Home / బ్రేకింగ్ న్యూస్
భారత ప్రభుత్వం తరఫున ఎలిజబెత్-2 అంత్యక్రియల్లో పాల్గొనేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము లండన్ వెళ్లారు. ఆదివారం ఉదయం ద్రౌపది ముర్ము అక్కడికి చేరుకున్నారు.
విశాఖ ఎక్స్ ప్రెస్ కు పెను ప్రమాదం తప్పింది. ఏలూరు దగ్గర రన్నింగ్ ట్రైన్ నుంచి మూడు బోగీలు విడిపోయాయి. ఒక్కసారిగా బోగీలు రైలు నుంచి వేరవ్వడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
స్టూడెంట్ పై లెక్చరర్ దారుణంగా దాడి చేశాడు. ఈ ఘటన ఇప్పుడు ఏపీలో కలకలంగా మారింది. విజయవాడ చైతన్య కాళాశాల ఘనటపై ఇంటర్మీడియట్ బోర్డ్ ఫైర్ అయ్యింది. చైతన్య కళాశాల భాస్కర్ క్యాంపస్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
తెలుగు రాష్ట్రాల్లో ఉగ్రవాద కార్యకలాపాలపై ఎన్ఐఏ సోదాలు చేపట్టింది. పీఎఫ్ఐ (పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా) కేసులో ఎన్ఐఏ తమ దర్యాప్తును వేగవంతం చేసింది. నిజామాబాద్, నిర్మల్, కడప, కర్నూలు, గుంటూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో దాడులు చేపట్టింది.
జార్ఖండ్‌లో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు నదిలో పడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు చనిపోయినట్టు తెలుస్తోంది. పలువురు నీటిలో చిక్కుకున్నారు.
రాష్ట్రంలోని గిరిజనులకు సీఎం కేసీఆర్ తీపి కబురు చెప్పారు. గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని, ఇందుకు సంబంధించిన జీవోను వారం రోజుల్లో విడుదల చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు.
మాజీ మంత్రి షబ్బీర్ అలీ, మాజీ సీపీ ఏకే ఖాన్ కుమారుడు మోసిన్ ఖాన్ పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. అయితే షబ్బిర్ అలీ, మోసిన్ ఖాన్. ఎక్కువ లాభాలు ఇప్పిస్తామని మాయ మాటలు చెప్పి తన వద్ద నుంచి దాదాపు 90 లక్షల రూపాయల వరకు తీసుకున్నారని మహమ్మద్ అబ్ధుల్ వహాబ్ అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించారు.
సెప్టెంబర్ 18వ తేదీన అంటే ఆదివారం రోజున 34 ఎంఎంటీఎస్ రైళ్లను రద్దుచేస్తున్నట్టుగా దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది.
అసలే తెలంగాణ రాష్ట్రంలో తెరాస వర్సెస్ భాజపా అన్నట్టుగా రాజకీయం వేడెక్కుతుంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటనలో పోలీసుల భద్రతా లోపం చోటుచేసుకుంది. అమిత్ షా కాన్వాయ్ ని తెరాస నేత కారు అడ్డగించింది.
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి శుక్రవారం నామినేషన్ దాఖలుచేశారు. శాసనసభ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులవద్ద నామినేషన్ పత్రాలు దాఖలు చేసారు. ఈ పదవికి ప్రతిపక్షం పోటీ పడనందున కోలగట్ల ఏకగ్రీంగా ఎన్నిక కానున్నారు.