Last Updated:

TDP Protest: జాబ్ ఎక్కడ జగన్.. అసెంబ్లీ ముట్టడికి యత్నించిన తెదేపా నేతలు

ఉద్యోగాల భర్తీని డిమాండ్ చేస్తూ తెదేపా నేతలు అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. కాగా వెలగపూడి చెక్ పోస్ట్ వద్ద వారిని పోలీసులు అడ్డగించారు. ఈ క్రమంలో పోలీసులకు, తెదేపా నేతలకు మధ్య తీవ్ర తోపులాట చోటుచేసుకుంది.

TDP Protest: జాబ్ ఎక్కడ జగన్.. అసెంబ్లీ ముట్టడికి యత్నించిన తెదేపా నేతలు

Amaravati: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అమరావతి సమీపంలోని వెంకటపాలెం గ్రామంలో ఎన్టీఆర్‌ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌, రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన చేపట్టారు. తుళ్లూరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వద్ద నిరుద్యోగ సమస్య పై ధర్నా చేపట్టారు. సీఎం జగన్ చెప్పిన 2.30లక్షల ఉద్యోగాలు, జాబ్‌ క్యాలెండర్‌ ఎక్కడ అంటూ ప్లకార్డులతో నినాదాలు చేశారు. జాబ్‌ రావాలంటే జగన్‌ పోవాలంటూ నినదించారు.

ప్రతిపక్షంలో ఉండగా ప్రతి జనవరిలో జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తామన్న జగన్‌, అధికారంలోకి వచ్చాక ఆ హామీ మర్చిపోయారని పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు విమర్శించారు. ఉద్యోగాలు భర్తీ చేయలేదన్నారు.

ఉద్యోగాల భర్తీని డిమాండ్ చేస్తూ తెదేపా నేతలు అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. కాగా వెలగపూడి చెక్ పోస్ట్ వద్ద వారిని పోలీసులు అడ్డగించారు. ఈ క్రమంలో పోలీసులకు, తెదేపా నేతలకు మధ్య తీవ్ర తోపులాట చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో పలువురు నేతలకు గాయాలయ్యాయి. కాగా తెలుగు యువత నాయకులను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో అసెంబ్లీ వద్ద పోలీసులు భారీగా మోహరించారు.

ఇదీ చదవండి: నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

ఇవి కూడా చదవండి: