Home / బ్రేకింగ్ న్యూస్
స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా టీఎస్ఆర్టీసీ ప్రయాణికులపై పలు రాయితీలు ప్రకటించింది. ఈ ఆగస్టు 15న పుట్టే శిశువులు, వాళ్లకు 12 ఏళ్ల వయసు వచ్చే వరకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ బుధవారం ప్రకటించారు.
తెలంగాణ రాష్ట్ర బీజేపీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌గా సునీల్ బన్సాల్ నియమితులయ్యారు. తరుణ్ చుగ్ స్థానంలో బీజేపీ అధిష్టానం సునీల్ బన్సాల్‌ను నియమించింది. ప్రస్తుతం సునీల్ బన్సాల్ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు.
తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ ఇవాళ సమావేశం కానుంది. ప్రగతిభవన్‌లో మధ్యాహ్నం 3 గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగే క్యాబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ఈ నెల 8 నుండి 22వ తేదీ వరకు స్వతంత్ర భారత వజ్రోత్సవాల వేడుకలు జరుగుతున్నాయి.
భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి పెరుగుతుంది. నిన్న50.50 అడుగులు ఉన్న గోదావరి ప్రవాహం ఈరోజు 51.60 అడుగులకు చేరింది. కాగా భద్రాచలం దగ్గర రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. 13 లక్షల 49 వేల 465 క్యూసెక్కుల వరద నీరు దిగువకు విడుదల చేశారు.
దక్షిణాఫ్రికాకు చెందిన అంతర్జాతీయ అంపైరింగ్ దిగ్గజం రూడీ కోర్జెన్ కన్నుమూశారు. రోడ్డు ప్రమాదంలో రూడీ ప్రాణాలు విడిచారు. రూడీ ప్రయాణిస్తున్న కారు మరో వాహనాన్ని ఢీకొట్టింది. నెల్సన్ మండేలా బే ఏరియాలో నివసించే రూడీ కోర్జెన్ గోల్ఫ్ టోర్నీలో పాల్గొనేందుకు కేప్ టౌన్ వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
నకిలీ ఇంజనీరింగ్ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన సర్టిఫికెట్లు తయారు చేసి విక్రయిస్తున్న ఈ ముఠా దగ్గర్నుంచి పెద్ద మొత్తంలో నకిలీ సర్టిఫికెట్లను రాచకొండ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
హిందూపురం వైసీపీ ఎంపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో వ్యవహారంపై అనంతపురం ఎస్పీ ఫకీరప్ప మీడియా సమావేశం నిర్వహించారు. వీడియో కాల్ వ్యవహారంపై ఎంపీ మాధవ్ అభిమాని కొణతాల వెంకటేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనంతపురం టూటౌన్ పోలీస్ స్టేషన్ ఈనెల 4న కేసు నమోదు
’బయోలాజికల్ ఇ‘ యొక్క కార్బెవాక్స్ 18 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారికి మరియు కోవిషీల్డ్ లేదా కోవాక్సిన్‌తో పూర్తిగా టీకాలు వేసిన వారికి (డబుల్ డోస్) బూస్టర్ లేదా ముందు జాగ్రత్త డోసుగా ఆమోదించబడింది. ఇమ్యునైజేషన్‌పై నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ (NTAGEI) యొక్క COVID-19
ప్రియాంక గాంధీ వాద్రాకు కరోనా సోకింది. ప్రియాంక గాంధీకి కరోనా సోకడం ఇది రెండోసారి. ఆమె ఐసోలేషన్‌లో వున్నారు. తనకు కరోనా వైరస్ సోకిందని ప్రియాంక గాంధీ ట్వీట్ ద్వారా సమాచారం అందించారు. ప్రియాంక గాంధీ ట్వీట్ చేస్తూ, "ఈ రోజు మరోసారి కరోనా వైరస్ బారిన పడ్డాను.
బీహార్ సీఎంగా నితీష్ కుమార్ నేడు ఎనిమిదోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.తేజస్వి యాదవ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనుండగా ఇతర మంత్రుల ప్రమాణ స్వీకారంపై స్పష్టత లేదు. నితీష్ కుమార్ ప్రజల తీర్పుకు వ్యతిరేకంగా ద్రోహం చేశారని ఆరోపిస్తూ బీజేపీ