CPI Ramakrishna: మంత్రి బొత్సకు సీపిఐ నేత స్ట్రాంగ్ వార్నింగ్
దమ్ముంటే హైకోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా రాజధాని రైతుల మహా పాదయాత్రను అడ్డుకోవాలంటూ మంత్రి బొత్స సత్యన్నారాయణకు సీపిఐ కార్యదర్శి రామక్రిష్ణ సవాల్ విసిరారు.
Andhra Pradesh: దమ్ముంటే హైకోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా రాజధాని రైతుల మహా పాదయాత్రను అడ్డుకోవాలంటూ మంత్రి బొత్స సత్యన్నారాయణకు సీపిఐ కార్యదర్శి రామక్రిష్ణ సవాల్ విసిరారు. 5 నిమిషాలు పట్టదు పాదయాత్రను అడ్డుకొనేందుకు అన్న బొత్స మాటల పై ఆయనకు రామకృష్ణ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
కోర్టు ఉత్తర్వుల మేరకు, పాదయాత్రకు బందోబస్తు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని గుర్తు చేసారు. హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగానే పాదయాత్ర సాగుతుందని వైకాపా శ్రేణులు గర్తు పెట్టుకోవాలని ఎద్దేవా చేశారు. గతంలో జగన్ పాదయాత్ర చేస్తే, ఇలానే అడ్డుకొన్నారా అని ప్రశ్నించారు. వైకాపా నేతలు మితిమీరి మాట్లాడుతున్నారని రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. అడ్డా కూలీలతో మూడు రాజధానులకు అనుకూలంగా ధర్నాలు చేయించారని ఆరోపించారు.
ఇది కూడా చదవండి: ఉక్కు ఫ్యాక్టరీ ఘటన పై కేంద్రమంత్రి దిష్టిబొమ్మ దగ్ధం