Last Updated:

Weekly Horoscope: వార ఫలాలు.. ఈ వారం రాశి ఫలాలు( ఫిబ్రవరి 9 నుండి ఫిబ్రవరి 15 వరకు) ఎలా ఉన్నాయంటే?

Weekly Horoscope: వార ఫలాలు.. ఈ వారం రాశి ఫలాలు( ఫిబ్రవరి 9 నుండి ఫిబ్రవరి 15 వరకు) ఎలా ఉన్నాయంటే?

Weekly Horoscope in Telugu, 2025 February 9 to  February 15: వార ఫలాలు. ఈ వారం ఫిబ్రవరి 9 నుండి ఫిబ్రవరి 15 వరకు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

మేషం: మేష రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాలపరంగా అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. మీ స్థాయిని స్థానాన్ని పెంపొందించుకోవడానికి ఎంతగానో శ్రమిస్తారు. వ్యాపారస్తులకు వ్యాపార పరంగా ఈ వారం బాగుంది. నూతన వ్యవహారాలు అనుకూలిస్తాయి. వివాహాది శుభకార్యాలలో చురుకుగాపాల్గొంటారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. విహారయాత్రలు దైవదర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు. ఉద్యోగపరంగా ఉన్న చిన్న చిన్న ఆటంకాలు తొలగిపోతాయి. ఆరోగ్యపరంగా చిన్నచిన్న జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతిరోజు ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి అష్టమూలిక గుగ్గిలంతో ధూపం వేయండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య నాలుగు కలిసివచ్చే
రంగు గ్రీన్.

వృషభం: వృషభ రాశి వారికి ఈ వారం మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాలలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. అప్పుచేసి నూతన గృహం కొనుగోలు చేస్తారు. క్రెడిట్ కార్డు విషయంలో లోన్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. అప్పు ఇవ్వడం అప్పు తీసుకోవడం రెండు కలిసి రావు. వ్యాపార పరంగా అనుకూలమైన వాతావరణం నెలకొంటుంది. నలుగురిలో మీకంటూ ఒక స్థానాన్ని స్థాయిని సంపాదించుకోగలుగుతారు. వ్యాపార వ్యవహారాలలో నలుగురు చెప్పింది కాకుండా మీకు నచ్చింది చేయండి. వ్యాపారాల్లో మీకు మీరుగా ఒక నిర్ణయం తీసుకొని దాని అమలుపరచండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఉద్యోగపరంగా ఉన్న చిన్న చిన్న ఆటంకాలు ఈ వారం తొలగిపోతాయి. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మంచి ఫలితాలు సంప్రదిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా బాగుంటుంది. డబ్బు చేతివరకు వచ్చి చేయి జారిపోయే అవకాశం ఉంది. ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండండి. సంతాన సంబంధమైన విషయ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. సంతానం యొక్క పురోభివృద్ధి బాగుంటుంది ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు జిల్లేడు వత్తులతో దీపారాధన చేయండి గురుగ్రహ స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్యా ఐదు కలిసి వచ్చే రంగు స్కై బ్లూ.

మిథునం: మిథున రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కొన్ని విషయాలలో నలుగురితో సంప్రదించి ముందుకు వెళ్లడం అనేది చెప్పదగినది. అలాగే జీవిత భాగస్వామి యొక్క సలహాలు సూచనలు తీసుకున్నట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగాలపరంగా ఉన్న చిన్న చిన్న సమస్యలు కూడా ఈ వారం తొలగిపోతాయి. వ్యాపారస్తులకు వ్యాపార పరంగా ఈ వారం బాగుంటుంది. విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. మీరు చేసిన కృషి పట్టుదల వల్ల మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. వైద్య వృత్తిలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. నలుగురితో కలిసి శుభకార్యాలలో పాల్గొంటారు. నరదిష్టి అధికంగా ఉంటుంది. ఈ రాశిలో నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా బాగుంటుంది. నలుగురితో కలిసి విందు వినోదాలు పాల్గొంటారు. పాస్పోర్ట్ వీసా వంటి అంశాలు అనుకూలిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కొంత జాప్యం జరిగినప్పటికీ మంచి సంబంధం కుదురుతుంది. ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశి వారికి కలిసివచ్చే సంఖ్య ఎనిమిది కలిసి వచ్చే రంగు గ్రీన్.

కర్కాటకం : కర్కాటక రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇంటా బయట అనుకోని సంఘటనలు చోటు చేసుకుంటాయి. జీవిత భాగస్వామితో స్వల్ప విభేదాలు చోటు చేసుకుంటాయి. సంతానం విషయంలో కూడా చిన్నప్పటి ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది జాగ్రత్త వహించండి. వృత్తి ఉద్యోగాలపరంగా నూతనమైన మార్పులు చోటు చేసుకుంటాయి. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కొంత ఆలస్యమైనప్పటికీ మంచి ఉద్యోగం లభిస్తుంది. నూతన అవకాశాలు లభిస్తాయి వాటిని సద్వినియోగం చేసుకోండి. వ్యాపారస్తులకు వ్యాపార పరంగా ఈ వారం బాగుంటుంది. నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి పెట్టుబడులు పెట్టడానికి కొంత సమయం తీసుకోండి ప్రస్తుతం చేస్తున్న వ్యాపారంపైన దృష్టి పెట్టండి. పౌల్ట్రీ రంగంలో ఉన్న వారికి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి చార్టెడ్ అకౌంటెంట్స్ వారికి కాలం బాగుంది. విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. పరీక్షలలో మీ ప్రతిభను కనబరుస్తారు. పోటీ పరీక్షలలో పాల్గొనేవారు కష్టపడి చదవాలి పోటీ ఎక్కువగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగులపరంగా వ్యాపార పరంగా కాలం అనుకూలంగా ఉంది. గృహానికి సంబంధించిన లోన్లు మంజూరు అవుతాయి. ప్రతి విషయంలో కూడా ఓర్పు సహనం అవసరమవుతాయి. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతి రోజు కూడా నవగ్రహ ఒత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య ఆరు కలిసి వచ్చే రంగు స్కై బ్లూ.

సింహరాశి : సింహ రాశి వారికి ఈ వారం అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ముఖ్యమైన వ్యవహారాలు అన్ని బాగుంటాయి. ఏ పని చేసిన అందులో విజయం మిమ్మల్ని వరిస్తుంది. భార్యాభర్తల మధ్య గొడవలు శృతిమించి రాగానపడతాయి. జీవిత భాగ స్వామితో సఖ్యత కోసం ప్రయత్నం చేయండి. ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఏర్పడతాయి. నూతన పెట్టుబడులు పెట్టడానికి కాలం అనుకూలంగా ఉంది. శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. విద్యార్థినీ విద్యార్థులకు కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. ప్రతిరోజు ప్రతినిత్యం కూడా ఆదిత్య హృదయం పారాయణం చేయండి అలాగే నవగ్రహ వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశిలో జన్మించిన వారు అంగారక పాశుపత హోమాన్ని చేయించండి ద్వారా వృత్తి ఉద్యోగులపరంగా మరియు ఆరోగ్యపరంగా ఉన్న ఇబ్బందులు తొలగిపోయి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య ఒకటి కలిసివచ్చే రంగు తెలుపు.

కన్య: కన్యా రాశి వారికి ఈ వారం అనుకూలమైన కాలంగా చెప్పవచ్చు. మీరు ఏ పని చేపట్టిన అందులో విజయం సాధిస్తారు. విదేశాలు వెళ్లాలని ప్రయత్నం చేస్తున్న వారికి వీసా వచ్చే అవకాశం ఉంది. హెచ్ వన్ బి వీసా కోసం గ్రీన్ కార్డు కోసం ప్రయత్నం చేస్తున్న వారు శుభవార్త వింటారు. నిరుద్యోగులైన విద్యావంతులకు మీ చదువుకు తగిన ఉద్యోగం లభిస్తుంది. ప్రభుత్వ సంబంధమైన విషయ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. నలుగురిలో పేరు ప్రఖ్యాత్ర లభిస్తాయి. గడిచిన రెండు వారాల కంటే కూడా ఈ వారం అభివృద్ధి కనిపిస్తుంది. వచ్చిన ధనానికి ఖర్చుకి పెద్ద తేడా ఏమీ ఉండదు రెండు సమానంగా ఉంటాయి. శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. ప్రేమ వివాహాలు వివాదాస్పదం అవుతాయి. వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండండి. స్వగృహ నిర్మాణం అనే కళ నెరవేరుతుంది. రాజకీయ జీవితం బాగుంటుంది. రాశి వారు ప్రతి రోజు ప్రతినిత్యం జిల్లేడు వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్యా రెండు కలిసి వచ్చే రంగు స్కై బ్లూ.

తుల: తులా రాశి వారికి ఈ వారం అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి .భూ సంబంధమైన విషయ వ్యవహారాలు లాబిస్తాయి ఎప్పటి నుండో అమ్ముడుపోకుండా పెండింగ్లో ఉన్న భూమి ఈ వారం అమ్ముడుపోతుంది. క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్త గా వ్యవహరించండి. వ్యాపారంలో ఉన్న లోటుపాట్లను సరిదిద్దుతారు. వివాహాది శుభకార్యాలకు ధనాన్ని అధికంగా ఖర్చు చేస్తారు.కుటుంబంలో ఇబ్బంది లేనటువంటి వాతావరణ కోసం ఎంతగానో శ్రమిస్తారు. విద్యార్థులు చెడు వ్యసనాలకు బానిస కాకుండా జాగ్రత్తలు తీసుకోండి. అతి స్నేహం అతి నమ్మకం ఏ విషయంలో కూడా పనికి రాదు. సినీ కళా రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు లభిస్తాయి. పొదుపు విషయంలో శ్రద్ధ వహించండి. ఏ పని చేసినా కానీ మీ ప్రయత్నం లోపం లేకుండా చూసుకోండి. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతి రోజు ఓం నమశివాయ వత్తులతో దీపారాధన చేయండి. అలాగే హనుమాన్ చాలీసాను ప్రతిరోజు పారాయణం చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఏడు కలిసి వచ్చే రంగు తెలుపు.

వృశ్చికం: వృశ్చిక రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. గత కొన్ని వారాల కంటే కూడా ఈ వారం మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగపరంగా ఉన్న చిన్న చిన్న ఆటంకాలు ఈ వారం తొలగిపోతాయి. శత్రువులు కూడా మిత్రులుగా మారే అవకాశం ఉంది. మీ వాక్చాతుర్యంతో నలుగురిని మెప్పించ గలుగుతారు. వ్యాపార పరంగా మంచి అభివృద్ధి సాధిస్తారు. కుటుంబ సంబంధమైన విషయ వ్యవహారాలలో ఇతరుల జోక్యానికి అడ్డుకట్ట వేస్తారు. మోకాలు నొప్పులు ,థైరాయిడ్ , స్కిన్ సంబంధిత అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడుతాయి. మీరు చదివిన చదువుకి గుర్తింపు లభిస్తుంది. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య 6 కలిసివచ్చే రంగు నేవీ బ్లూ.

ధనస్సు: ధనస్సు రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. చెప్పుకోదగిన స్థాయిలో ఇబ్బందులు మాత్రం ఉండవు. సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. పోటీ పరీక్షలలో పాల్గొంటారు. శుభకార్యాలలో పాల్గొంటారు. అమ్మకాలు కొనుగోలులో లాభాలు పొందుతారు. డబుల్ రిజిస్ట్రేషన్ పట్ల జాగ్రత్తగా ఉండండి. వచ్చిన అవకాశాలను సద్వినియోగపరుచుకోండి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధాలు దగ్గరి వరకు వచ్చి చేయి జారిపోతాయి. ఉన్నత విద్య కోసం విదేశాలు వెళ్లాలనుకునే వారికి కాలం అనుకూలంగా ఉంది. విద్యార్థినీ విద్యార్థులు పరీక్షలకు సిద్ధమవుతారు. మేధా దక్షిణామూర్తి రూపును మెడలో ధరించండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఒకటి కలిసి వచ్చే రంగు తెలుపు.

మకరం: ఈ రాశి వారికి వారంరోజుల పాటు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇంట బయట ఇబ్బందులు ఏర్పడతాయి. వ్యాపారంలో కూడా చిన్నపాటి ఇబ్బందులు సూచిస్తున్నాయి. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. వివాహ ప్రయత్నాలు ముడి పడుతాయి. సంతానం యొక్క అభివృద్ధి సంతోషాన్ని కలిగిస్తుంది. ఎంతో కాలంగా ఉన్న భూ సంబంధిత విషయ వ్యవహారాలు ఓ కొలిక్కి వస్తాయి. పెద్దల సలహాలు సూచనలు తీసుకొని ముందుకు వెళ్ళండి. చదివిన చదువుకు చేస్తున్న ఉద్యోగానికి సంబంధం ఉండదు. తొందరపాటు నిర్ణయాల వల్ల ఇబ్బందులు ఏర్పడతాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి కన్‌స్ట్రక్షన్‌ రంగంలో ఉన్నవారికి ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ఈ రాశి వారు ప్రతి రోజు ప్రతినిత్యం హనుమాన్ చాలీసా పారాయణ చేయండి అలాగే నవగ్రహ వత్తులతో దీపారాధన చేయండి. కాలభైరవ రూపు మెడలో ధరించండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 3 కలిసి వచ్చే రంగు స్కై బ్లూ.

కుంభం: కుంభ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. మోకాళ్ళ నొప్పులకు సంబంధించి గ్యాస్ ట్రిక్ సంబంధించిన అనారోగ్య విషయాలు ఇబ్బంది పెడతాయి. పనులను వాయిదా వేసే పద్ధతులకు స్వస్తి చెప్పండి. మీరు విదేశాలకు వెళ్లడానికి అన్ని దారులు క్లియర్ అవుతాయి. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళండి. కుటుంబం కోసం అహర్నిశలు కష్టపడతారు. శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు నలుగురిలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారు. విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ఈ రాశి వారికి ఏలిన నాటి శని నడుస్తుంది కాబట్టి ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే అఘోర పాశుపత హోమం చేయించాలి దీని ద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే రంగు బ్లూ.

మీనం: మీనరాశి వారికి ఈ వారం మంచి ఫలితాలు సూచిస్తున్నాయి. సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. రాజకీయ రంగంలో రాణిస్తారు. మంచి పేరు లభిస్తుంది అప్పులు తీర్చి వేస్తారు. లోన్లకు, లోన్ యాప్లకు దూరంగా ఉండాలి. పొదుపు పైన శ్రద్ధ పెడతారు. ముఖ్యంగా అవసరానికి మించి ఖర్చు పెట్టకూడదని నిర్ణయించుకుంటారు. దైవానుగ్రహం లభిస్తుంది ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. ఉద్యోగస్తులకు ఉద్యోగ పరంగా ఈ వారం బాగుంటుంది. సంతానం కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ వారం శుభవార్త వింటారు. మితిమీరిన ఆత్మవిశ్వాసం వల్ల ఇబ్బందులు ఏర్పడతాయి. వాహనయోగం ఏర్పడుతుంది. ఆహార నియమాలు పాటించండి. జంక్ ఫుడ్స్ కి దూరంగా ఉండండి. ఈ రాశి వారికి శని నడుస్తుంది. కావున ఎనిమిది శనివారాలు శనికి తైలాభిషేకం చేయాలి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య ఎనిమిది కలిసివచ్చే రంగు తెలుపు.

ఇవి కూడా చదవండి: