Bangladesh PM Sheikh Hasina: బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాకు ఘనస్వాగతం
బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాకు ఇవాళ రాష్ట్రపతి భవన్‌లో ఘన స్వాగతం లభించింది. గౌరవ వందనం స్వీకరించిన తర్వాత షేక్ హసీనా మాట్లాడారు. భారత్ తమకు మంచి ఫ్రెండ్ అని, ఇండియాకు వచ్చిన ప్రతిసారి సంతోషంగా ఫీలవుతానని, విముక్తి పోరాట సమయంలో ఇండియా ఇచ్చిన సహాకారాన్ని మరిచిపోలేమన్నారు.

New Delhi: బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాకు ఇవాళ రాష్ట్రపతి భవన్‌లో ఘన స్వాగతం లభించింది. గౌరవ వందనం స్వీకరించిన తర్వాత షేక్ హసీనా మాట్లాడారు. భారత్ తమకు మంచి ఫ్రెండ్ అని, ఇండియాకు వచ్చిన ప్రతిసారి సంతోషంగా ఫీలవుతానని, విముక్తి పోరాట సమయంలో ఇండియా ఇచ్చిన సహాకారాన్ని మరిచిపోలేమన్నారు.
తమ మధ్య స్నేహపూర్వక సంబంధం ఉందని ఒకరికి ఒకరు సహకరించుకుంటున్నట్లు ఆమె చెప్పారు. పేదరిక నిర్మూలన, ఆర్థిక వృద్ధిపైనే తమ ఫోకస్ ఉన్నట్లు ఆమె తెలిపారు. బంగ్లా, ఇండియాతో పాటు దక్షిణాసియా ప్రజల అభ్యున్నతికి రెండు దేశాలు పాటు పడాలని హసీనా అన్నారు. ఫ్రెండ్‌షిప్‌తో ఎటువంటి సమస్యనైనా పరిష్కరించవచ్చు అన్నారు. గౌరవ వందనం తర్వాత రాజ్‌ఘాట్ వెళ్లిన హసీనా అక్కడ గాంధీ సమాధికి పుష్ప నివాళి అర్పించారు.