Home /Author M Rama Swamy
Centre has finalized the EPF interest Rate 8.25 Percent: ఉద్యోగులకు కేంద్రం శుభవార్త చెప్పింది. ఈపీఎఫ్ నిల్వలపై వడ్డీ రేటును పెంచుతూ ఖరారు చేసింది. 2024-25 ఆర్థిక ఏడాదికి 8.25 శాతంగా నోటిఫై చేసింది. ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) సెంట్రల్ బోర్డు ఆఫ్ ట్రస్టీస్ కొన్నిరోజుల కింద ప్రతిపాదించిన వడ్డీ రేటును యథాతథంగా కేంద్రం ఆమోదించింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఇదే వడ్డీని చెల్లించిన విషయం తెలిసిందే. కేంద్రం వడ్డీని నోటిఫై […]
Former Minister Perni Nani visited Vallabhaneni Vamsi: అది మహానాడు కాదని, దగా నాడు అని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. శనివారం ప్రభుత్వ ఆసుపత్రిలో వల్లభనేని వంశీని ఎమ్మెల్సీ అరుణ్ కుమార్‌తో కలిసి పరామర్శించారు, అనంతరం పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. వంశీ ఆరోగ్య పరిస్థితిపై కూటమి సర్కారుకు కనీసం మానవత్వం లేదని మండిపడ్డారు. విచారణ పేరుతో ఆసుపత్రి నుంచి పోలీస్ స్టేషన్‌కు తరలించారని ఆరోపించారు. ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్ కనీసం మానవత్వం […]
427 Rohingya Died in 2 Ships Sank off the Coast of Myanmar: మయన్మార్ తీరంలో రెండు ఓడలు మునిగిపోవడంతో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. 427 మంది రోహింగ్యాలు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ నెల 9, 10 తేదీల్లో ఘోర ప్రమాదాలు జరిగినట్లు ఐరాస అంచనా వేసింది. విషయం నిర్దారణ అయితే సముద్రంలో చోటుచేసుకున్న అత్యంత విషాదకర ఘటనగా మిగిలిపోతుందని ఆందోళన వ్యక్తం చేసింది. మే 9, 10 తేదీల్లో ప్రమాదాలు.. ఓడల […]
Man Arrested For Spying Pakistan: సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్), భారత వైమానిక దళం (ఐఏఎఫ్)కు సంబంధించిన రహస్య సమాచారాన్ని ఓ వ్యక్తి పాక్‌కు చేరవేశాడు. దీంతో ఉగ్రవాద నిరోధక దళం (ఏటీఎస్) పోలీసులు అతడిని అరెస్టు చేశారు. గుజరాత్‌లోని కచ్‌లో ఈ ఘటన జరిగింది. సహ్‌దేవ్ సింగ్ గోహిల్ ఆరోగ్య కార్యకర్తగా పనిచేస్తున్నాడు. 2023 జూన్, జూలై మధ్యలో వాట్సాప్ ద్వారా అదితి భరద్వాజ్ అనే మహిళతో అతడు పరిచయం పెంచుకున్నాడని గుజరాత్ ఏటీఎస్ […]
AP CM Chandrababu Naidu at NITI Aayog Meeting: నీతి ఆయోగ్ సమావేశంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వికసిత్ భారత్-2047, స్వర్ణాంధ్రపై నివేదిక ఇచ్చారు. జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడిని ఖండించారు. ఈ క్రమంలో ఆపరేషన్ సిందూర్‌ను ప్రశంసిస్తూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు సాధించిన ప్రగతిని ఆయన వివరించారు. దేశ, రాష్ట్ర అభివృద్ధికి దోహదపడే అంశాలను తన ప్రజంటేషన్లో సీఎం ప్రస్తావించారు. సీఎం చంద్రబాబు […]
MLC Kavitha Response on Letter Which is Sent to KCR: మా నాయకుడు కేసీఆరేనని, ఆయన నాయకత్వలోనే రాష్ట్రం బాగుపడుతుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. అమెరికా పర్యటన ముగించుకొని శుక్రవారం రాత్రి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా విమానాశ్రయం వద్ద జాగృతి కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. వరంగల్‌లో జరిగిన సభ తర్వాత రెండు వారాల క్రితం తన తండ్రి, […]
Chandrababu on Rajadhani: రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు పూర్తయినందున అమరావతిని రాజధానిగా పునర్విభజన చట్టంలో పెట్టి నోటిఫై చేయాలని కేంద్రాన్ని కోరినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా పలువురు కేంద్రమంత్రులతో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడారు. 2019-24 మధ్య ఆంధ్రప్రదేశ్‌లో భారీగా విధ్వంసం జరిగిందని ఆరోపించారు. వైసీపీ చేసిన విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని గాడిన పెట్టాలంటే పదేళ్లు పడుతుందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏపీని పునర్నిర్మిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చామని తెలిపారు. […]
Uttam Kumar Reddy fires on BRS: కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలు ఉన్నట్లు తేల్చడానికి దేశంలోనే పేరుగాంచిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో కమిషన్ వేశామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం సాయంత్రం తెలంగాణ సచివాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి సీతక్కతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఏ తప్పు చేయకుంటే నోటీసు ఇవ్వగానే అంత ఉలుకు ఎందుకని ప్రశ్నించారు. నోటీసు ఇవ్వగానే కమిషన్ తప్పుబడుతూ మాట్లాడటం సిగ్గుచేటన్నారు. ఇందిరా గాంధీ లాంటి […]
First Covid-19 Case in Telangana: యావత్ ప్రపంచాన్ని వైరస్‌తో వణికించిన కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. దేశంలో నాలుగు రోజులుగా అక్కడక్కడ కరోనా మాట వినిపిస్తున్నది. తాజాగా తెలంగాణలో కరోనా కేసు నమోదైంది. హైదరాబాద్ కూకట్‌పల్లిలో ఓ వైద్యుడికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, ఏపీలోని విశాఖపట్నంలో కొవిడ్ కేసు నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. చైనాలో పుట్టి ప్రపంచ వ్యాప్తంగా […]
Donald Trump warning to Apple: ఐఫోన్ల తయారీకి సంబంధించి అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘యాపిల్’ సంస్థను మరోసారి హెచ్చరించారు. యూఎస్‌లో విక్రయించే ఐఫోన్లను స్థానికంగా తయారు చేయాలని సూచించారు. భారత్ లేదా మరే ఇతర దేశంలో తయారు చేయొద్దని, అలా చేస్తే కనీసం 25 శాతం సుంకం ఎదుర్కోవాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. సామాజిక వేదిక ట్రూత్ సోషల్‌లో పోస్టు.. అగ్రరాజ్యంలో విక్రయించే ఐఫోన్లను యునైటెడ్ స్టేట్స్లోనే తయారు చేయాలన్నారు. భారత్ […]