Published On:

Low Sugar Smoothies: షుగర్ కంట్రోల్ చేయాలంటే ఈ జ్యూస్ లను తాగాల్సిందే!

Low Sugar Smoothies: షుగర్ కంట్రోల్ చేయాలంటే ఈ జ్యూస్ లను తాగాల్సిందే!

Low sugar smoothies: పరగడపున తీసుకునే ( బ్రేక్ ఫాస్ట్) అల్పాహారం మనిషి శరీరానికి ఎంతో ముఖ్యం. ఎందుకంటే బ్రేక్ ఫాస్ట్ మనిషికి అతి ముఖ్యమైనది. రాత్రినుంచి కడుపు కాళీగా ఉంటుంది. ఉదయం లేవగానే శరీరానికి శక్తిని ఇచ్చే ఆహారం చాలా ముఖ్యమైనదిగా ఉండాలి. అందుకే పాతకాలం నుంచి పాలు, సద్ది అన్నం తినేవారు. ఈ కాలంలో అలాంటి కోవకే చెందిన జ్యూస్ లను బ్రేక్ ఫాస్ట్ గా తీసుకుంటున్నారు. ముఖ్యంగా బ్రేక్ ఫాస్ట్ లో ఆరోగ్యకరమైనవి ఉండాలి అప్పుడే తలనొప్పి, జీర్ణ సమస్యల లాంటి వాటిని నివారిస్తుంది. అంతకంటే ముఖ్యంగా షుగర్ లెవల్స్ ను ఎక్కువకాకుండా చూసుకుంటూ ఆరోగ్యాన్ని అందించేదిగా ఉండాలి.

 

అయితే షుగర్ తో బాధపడేవారు అల్పాహారం తీసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. బ్రేక్ ఫాస్ట్ లో చెక్కర స్థాయి ఎక్కువ ఉన్న ఫుడ్ తీసుకుంటే అది వారి శరీరంపై ప్రభావం చూపెడుతుంది. కాబట్టి స్మూతీలను బ్రేక్ ఫాస్ట్ గా తీసుకోవాలంటున్నారు నిపుణులు. స్మూతీలు అంటే మరేమిటో కాదు… పండ్లు, ఐస్ క్రీం, కూరగాయలు లాంటి వాటిని జ్యూస్ గా చేయడం. ఇది ఫ్రూట్ జ్యూస్ లాగే ఉంటుంది. ఇప్పుడు స్మూతీలలో కొన్నింటిని తెలుసుకుందాం.

 

పాలకూర, ఆవకాడతో చేసిన గ్రీన్ స్మూతీ..

పాలకూరలో కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను ఎక్కువ కాకుండా చూస్తుంది. అవకాడో శరీరానికి కావలసిన కొవ్వు పదార్థాలను, ఫైబర్‌ను ఇస్తుంది. దీంతో రక్తంలో చక్కెర స్థాయి నెమ్మదిస్తుంది.

 

బెర్రీ, పెరుగు స్మూతీ..

బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీలు, రాస్ బెర్రీస్ వంటి బెర్రీలలో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. తియ్యని పెరుగు శరీరానికి ప్రోటీన్ ను, ప్రోబయోటిక్‌లను ఇస్తుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను సమానంగా ఉంచడానికి సహాయపడుతుంది.

 

చియా సీడ్, బాదం మిల్క్ స్మూతీ..

చియా విత్తనాలలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది, ఇది ఆహారాన్ని నెమ్మదిగా జీర్ణం కావడానికి తోడ్పడుతుంది. దీంతో రక్తంలో చక్కెర స్థాయిలను పెరగకుండా నివారిస్తుంది. ఈ స్మూతీని చేసు టప్పుడు బాదాంను రాత్రంతా నానబెట్టాలి. బాదంను గ్రైండ్ చేసిన తర్వాత ఆ పాలలో బెర్రీలు లేదా చిన్న అరటిపండుతో మరోసారి మిక్స్ చేయాలి. అప్పుడు కమ్మనైన జూస్ వస్తుంది.

ఇలా జ్యూస్ చేసుకుని ప్రతీరోజు తీసుకున్నట్లయితే ఆరోగ్యం బాగుంటుంది.

 

ఇవి కూడా చదవండి: