Home / బ్రేకింగ్ న్యూస్
దుర్గామాత పూజలో అపశ్రుతి చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి ముగ్గురు అగ్నికి ఆహుతయ్యారు. మరో 60 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదం ఉత్తరప్రదేశ్‌లోని భదోహిలో చోటుచేసుకుంది.
సమాజ్ వాదీ పార్టీ వ్యవస్ధాపకుడు, రాజకీయ కురువృద్దుడు. ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ ఆరోగ్య పరిస్ధతి విషమంగా ఏర్పడింది. ఐసీయులో చికిత్స తీసుకొంటున్న ములాయం సింగ్ యాదవ్ పరిస్ధతి మరింత క్షీణించిన్నట్లు జాతీయ మీడియా కధనాలతో తెలుస్తుంది
ఈత సరదా ఆ కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. రంగారెడ్డి జిల్లా యాచారం మండల తాడిపర్తి గ్రామంలో విషాదం నెలకొంది. ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు మరణించారు.
లోన్ యాప్స్ వేధింపులకు ఏపీలోని మరో ప్రాణం బలయ్యింది. మైక్రో ఫైనాన్స్ మరియు లోన్ యాప్స్ ఆగడాలు రోజురోజుకు పెచ్చుమీరుతున్నాయి. దీనితో చేసేదేం లేక ఇప్పటికే చాలామంది యువతీ యువకులు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. కాగా తాజాగా తూర్పు గోదావరి జిల్లాలోని రాజమండ్రిలో లోన్‌యాప్ అరాచకానికి మరో యువకుడు ప్రాణం తీసుకున్నాడు.
ఎవరైనా కూరలో ఉప్పు తక్కువైతే కాస్త ఉప్ప వేసుకుని తింటారు. లేదా ఇంకేం వేసుకుంటాములే అని సర్దుకుపోయి తింటారు. మహా అంటే వంట చేసిన భార్యని నాలుగు మాటలంటారు. కానీ ఈ ప్రబుద్ధుడు మాత్రం కూరలో ఉప్పచాలలేదని కట్టుకున్న భార్యనే కడతేర్చాడు. ఈ దారుణ ఘటన బిహార్ రాష్ట్రంలో వెలుగు చూసింది.
హైదరాబాద్‌లో భారీ ఉగ్ర కుట్రను పోలీసులు భగ్నం చేశారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ నేతలే టార్గెట్‌గా పేలుళ్లకు కుట్ర పన్నిన జాహిద్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పలు ఉగ్రవాద గ్రూపులతో జాహిద్‌కు లింకులు వున్నట్లుగా సమాచారం.
స్టేడియంలోనే 129 మంది మృతి చెందారు. దాదాపు మరో 180 మందికి పైగా గాయపడ్డారు. ఫుట్ బాల్ మైదానంలో ఇరుజట్ల ఫ్యాన్స్ మధ్య తీవ్ర రణరంగం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటన ఇండోనేషియాలోని ఈస్ట్ జావాలో చోటుచేసుకుంది.
తెలుగుదేశం పార్టీ (టీడీపీ) కి చెందిన అధికారిక ట్విట్టర్ ఖాతా(జైటిడిపి) హ్యాకింగ్‌కు గురైనట్లు టిడిపి డిటిజల్ వింగ్ శనివారం మధ్యాహ్నం ఓ ప్రకటన చేసింది. తమ పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతాను హ్యాక్ చేశారని తెలిపింది.
రేపటి నుంచి అనగా 2 అక్టోబర్ 2022 నుంచి రాష్ట్రంలోని ఇంటర్ కాలేజీలకు దసరా సెలవులు ప్రకటిస్తూ ఇంటర్మీడియట్ బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబర్ 10న కళాశాలలు పున:ప్రారంభం కానున్నాయని వెల్లడించింది.
సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మల్లికార్జున్ ఖర్గే శనివారం రాజ్యసభలో ప్రతిపక్ష నేత పదవికి రాజీనామా చేశారు. శుక్రవారం పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేసిన ఖర్గే తన రాజీనామాను కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీకి పంపారు.