Last Updated:

Cold: తెలంగాణలో మరింత పెరగనున్న చలి

తెలంగాణలో శీతాకాలం ప్రారంభంలోనే, విపరీతంగా చలి ఉంది. రాష్ట్ర రాజధానిలో పగటి ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగానే ఉంటుంది. గతంలో 19-21 డిగ్రీల సెల్సియస్‌గా ఉన్న రాత్రి కనిష్ట ఉష్ణోగ్రత ఇప్పుడు 16 డిగ్రీల సెల్సియస్‌కి పడిపోయింది.

Cold: తెలంగాణలో మరింత పెరగనున్న చలి

Hyderabad: తెలంగాణలో శీతాకాలం ప్రారంభంలోనే విపరీతంగా చలి ఉంది. రాష్ట్ర రాజధానిలో పగటి ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగానే ఉంటుంది. గతంలో 19-21 డిగ్రీల సెల్సియస్‌గా ఉన్న రాత్రి కనిష్ట ఉష్ణోగ్రత ఇప్పుడు 16 డిగ్రీల సెల్సియస్‌కి పడిపోయింది.

తాజాగా వాతావరణ శాఖ అధికారుల నివేదిక ప్రకారం తెలంగాణలో చలి తీవ్రత మరింత పెరుగనుందట. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు మరింత పడిపోనున్నాయట. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది చలి తీవ్రత పెరుగనుందని అధికారుతు తెలిపారు. చలిగాలుల నేపథ్యంలో పిల్లలు, వృద్ధులు, గర్భిణీలు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరికలు జారీ చేశారు.

సాయంత్రం 6 గంటల నుంచే చలి తీవ్రత మొదలై, తీవ్రమైన చలి గాలులు వీస్తాయని పేర్కొన్నారు. తెల్లవారుజామున పొగమంచు కురుస్తుండడంతో రాకపోకలకు ఇబ్బందులు తప్పవని.. వాహనాలు నెమ్మదిగా, జాగ్రత్తగా నడపాలని సూచించారు.

ఇవి కూడా చదవండి: