IND vs BAN: నిలిచిన వాన.. చిగురించిన భారత్ సెమీస్ ఆశలు
ఉత్కంఠగా సాగుతున్న భారత్, బంగ్లా జట్ల మధ్య టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ పునఃప్రారంభం అయ్యింది. దానితో మ్యాచ్ కు ఎక్కడ డీఎల్ఎస్ ప్రకటిస్తారో అని దాని ద్వారా భారత్ సెమీస్ కు చేరదేమో అని జంకుతున్న క్రికెట్ లవర్స్ కు కాస్త ఊరటనిచ్చేలా వర్షం నిలిచిపోయింది. దానితో మ్యాచ్ పునఃప్రారంభమైంది.
IND vs BAN: ఉత్కంఠగా సాగుతున్న భారత్, బంగ్లా జట్ల మధ్య టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ పునఃప్రారంభం అయ్యింది. 185 పరుగుల టార్గెట్‌ను ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లా జట్టు 7 ఓవర్లు పూర్తిచేసే సరికి వికెట్ నష్టపోకుండా 66 పరుగులు పూర్తి చేసింది అంతలో వర్షం కురవడంతో మ్యాచ్ కొంచెం సేపు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. దానితో మ్యాచ్ కు ఎక్కడ డీఎల్ఎస్ ప్రకటిస్తారో అని దాని ద్వారా భారత్ సెమీస్ కు చేరదేమో అని జంకుతున్న క్రికెట్ లవర్స్ కు కాస్త ఊరటనిచ్చేలా వర్షం నిలిచిపోయింది.
దానితో మ్యాచ్ పునఃప్రారంభమైంది. కాగా డీఎల్ఎస్ ప్రకారం బంగ్లాదేశ్ టార్గెట్‌ను 16 ఓవర్లకు 151 పరుగులుగా డిసైడ్ చేశారు. అయితే, ఆట మొదలైన వెంటనే బంగ్లాదేశ్ టీం తొలి వికెట్‌ను కోల్పోయింది. బంగ్లా బ్యాటర్ దాస్ 60 పరుగుల వద్ద రనౌట్ అయ్యాడు. కాగా 12వ ఓవర్ తొలి బంతికి అర్షదీప్ బంగ్లా బ్యాటర్ ఆఫిఫ్‌ను పెవిలియన్ చేర్చాడు. అయితే ఇప్పటి వరకు 5 వికెట్ల నష్టానికి 102 పరుగులు చేసింది.
ఇదీ చదవండి: ఐసీసీ ర్యాంకింగ్ లో సూర్యకుమార్ యాదవ్ నెంబర్ 1