Home /Author Narasimharao Chaluvadi
దేశ రాజధానిలో బతుకమ్మ పండుగకు ప్రత్యేకత ఏర్పడింది. ఇండియా గేట్ వద్ద అధికారికంగా బతుకమ్మ సంబరాలను చేపట్టారు. సంబరాలను వీక్షించేందుకు సాంస్కృతిక శాఖ ఎల్ ఇ డీ స్క్రీన్లు ఏర్పాటు చేసి ఆహ్లాద వాతావరణాన్ని మరింత దగ్గర చేసింది
మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ధాకరేకు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. నిజమైన శివసేనను నిర్ణయించే అధికారాన్ని ఎన్నికల కమిషన్ చర్యలపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది
దమ్ముంటే హైకోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా రాజధాని రైతుల మహా పాదయాత్రను అడ్డుకోవాలంటూ మంత్రి బొత్స సత్యన్నారాయణకు సీపిఐ కార్యదర్శి రామక్రిష్ణ సవాల్ విసిరారు.
పునర్విభజన చట్టంలో హామీలో భాగంగా బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం పై నీలిమబ్బులు కమ్ముకోవడంతో అధికార టీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నారు. పరిస్ధితుల అందుకు తగ్గట్టుగా లేవని, ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించడం సాధ్యం కాదన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటనతో ఆయన దిష్టి బొమ్మను దగ్ధం చేసి నిరసనలు గుప్పించారు.
నేటి సమాజంలో సెల్ ఫోనే అరచేతిలో ప్రపంచంగా మారింది. ఆ మాటలు వినేందుకు బాగున్నా, అడప దడపా చోటుచేసుకొనే షాకింగ్ ఘటనలతో సమాజంలో అలజడి ప్రారంభమౌతుంది. అలాంటి భయానక దృశ్యాల నడుమ ఇంటి పైకప్పులపై దెయ్యం నడిచినట్లుగా వైరల్ అయిన వీడియోపై వారణాసి పోలీసులు కేసు నమోదు చేసి వాస్తవం తేల్చే పనిలో పడ్డారు.
పాదయాత్ర కాదు, అది ఒళ్లు బలిసిన యాత్రగా రాజధాని రైతుల పాదయాత్రనుద్ధేశించి మంత్రి అంబటి రాంబాబు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ఫెమా నిబంధనలు ఉల్లంఘించారనే అభియోగాలపై తెరాసా ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డిని ఎన్ఫోర్స్మెంట్ అధికారులు రెండు గంటలుగా విచారిస్తున్నారు.
తిరుమలలో జరిగేది శ్రీవారి బ్రహ్మోత్సవాలా? సీఎం జగనోత్సవాలా? అంటూ తెలుగుదేశం నేతలు ఆరోపించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు తెదేపా నేతలను అరెస్ట్ చేసిన చంద్రగిరి పోలీసు స్టేషన్ కు తరలించారు
అమరావతి రైతుల పాదయాత్రను అడ్డుకొనేందుకు 5నిమిషాలు పట్టదు అంటున్న మంత్రి బొత్స సత్యన్నారాయణపై తెదేపా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేసారు.
పర్యావరణ ఉల్లాంఘనలకు రూ. 120కోట్ల రూపాయలను రుసుము కింద చెల్లించాలని ఎన్జీటి తీర్పు పై ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాలు చేసిన కేసు వాదనల సమయంలో న్యాయవాదులకు ఎంతమేర ప్రభుత్వం చెల్లించిందో అన్న అంశం పై నోటీసు ఇస్తామని పేర్కొన్న విషయం పై రాష్ట్ర వ్యాప్తంగా చర్చగా మారింది.