిపించక పోవచ్చు. అయితే ఆర్థిక సహాయం కోసం కొందరు బంధుమిత్రుల నుంచి ఒత్తిడి ఉండొచ్చు. ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో లాభాలు కనిపిస్తాయి.

కర్కాటకం: రోజంతా బాగుంటుంది. పనులను సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగంలో అధికారుల మెప్పు పొందుతారు. ఇరుగుపొరుగు వారితో కొద్దిగా చికాకులు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. పిల్లలతో కొద్దిగా సమస్యలు ఎదురవుతాయి. కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్యం కాస్తంత ఆందోళన కలిగిస్తుంది. వ్యాపారం సాఫీగా సాగిపోతుంది. అనవసర పరిచయాలకు వీలైనంత దూరంగా ఉండటం మంచిది.

సింహం: ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది కానీ విలాసాల కారణంగా ఖర్చులు పెరిగి ఇబ్బంది పడతారు. ఉద్యోగ వాతావరణం చాలావరకు ప్రశాంతంగానే ఉంటుంది. తొందరపాటు నిర్ణయాల వల్ల కొన్ని ముఖ్యమైన పనులు పెండింగ్లో పడతాయి. ఇతరులతో వ్యవహరించేటప్పుడు తప్పనిసరిగా ఆచితూచి వ్యవహరించాలి. బంధుమిత్రులతో అపార్ధాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. కుటుంబ సమస్య ఒకటి పెద్దల జోక్యంతో పరిష్కారం అవుతుంది.

కన్య: రాబడి బాగానే ఉంటుంది కానీ అనవసర ఖర్చులు అదుపు తప్పుతాయి. ఉద్యోగం, వ్యాపారం సజావుగానే సాగిపోతాయి. కుటుంబ పరిస్థితి అన్ని విధాలా ప్రశాంతంగానే ఉంటుంది. బంధువుల్లో కొందరు మీ మీద చెడు ప్రచారం సాగించే సూచనలు ఉన్నాయి. వృత్తిపరంగా శుభవార్త వినడం జరుగుతుంది. కుటుంబానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన పనులు శరీరంలో కొద్దిపాటి నలత వల్ల ఆగిపోతాయి.

ఈ రాశివారికి మానసిక ఒత్తిడి

తుల: ఈ రోజు సాఫీగా సాగిపోతుంది. ఉద్యోగ, వ్యాపార జీవితం ప్రశాంతంగా ఉంటుంది. ఉద్యోగంలో మార్పు జరిగే అవకాశం ఉంది. అదనపు బాధ్యతల వల్ల కొద్దిగా ఇబ్బంది పడతారు. స్నేహితుల సహా యంతో కొన్ని వ్యక్తిగత పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. వాగ్దానాలు చేయటం, హామీలు ఉండటం ప్రస్తుత పరిస్థితుల్లో అంత శ్రేయస్కరం కాదు. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవడం మంచిది కాదు.

వృశ్చికం: కొందరి దగ్గర మనసులోని విషయాలు బయట పెట్టి ఇబ్బందుల్లో పడతారు. ఎవరినీ గుడ్డిగా నమ్మటం మంచిది కాదు. సన్నిహితుల సహాయంతో ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. అవసరాలకు తగ్గట్టుగా డబ్బు చేతికి అందుతుంది. కుటుంబ అవసరాలు గడిచిపోతాయి. ముఖ్యమైన పనుల్లో టెన్షన్లు ఉంటాయి. కొంచెం తిప్పట ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగంలో ఆటంకాలు ఎదురైనా లక్ష్యాలను పూర్తి చేస్తారు.

ధనుస్సు: మీ మనసులోని కోరిక ఒకటి నెరవేరుతుంది. బంధుమిత్రులతో కలిసి ఎంజాయ్ చేస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. పిల్లల నుంచి శుభవార్త వింటారు. ఉద్యోగంలో సహచరుల ఆదరణ లభిస్తుంది. గతంలో తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు మంచి ఫలితాలను ఇస్తాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తి అవుతాయి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ పెట్టాలి. విశ్రాంతి అవసరం.

మకరం: రోజంతా ప్రశాంతంగా సాగిపోతుంది. ఉద్యోగంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. రావలసిన డబ్బు సకాలంలో చేతికి అంది ముఖ్యమైన అవసరాలు తీరుతాయి. ఎవరికీ హామీలు ఉండవద్దు. ముఖ్యంగా ఆర్థిక విషయాలలో వాగ్దానాలు చేయటం మంచిది కాదు. ఆహార విహారాల్లో జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. తొందరపాటు నిర్ణయాలు ఇబ్బంది పెడతాయి. వ్యాపారం సజావుగా సాగిపోతుంది.

కుంభం: ముఖ్యమైన పనులు అతి కష్టం మీద పూర్తి అవుతాయి. మానసికంగా బాగా ఒత్తిడి ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవడం మంచిది. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగానే సాగిపోతుంది. కుటుంబ పరంగా మాత్రం కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి. ముఖ్యమైన నిర్ణయా లలో కుటుంబ సభ్యులను కూడా సంప్రదించడం మంచిది. దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. అవసరాలకు డబ్బు అందుతుంది.

మీనం: ఆర్థిక పరిస్థితిలో మెరుగుదల ఉంటుంది కానీ వైద్య ఖర్చులతో ఇబ్బంది పడతారు. ఆహార విహారాల్లో తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలి. ఉద్యోగంలో బాధ్యతలు పెరిగే సూచనలు ఉన్నాయి. ఇరుగుపొరుగుతో చికాకులు తలెత్తు తాయి. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. వృత్తి నిపుణులకు కొత్త ఆఫర్లు అందుతాయి. కొందరు మిత్రులకు ఆర్థికంగా సహాయపడతారు. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండటం ప్రస్తుతానికి చాలా మంచిది.