Published On:

Maruti Suzuki Six Airbags: బ్రెజ్జా అప్‌డేట్ అయింది.. కొత్తగా ఏం మారిందో తెలుసా..?

Maruti Suzuki Six Airbags: బ్రెజ్జా అప్‌డేట్ అయింది.. కొత్తగా ఏం మారిందో తెలుసా..?

Maruti Suzuki Six Airbags: మారుతి సుజికి తన 4-మీటర్ బ్రెజ్జా ఎస్‌యూవీ అప్‌డేట్ చేసింది. ఇప్పుడు ఈ ఫేమస్‌ ఎస్‌యూవీ అన్ని వేరియంట్లలో ఆరు ఎయిర్‌బ్యాగ్స్ ఉంటాయి. బ్రెజ్జా బేస్ LXI 1.5-లీటర్ పెట్రోల్ మాన్యువల్ వేరియంట్  ఎక్స్-షోరూమ్ ధర రూ. 8.69 లక్షలుగా మారింది. టాప్-ఎండ్ ZXI+ 1.5-లీటర్ ఆటోమేటిక్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 13.98 లక్షలుగా మారింది. కాగా, CNG వేరియంట్ఎక్స్-షోరూమ్ ధర రూ.9.64 లక్షల నుండి ప్రారంభమవుతుంది.

బ్రెజ్జా అప్‌డేట్ చేసిన ఫీచర్ల విషయానికి వస్తే.. 6 ఎయిర్‌బ్యాగ్స్ దాని అన్ని వేరియంట్‌లలో స్టాండర్డ్‌గా ఉన్నాయి. భద్రత కోసం 3-పాయింట్ ELR వెనుక సెంటర్ సీట్‌బెల్ట్, అడ్జస్ట్ చేయగల ఫ్రంట్ సీట్‌బెల్ట్, సౌకర్యవంతమైన కప్ ఆర్మ్‌హోల్డ్ స్థలం కోసం 60:40 స్ప్లిట్ రియర్ సీట్, ఇతర ఫీచర్లు ఉన్నాయి. ప్రయాణీకుల సౌకర్యాన్ని మెరుగుపరచడానికి సర్దుబాటు చేయగల వెనుక హెడ్‌రెస్ట్‌లు చేర్చారు.

ఈ కారులో K-సిరీస్ 1.5-డ్యూయల్ జెట్ WT ఇంజన్ కలదు. ఇది స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీని సపోర్ట్ చేస్తుంది. ఇంజిన్ 6-స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌తో ఉంటుంది. ఈ ఇంజన్ 103హెచ్‌పి పవర్, 137ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంధన సామర్థ్యం కూడా పెరిగిందని కంపెనీ పేర్కొంది. న్యూ బ్రెజ్జా మాన్యువల్ వేరియంట్ 20.15 kp/l మైలేజీని ఇస్తుంది. ఆటోమేటిక్ వేరియంట్ 19.80 kp/l మైలేజీని ఇస్తుంది.

బ్రెజ్జాలో 360 డిగ్రీల కెమెరా ఉంది. ఈ కెమెరా చాలా హైటెక్, మల్టీ-ఇన్ఫర్మేషన్ ఇచ్చే కెమెరా. ఈ కెమెరా కారు  9-అంగుళాల స్మార్ట్‌ప్లే ప్రో ప్లస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌కు కనెక్ట్ చేసి ఉంటుంది. దీనిని సుజుకి, టయోటా రెండూ సంయుక్తంగా తయారు చేశాయి. ఈ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లేలను సపోర్ట్ చేస్తుంది. ఈ కెమెరా ప్రత్యేకత ఏమిటంటే, కారు లోపల కూర్చున్నప్పుడు, మీరు స్క్రీన్‌పై కారు చుట్టూ ఉన్న విజువల్స్ చూడగలుగుతారు.

ఇందులో వైర్‌లెస్ ఛార్జింగ్ డాక్ కూడా ఉంది. ఈ డాక్ సహాయంతో, మీరు మీ స్మార్ట్‌ఫోన్‌ను వైర్‌లెస్‌గా సులభంగా ఛార్జ్ చేయగలరు. ఫాస్ట్ ఛార్జింగ్‌ని సపోర్ట్ చేస్తుంది. అలానే మారుతి అనేక కనెక్టింగ్ ఫీచర్లు కూడా ఇందులో అందుబాటులో ఉంటాయి. ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీని చాలా విలాసవంతమైన, అధునాతనమైనదిగా చేస్తుంది. దేశంలో హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ వంటి మోడళ్లతో పోటీపడుతుంది.