Home / బ్రేకింగ్ న్యూస్
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల వేళ దాడులు, అల్లర్లకు జరిగే అవకాశాలున్నాయని ఇంటలిజెన్స్ నుంచి సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన ఢిల్లీ పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. పదివేల మంది పోలీసులను ఢిల్లీలో మోహరించారు. గాలిపటాలు, బెలూన్లు, డ్రోన్లు ఎగురవేయకుండా ఆంక్షలు విధించారు.
విస్తారంగా కురుస్తున్న వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరికి వరద ప్రవాహం పెరుగుతుంది. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 49. 50 అడుగులకు చేరింది. వరద ప్రవాహం అధికంగా ఉండటంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. ప్రస్తుతం రెండో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు.
దక్షిణ కొరియా రాజధాని సియోల్‌ను భారీ వరదలు ముంచెత్తాయి. సోమవారం రాత్రి కుంభవృష్టి కురియడంతో పల్లపు ప్రాంతాల్లో నీరు చేరింది. ఈ వరదల్లో ఇప్పటి వరకు 8 మంది మృతి చెందగా, 14 మంది గాయపడ్డారు. భారీ వర్షాలకు నగరంలోని వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్ నిలిచిపోయింది. చాలా చోట్ల రోడ్లపై కార్లు
నోయిడా పోలీసులు శ్రీకాంత్ త్యాగిని అదుపులోకి తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో త్యాగితో పాటు మరో ముగ్గురిని నోయిడా పోలీసులు అరెస్టు చేశారు. సోషల్ మీడియాలో తనకు తాను బీజేపీ కిసాన్ మోర్చా ఎగ్జిక్యూటివ్అని ప్రకటించుకున్నాడు త్యాగి. నిన్న నోయిడాలోని సెక్టార్ 93-బీలోని గ్రాండ్ ఒమాక్సీ సొసైటీలో అక్రమంగా నిర్మించిన కట్టడాన్ని అధికారులు
నితీష్ కుమార్ మంగళవారం బీహార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. కుమార్ బీహార్ గవర్నర్ ఫాగు చౌహాన్‌ను రాజ్ భవన్లో కలుసుకున్నారు మరియు రాష్ట్రంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి ప్రభుత్వాన్ని ముగించినందుకు గుర్తుగా ఉన్నత పదవికి రాజీనామా లేఖను సమర్పించారు
ప్రేమ గుడ్డిది, హద్దులు చూడదు అంటారు. అస్సాంలోని ఒక టీనేజ్ అమ్మాయి తన ప్రేమను నిరూపించుకోవడానికి చేసిన విపరీత చర్య చూసాక ఈ సామెత గుర్తుకు రాక మానదు. అసోంలోని సుల్కుచి జిల్లాలో 15 ఏళ్ల బాలిక తన ప్రేమను గొప్పగా చాటుకునే ప్రయత్నంలో తన ప్రియుడి హెచ్ఐవీ పాజిటివ్ రక్తాన్ని తన శరీరంలోకి ఎక్కించింది.
మంగళవారం ఉదయం ముంబయిలోని రాజ్‌భవన్‌లో జరిగిన మహారాష్ట్ర మంత్రివర్గ విస్తరణ మొదటి దశలో 18 మంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ మంత్రులతో ప్రమాణం చేయించారు. బీజేపీ నుంచి మంత్రి మండలిలో చేరిన తొమ్మిది మంది ఎమ్మెల్యేలు గిరీష్ మహాజన్,
బీహార్ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. గవర్నర్ ఫాగు చౌహాన్‌ను కలిసేందుకు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సమయం కోరినట్లు సమాచారం. ఈ సమావేశం మధ్యాహ్నం 12.30 నుంచి 1 గంటల మధ్య జరగొచ్చు. ఆయనతో పాటు ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ కూడా కలిసే అవకాశముంది. మరోవైపు రాష్ట్రంలోని భారతీయ జనతా పార్టీ చెందిన మంత్రులు
కామన్వెల్త్ క్రీడల్లో చివరి రోజూ భారత క్రీడాకారులు అదరగొట్టారు. వెయిట్‌లిఫ్టర్లు, రెజ్లర్లు, బాక్సర్ల తరహాలోనే షట్లర్లు సైతం చక్కటి ప్రదర్శన చేయడంతో బర్మింగ్‌హామ్ క్రీడలను భారత్ ఘనంగా ముగించింది. చివరి రోజు మరో నాలుగు స్వర్ణాలు భారత్ ఖాతాలో జమ అయ్యాయి. అందులో మూడు బ్యాడ్మింటన్‌లో వచ్చినవే.
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. విస్తారంగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ప్రాజెక్టులన్నీ నిండుకుండలా మారాయి. విస్తారంగా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్థవ్యస్థంగా మారింది. భారీ వర్షాల నేపథ్యంలో రెండు రాష్ట్రాల్లోని అధికారులు అప్రమత్తం అయ్యారు.