Home /Author Guruvendhar Reddy
Earthquake of magnitude 7.1 strikes Nepal: నేపాల్ దేశంలో భారీ భూకంపం సంభవించింది. నేపాల్, టిబెట్ సరిహద్దు ప్రాంతాల్లో మంగళవారం ఉదయం భూమి కంపించింది. అయితే రిక్టర్ స్కేల్ పై తీవ్రత 7.1గా నమోదైంది. నేపాల్, టిబెట్ సరిహద్దులో ఉన్న లబుచే అనే ప్రాంతానికి సుమారు 93 కి.మీల దూరంలో భూకంప కేంద్రంను అధికారులు గుర్తించారు. ఈ భూకంప తీవ్రతకు భారత్ లో పలు రాష్ట్రాల్లో సైతం భూమి కంపించినట్లు తెలుస్తోంది. ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, […]
Justin Trudeau announces resignation as Canada’s prime minister: కెనడా ప్రధాన మంత్రి ట్రూడో సోమవారం తన పదవికి రాజీనామా చేశారు. లిబరల్ పార్టీ నాయకుడిగా తప్పుకోవాలంటూ ట్రూడో మీద సొంత నేతలే నిరసనకు దిగటంతో ఆయన కుర్చీ దిగక తప్పలేదు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మార్చి 24 వరకు పార్లమెంటును సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అసోసియేటెడ్ ప్రెస్ నివేదిక ప్రకారం, కొత్త నాయకుడిని పార్టీ తరపున ఎన్నుకునే వరకు ఆయన తాత్కాలిక […]
ISRO Postponds SpaDex Docking to January 9: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ చేపట్టిన స్పేడెక్స్ మిషన్‌లో వ్యోమనౌకల అనుసంధాన ప్రక్రియ వాయిదా పడింది. ముందస్తు ప్రణాళిక ప్రకారం నేడు జరగాల్సిన డాకింగ్ ప్రక్రియను జనవరి 9కి మార్చుతున్నట్లు సోమవారం ఇస్రో ప్రకటించింది. మిషన్‌లో సమస్యను గుర్తించటం వల్ల, డాకింగ్ ప్రక్రియపై మరికొంత పరిశోధన అవసరమని, ఈ నేపథ్యంలోనే షెడ్యూల్ తేదీని మారుస్తున్నట్లు తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్‌లో ఇస్రో ప్రకటించింది. సమస్య కారణంగా […]
South Central Railway to operate Special Trains For Sankranthi: సంక్రాంతికి సొంత గ్రామాలకు వెళ్లే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అదిరిపోయే శుభవార్త చెప్పింది. సంక్రాంతి పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఉన్నా తమ సొంతింటికి వెళ్తుంటారు. ఈ మేరకు ప్రతీ ఏడాది సంక్రాంతి పండుగకు రైల్వే స్టేషన్ వద్ద ప్రయాణికులతో కిక్కిరిసిపోతుంది. ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు హైదరాబాద్‌లోని […]
BCCI announces India’s ODI squad for three-match series: భారత మహిళల జట్టు మరో సిరీస్ ఆడేందుకు సిద్దమైంది. ఐర్లాండ్ మహిళల జట్టుతో భారత మహిళల జట్టు మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఇందులో భాగంగా 15 మంది సభ్యులతోె కూడిన జట్టును బీసీసీఐ ప్రకటించింది. తొలి వన్డే మ్యాచ్ జనవరి 10వ తేదీన ఉదయం 11 గంటలకు రాజ్‌కోట్‌లోని నిరంజన్ షా వేదికగా జరుగుతుండగా.. ఇదే వేదికపై మూడు మ్యాచ్‌లు జరగనున్నాయి. అలాగే జనవరి […]
PM Modi to Virtually Unveil Telangana’s New Cherlapally Railway Station: చర్లపల్లి రైల్వే టర్మినల్‌ను పీఎం నరేంద్ర మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. అమృత్ భారత్ పథకంలో భాగంగా రూ.413 కోట్ల వ్యయంతో ఎయిర్ పోర్టు తరహాలో ఆధునిక మౌలిక సదుపాయాలతో ఈ టర్నినల్ నిర్మించారు. 9 ప్లాట్ ఫామ్‌లు, 6 లిప్ట్‌లు, 7 ఎస్కలేటర్లు, 2 ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, బుకింగ్ కౌంటర్లు, వెయిటింగ్ హాల్స్ ఉన్నాయి. మొత్తం 50 రైళ్లు నిడిచేలా 19 […]
Health Ministry confirms HMPV Two cases in bangalore: దేశంలో హెచ్ఎంపీవీ వైరస్ విజృంభణ మొదలైంది. తాజాగా, మరో హెచ్ఎంపీవీ వైరస్ కేసు నమోదైంది. ఇప్పటికే కర్ణాటకలోని బెంగళూరులో ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో 8 నెలల చిన్నారికి పాజిటివ్ వచ్చిందని వైద్యులు ప్రకటించారు. ప్రస్తుతం మరో కేసు నిర్దారణ కావడంతో ఆ సంఖ్య రెండుకు చేరింది. దీంతో దేశంలో రెండు హెచ్ఎంపీవీ పాజిటివ్ వైరస్ కేసులు నమోదయ్యాయి. ఈ రెండు కేసులు బెంగళూరులోనే నమోదు […]
KTR objected to not giving entry to lawyers at ACB office in Formula-E race case: హైదరాబాద్‌లోని ఏసీబీ కార్యాలయం వద్ద హైడ్రామా నెలకొంది. ఫార్ములా ఈ కారు రేసు కేసులో విచారణ మేరకు ఏ1గా ఉన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఏసీబీ ఆఫీస్ వద్దకు న్యాయవాదులతో కలిసి వచ్చారు. కేటీఆర్ వెంట లాయర్లకు అనుమతి లేదని ఏసీబీ అధికారులు వెల్లడించారు. అయితే తన న్యాయవాదిని ఏసీబీ కార్యాలయంలోకి […]
HMPV Virus first case 8-month old baby tests positive in india: చైనాలో కలకలం రేపుతున్న హెచ్ఎంపీవీ వైరస్ భారత్‌లోకి వచ్చేసింది. భారత్‌లో తొలి హెచ్ఎంపీవీ వైరస్ కేసు నమోదైంది. బెంగళూరులో ఓ ఎనిమిది నెలల పాపకు హెచ్ఎంపీవీ వైరస్ సోకిన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రక్తపరీక్ష ద్వారా వైరస్ సోకినట్లు నిర్ధారించారు. బెంగళూరులోని బాప్టిస్ట్ హాస్పిటల్లో ఈ కేసు వెలుగులోకి వచ్చిందని సమాచారం. అయితే, రాష్ట్రంలోని ల్యాబ్‌లో పరీక్ష నిర్వహించలేదని కర్ణాటక ఆరోగ్య మంత్రిత్వ […]
Syria government salaries 400 per cent hike for employees: సిరియా ప్రభుత్వం కీలక ప్రకటన విడుదల చేసింది. ఆ దేశంలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల జీతాలను పెంచుతున్నట్లు నిర్ణయం తీసుకుంది. కొత్త ప్రభుత్వంలో ఉద్యోగులకు భారీగా జీతాలు పెంచుతామని ఆ దేశ ఆర్థిక మంత్రి మహమ్మవద్ అబ్జాద్ ప్రకటించాడు. ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించడంలో భాగంగా వేతనాల పెంపును అమలు చేయనున్నట్లు ప్రకటించారు. అలాగే విదేశాల్లోని 400 మిలియన్ డాలర్ల విలువైన సిరియన్ ఆస్తులను సైతం […]