Home / బ్రేకింగ్ న్యూస్
5జీ టెక్నాలజీ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందా? అని ఎదురుచూస్తున్న ఎయిర్ టెల్ వినియోగదారులకు భారీ షాక్ తగిలింది. ఐఫోన్, శాంసంగ్, వన్ ప్లస్‌తో పాటు ఇతర స్మార్ట్ ఫోన్లలో ఈ 5జీ టెక్నాలజీ పనిచెయ్యడం లేదని యూజర్లు వాపోయతున్నారు.
భారతదేశం ఓ లెప్టినెంట్ కల్నల్ ను పోగొట్టుకొనింది. రోజువారీ గస్తీలో తిరుగుతుండగా అరుణాచల్ ప్రదేశ్ లో ఈ ఘటన చోటుచేసుకొనింది
తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని భారత్ రాష్ట్ర సమితి పేరుతో జాతీయ పార్టీగా మారుస్తూ ఆ పార్టీ అధినేత సీఎం కేసిఆర్ తీర్మానంపై సంతకం చేశారు
సాధారణంగా చిన్న పిల్లలే కనిపించినవన్నీ మింగేస్తుంటారు. అలా కాయిన్స్, పేపర్లు, స్పూన్లు, చిన్నపిల్లల పొట్టలో కనిపించిన సందర్భాలను చూసాము, విన్నాం. కానీ ఇందుకు భిన్నంగా ఓ వృద్ధుడి కడుపులో ఏకంగా గ్లాస్ కనిపించింది ఇది చూసిన వైద్యులు ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని రాజ్ ఘర్ ప్రాంతంలో జరిగింది.
ప్రాణాలకు కాపాడాల్సిన ఈ వైద్యుడు ఎంత క్రూరంగా ప్రవర్తించాడో తెలిస్తే ఆక్రోషం వస్తుంది. సోషల్ మీడియా స్నేహాలు ఎంత దారుణాలకు ఒడిగడతాయో చెప్పేందుకు ఈ ఘటన ఓక ప్రత్యక్ష ఉదాహరణ. సామాజిక మాధ్యమాల్లో పరిచయమైన ఓ మహిళను తన ఆసుపత్రికి రమ్మని ఆహ్వానించిన వైద్యుడు మరో ఇద్దరు వైద్యులతో కలిసి ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు.
పెళ్లి ఇంట విషాదం చోటుచేసుకుంది. పెళ్లి బృందంతో వెళ్తున్న బస్సు ప్రమాదవశాత్తు లోయలో పడి 25 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 21 మంది గాయపడ్డారు. ఈ విషాద ఘటన ఉత్తరాఖండ్‌లో చోటుచేసుకుంది.
దసరా సెలవులు ఆ ఇళ్లల్లో విషాదాన్ని నింపాయి. సరదాగా విహారయాత్రకని వెళ్లిన ఏడుగురు విద్యార్థులు సముద్రంలో గల్లంతయ్యారు. ఈ విషాద ఘటన ఏపీలోని బాపట్ల సూర్యలంక తీరంలో చోటుచేసుకుంది.
ప్రాణాలు పోయాల్సిన డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. కాగా ఇలాంటి సంఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. పుట్టిన బిడ్డకు బొడ్డుతాడు కట్ చెయ్యాల్సింది పోయి చిన్నారి చిటికెన వేలుని కత్తించారు ఆ నిర్లక్ష్యపు వైద్యులు. ఈ దారుణ ఘటన పల్నాడు జిల్లాలోని మాచర్ల ప్రభుత్వాసుపత్రిలో చోటుచేసుకుంది.
చిరంజీవి ముఖ్య పాత్రలో నటించి గాడ్ ఫాదర్ చిత్రం ప్రెస్ మీట్ హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగా మెగాస్టార్ తన తమ్ముడు పవన్ కల్యాణ్ మరియు పవన్ నెలకొల్పిన జనసేన పార్టీ గురించి ప్రస్తావించారు. పవన్ వంటి నిబద్ధత ఉన్న నాయకుడు రాష్ట్రానికి కావాలని ఆయన తెలిపారు. ప్రజలు పవన్‌కు రాష్ట్రాన్ని ఏలే అవకాశం ఇచ్చే రోజు రావాలని తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాని చిరంజీవి చెప్పారు.
టీ20 ప్రపంచకప్‌కు దూరమవ్వడంపై జస్ప్రీత్ బుమ్రా ట్విట్టర్ వేదికగా స్పందించాడు. మెగా టోర్నీ నుంచి తప్పుకోవడం పట్ల భావోద్వేగానికి గురయ్యాడు. తాను గాయం నుంచి కోలుకోవాలని కోరుకున్న పత్రీ ఒక్కరికి బుమ్రా ధన్యవాదాలు చెప్పారు. ఆస్ట్రేలియా వెళ్లి టీమిండియాకు మద్దతు తెలుపుతానంటూ ట్వీట్ చేశాడు.