Last Updated:

Daily Horoscope : నేడు ఈ రాశుల లోని వారు సంతానం విషయంలో గుడ్ న్యూస్ వింటారని తెలుసా..!

జ్యోతిష్యం ప్రకారం నేడు ఈ రాశుల లోని వారు సంతానం విషయంలో గుడ్ న్యూస్ వింటారని తెలుస్తుంది. అలాగే అక్టోబర్ 25 న  రాశి ఫలాలు (Daily Horoscope) ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా మీకోసం..

Daily Horoscope : నేడు ఈ రాశుల లోని వారు సంతానం విషయంలో గుడ్ న్యూస్ వింటారని తెలుసా..!

Daily Horoscope : జ్యోతిష్యం ప్రకారం నేడు ఈ రాశుల లోని వారు సంతానం విషయంలో గుడ్ న్యూస్ వింటారని తెలుస్తుంది. అలాగే అక్టోబర్ 25 న  రాశి ఫలాలు (Daily Horoscope) ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా మీకోసం..

మేషం..

ముఖ్యమైన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. ఒక శుభ పరిణామం కూడా చోటు చేసుకుంటుంది. ఆర్థిక ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. బంధుమిత్రులకు ఆర్థికంగా, ఉద్యోగపరంగా సహాయం చేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో సానుకూల పరిస్థితులు ఏర్పడతాయి.

వృషభం..

అదనపు ఆదాయ మార్గాలకు సంబంధించి శుభవార్త వినే అవకాశం ఉంది. తోబుట్టువు లతో సఖ్యత ఏర్పడుతుంది. కుటుంబ పెద్దల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. కొందరు బంధువుల కారణంగా ఆర్థికంగా నష్టపోయే సూచనలున్నాయి. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి.

మిథునం ..

వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలు అందుకుంటారు. ఉద్యోగ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. నిరుద్యోగులు దూర ప్రాంతం నుంచి ఆశించిన సమాచారం అందుకుంటారు. పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. స్నేహితుల మీద బాగా ఖర్చు చేయడం జరుగుతుంది. కొత్త ప్రయత్నాలు ఫలిస్తాయి.

కర్కాటకం..

వృత్తి, ఉద్యోగాల్లో కొద్దిగా చికాకులు తలెత్తుతాయి. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా ముందుకు సాగుతాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. దూరపు బంధువులతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే కొద్ది ప్రయత్నంతో ఉద్యోగం లభించే సూచనలున్నాయి.

సింహం..

రోజంగా సానుకూలంగా గడిచిపోతుంది. వృత్తి జీవితంలో కాస్తంత డిమాండ్ పెరుగుతుంది. వ్యాపారాల్లో కొద్దిగా లాభాలు చవిచూస్తారు. కుటుంబ సభ్యుల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉంటుంది. అనవసర ఖర్చుల్ని మరింతగా తగ్గించుకోవాలి. వ్యక్తిగత సమస్య ఒకటి పరి ష్కారం అవుతుంది.

కన్య..

ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. వ్యక్తిగత సమస్య ఒకటి పరి ష్కారం అవుతుంది. ఇంటా బయటా బాధ్యతలు పెరుగుతాయి.  ముఖ్యమైన వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సహకారం లభిస్తుంది. సన్నిహితుల నుంచి ఆశించిన సమాచారం అందుకుంటారు. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండకపోవచ్చు.

తుల..

సంతానపరంగా శుభవార్తలు వింటారు. విద్య, ఉద్యోగాల విషయంలో విదేశాల నుంచి ఆశిం చిన సమాచారం అందుకుంటారు. ఉద్యోగంలో అధికారులు ప్రత్యేక బాధ్యతలను అప్పగించే అవకాశం ఉంది.  కొత్త ప్రయత్నాలు, కొత్త కార్యక్రమాలు బాగా కలిసి వస్తాయి. ఆరోగ్యం పరవాలేదు.

వృశ్చికం..

ఆర్థికంగా ఇబ్బందులున్నప్పటికీ తోబుట్టువులకు సహాయం చేస్తారు. వృత్తి, ఉద్యోగాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. బంధుమిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు కాస్త కష్ట కాలం నడుస్తుంది.

ధనస్సు..

మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికారులు మీ మీద ఎక్కువగా ఆధారపడడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో పోటీదార్లను మించిపోతారు. చిన్ననాటి మిత్రులతో విందులో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆలయాలను సందర్శిస్తారు.

మకరం..

కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. అనవసర ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. సహోద్యోగుల నుంచి ఆశించిన సహకారం అందుతుంది. వృత్తి జీవితంలో గుర్తింపు లభింస్తుంది. వ్యాపారాల్లో రాబడి పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు విజయవంతంగా పూర్తవుతాయి.

కుంభం..

రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ముఖ్యమైన అవసరాలు సకాలంలో తీరతాయి. ప్రస్తుతానికి ఆర్థిక వ్యవహారాలకు దూరంగా ఉండడం మంచిది. వ్యాపారాలు ఆశాజనకంగా ముందుకు సాగిపోతాయి. నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగుంటుంది.

మీనం..

ఆధ్యాత్మిక చింతనలో ఎక్కువ సమయం గడుపుతారు. పిల్లల నుంచి శుభవార్త వింటారు. పెళ్లి ప్రయత్నాలకు సంబంధించి గుడ్ న్యూస్ తెలిసే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రకు ప్లాన్ చేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో మీ మాటకు తిరుగుండదు. వ్యాపారాల్లో లాభాలు ఆశాజనకంగా ఉంటాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.