Mahindra XEV 9e And BE 6 Bookings: మహీంద్రా కొత్త ఎలక్ట్రిక్ కార్లకు సూపర్ క్రేజ్.. మొదటి రోజే రూ. 8472 కోట్ల బుకింగ్స్..!

Mahindra XEV 9e And BE 6 Bookings: మహీంద్రా BE 6కి ఇప్పటి వరకు దేశంలో ఏ ఎలక్ట్రిక్ కారుకు ఇన్ని బుకింగ్స్ రాలేదు. మహీంద్రాకు చెందిన ఈ రెండు ఎలక్ట్రిక్ SUVల యూనిట్ల బుకింగ్ విలువ ముందుగా బుక్ చేసుకున్న ఎక్స్-షోరూమ్ ధర ప్రకారం రూ. 8472 కోట్లు అని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. అంటే కస్టమర్ ఇప్పుడు ఎలక్ట్రిక్ కారు కోసం సిద్ధంగా ఉన్నారు. ఈ రెండు వాహనాల ధర, ఇతర ఫీచర్ల గురించి తెలుసుకుందాం.
మహీంద్రా XEV 9e 56శాతం బుకింగ్‌లను పొందగా, BE 6 44శాతం బుకింగ్‌లను పొందింది. ఈ రెండూ చాలా స్టైలిష్ వాహనాలు. ఎంచుకున్న మహీంద్రా డీలర్‌షిప్‌లలో, అధికారిక మహీంద్రా వెబ్‌సైట్‌లో XEV 9e, BE 6 బుకింగ్‌లు ఇప్పటికీ ఓపెన్‌లో ఉన్నాయి. ధర గురించి మాట్లాడితే మహీంద్రా BE 6 ధర రూ. 18.90 లక్షలు కాగా, XEV 9e ధర రూ. 21.90 లక్షల నుండి ప్రారంభమవుతుంది. మొదటి రోజునే 30,179 బుకింగ్‌లను పొందడం మహీంద్రాకు పెద్ద విజయంగా చెప్పచ్చు.
మహీంద్రా BE 6, XEV 9e 59 కిలోవాట్, 79కిలోవాట్ రెండు బ్యాటరీ ప్యాక్‌లతో వస్తాయి. ఈ రెండూ ఫుల్ ఛార్జింగ్ పై 500 కి.మీ కంటే ఎక్కువ దూరాన్ని అందిస్తాయి. DC ఫాస్ట్ ఛార్జర్‌తో బ్యాటరీ కేవలం 20 నిమిషాల్లో 20శాతం నుండి 80శాతం వరకు ఛార్జ్ అవుతుందని కంపెనీ తెలిపింది. కంపెనీ బ్యాటరీపై జీవితకాల వారంటీని ఇస్తోంది. సేఫ్టీ ఫీచర్ల గురించి చెప్పాలంటే.. ఇందులో 7 ఎయిర్‌బ్యాగ్‌లు, లెవల్ 2 అడాస్ సూట్, 360-డిగ్రీ కెమెరా, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
BE 6 దాని 59కిలోవాట్ బ్యాటరీ ప్యాక్‌తో 535 కి.మీ దూరాన్ని కవర్ చేయగలదని మహీంద్రా చెబుతుంది, అయితే 79కిలోవాట్ బ్యాటరీ వేరియంట్ 682 కి.మీ పరిధిని అందిస్తుందని పేర్కొంది. XEV 9e 59 కిలోవాట్ బ్యాటరీతో 542 కిమీ, 79 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్‌తో 656 కిమీ పరిధిని సాధిస్తుందని చెబుతారు.
రెండు వాహన మోడళ్లకు 230 బిహెచ్‌పి గరిష్ట పవర్ అవుట్‌పుట్‌ను అందించడానికి చిన్న బ్యాటరీ ప్యాక్ ట్యూన్ చేశారు. అయితే పెద్ద బ్యాటరీ ప్యాక్ 285 బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయగలదు. ప్రస్తుతం, మహీంద్రా ప్రత్యేకంగా ఎలక్ట్రిక్ SUVలను వెనుక చక్రాల డ్రైవ్ సెటప్‌లో అందిస్తుంది. మూడు డ్రైవింగ్ మోడ్‌లు ఉంటాయి.