Home /Author Guruvendhar Reddy
Lawrence Bishnoi Brother: గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్ అమెరికాలో అరెస్ట్ అయినట్లు సమాచారం. బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ ఇంటి బయట కాల్పులు జరిపిన ఘటన సహా పలు కేసుల్లో అన్మోల్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఇతని సూచనల మేరకే ఇటీవల ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీని హత్య చేసినట్లు నిందితులు వెల్లడించిన విషయం తెలిసిందే. అన్మోల్కు సంబంధించిన సమాచారమిస్తే రూ.10 లక్షలిస్తామని పోలీసులు ఇప్పటికే ప్రకటించారు. లెక్కలేనన్ని కేసులు! కొన్ని నెలల క్రితం […]
Srivani Trust Cancellation: టీటీడీ పాలక మండలి సోమవారం పలు సంచలన నిర్ణయాలు తీసుకుంది. టీటీడీ ఛైర్మన్ బి.ఆర్.నాయుడు అధ్యక్షతన సోమవారం జరిగిన టీటీడీ పాలక మండలి సమావేశంలో భక్తులకు వేగంగా దర్శనం కల్పించటం మొదలు టీటీడీ ఉద్యోగుల వరకు పలు కీలక నిర్ణయాలను ప్రకటించింది. శ్రీవాణి ట్రస్ట్ రద్దు గత ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన శ్రీవాణి ట్రస్ట్‌ను రద్దుచేస్తున్నట్లుగా టీటీడీ పాలకమండలి సమావేశం అనంతరం టీటీడీ ఛైర్మన్ బి. ఆర్. నాయుడు ప్రకటించారు. అదే సమయంలో […]
Virat Kohli that can be broken by Babar Azam: క్రికెట్లో కింగ్ కోహ్లీ రికార్డుల గురించి చెప్పాల్సిన పనే లేదు. అయితే, కోహ్లీ రికార్డులలో ఒకదానిని తాజాగా పాక్ క్రికెటర్ బాబర్ బ్రేక్ చేశాడు. హోబర్ట్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ20లో బాబర్ 28 బంతుల్లో 4 ఫోర్లతో 41 రన్స్ చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కోహ్లీ అంతర్జాతీయ టీ20ల్లో 4188 పరుగులు చేయగా.. బాబర్ ప్రస్తుతం 4192 పరుగులతో దానిని […]
Lagacharla incident: లగచర్ల వివాదం రోజురోజుకూ ముదురుతోంది. ఈ ఘటనలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అరాచకాలపై బీఆర్ఎస్ జాతీయ మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించింది. మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ నాయకత్వంలోని పార్టీ బృందం అక్కడి రైతులను కలిసి, ప్రభుత్వం అన్యాయంగా గిరిజన రైతుల భూమిని లాక్కునే ప్రయత్నం చేసిందని ఫిర్యాదు చేసింది. మరోవైపు లగచర్ల బయలు దేరిన బీజేపీ అగ్రనేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. అటు ప్రభుత్వం రంగంలోకి దిగి పరిగి డీఎస్పీపై వేటు […]
Dalits have no share in development: స్వాతంత్య్రం వచ్చిన తర్వాత భారతదేశంలోని కుల, మత, వర్గ భేదాలకు అతీతంగా పౌరులందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ సమానత్వం కల్పించాలనే లక్ష్యంతోనే మన స్వరాజ్య పోరాట యోధులు ఒక గొప్ప రాజ్యాంగ రచనకు పూనుకున్నారు. ముఖ్యంగా పుట్టుకతోనే అంటరానివారిగా గుర్తించబడి, బతికినంతకాలం మనుషులుగానూ గుర్తింపుకు నోచుకోని దళితులను ప్రధాన స్రవంతిలోకి తీసుకురావాలనే సంకల్పంతోనే రాజ్యాంగంలో రిజర్వేషన్లతో సహా కొన్ని నిర్దిష్టమైన ఏర్పాట్లు చేశారు. అయితే, 1950 జనవరి 26న […]
Hydra Action Again In Hyderabad City: ఆక్రమణలు చేసిన అక్రమార్కుల పాలిట ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా కొంత విరామం తర్వాత మళ్లీ రంగంలోకి దిగింది. నగర శివారు ప్రాంతమైన అమీన్ పూర్లో ఓ అక్రమ నిర్మాణాన్ని హైడ్రా అధికారులు నేలమట్టం చేశారు. గతంలో నోటీస్ ఇచ్చినప్పటికీ ఇళ్లను తొలగించకపోవడంతో హైడ్రా రంగంలోకి దిగాల్సి వచ్చిందని ఒక అధికారి తెలిపారు. మళ్లీ కూల్చివేతలు షురూ సోమవారం ఉదయమే అమీన్ పూర్ పరిధిలోని వందనాపురి కాలనీకి చేరుకున్న అధికారులు […]
Election Campaign Ended In Jharkhand And Maharashtra: మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారపర్వం ముగిసింది. సోమవారం సాయంత్రానికి రెండు రాష్ట్రాల్లో క్యాంపెయినింగ్ పూర్తయింది. 48 గంటల సైలెంట్ పీరియడ్ తర్వాత 20వ తేదీన ఇక్కడ పోలింగ్ జరగనుంది. మహారాష్ట్రలోని మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు ఒకే దశలో రేపు (నవంబరు 20) పోలింగ్ జరగనుంది. ఇక, జార్ఖండ్‌లో తొలివిడతలో 43 సీట్లకు నవంబరు 13న పోలింగ్ జరగగా, రెండవ విడతలో భాగంగా 38 స్థానాలకు […]
TTD Board Makes Path-Breaking Decisions: తిరుపతి ప్రజలకు శ్రీవారి దర్శనం విషయంలో టీటీడీ తీసుకున్న నిర్ణయంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ప్రతి నెలా మొదటి మంగళవారం స్థానికులకు దర్శనం కల్పించాలని సోమవారం నిర్వహించిన తితిదే ధర్మకర్తల మండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై పవన్ కల్యాణ్ స్పందించారు. తితిదే నిర్ణయం తిరుపతి ప్రజలకు సంతోషాన్ని కలిగించిందన్నారు. నాటి హామీ అది.. జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ […]
AP Assembly Budget Session: గత ఎన్నికల్లో జగన్ ఒక్క అవకాశమని వచ్చి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని సీఎం చంద్రబాబు అన్నారు. అసెంబ్లీలో బడ్జెట్‌పై ఆయన ప్రసంగించారు. గత ఐదేళ్లల్లో తాము ఊహించిన దాని కంటే ఎక్కువ విధ్వంసం జరిగిందన్నారు. వైసీపీ ప్రభుత్వం కనీసం జీఓలు కూడా ఆన్లైన్లో అందుబాటులో ఉంచలేదన్నారు. గత ప్రభుత్వ హయాంలో కాగ్‌కు కూడా నివేదికల అందించలేదని వెల్లడించారు. రాష్ట్ర విభజన కంటే ఎక్కువ నష్టం జరిగిందని చంద్రబాబు విమర్శలు చేశారు. జగన్ […]
Vijay Deverakonda Sahiba: టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ సినిమాలకు భిన్నంగా మ్యూజిక్ ఆల్బమ్‌లో నటిస్తున్నారు. ఈ ఆల్బమ్ ‘సాహిబా’ అనే టైటిల్‌తో ముందుకు తీసుకొస్తున్నారు. ఇందులో మేల్ లీడ్‌గా విజయ్ దేవరకొండ నటిస్తుండగా.. ఫీమేల్ లీడ్‌లో హీరోయిన్ రాధిక మదన్ నటిస్తోంది. ఈ మ్యూజిక్ ఆల్బమ్‌కు సుధాన్షు సరియా దర్శకత్వం వహించగా.. పాటలకు బాలీవుడ్ సింగర్ జస్లీన్ రాయల్ కంపోజ్ చేశారు. తాజాగా, ఈ మ్యూజిక్ ఆల్బమ్‌కు సంబంధించిన ప్రోమోపై అప్డేట్ ప్రకటించారు.. ఈ […]