Home /Author Chaitanya Gangineni
‘కోడెక్స్ సాసూన్’ అనే హీబ్రూ బైబిల్ వరల్డ్ లోనే అతి పురాతమైన బైబిల్ లో ఒకటి. దీనిని క్రీస్తుశకం 880 నుంచి 960 మధ్య కాలంలో రాసి ఉంటారని చరిత్ర కారులు అంచనా వేస్తున్నారు.
టెక్ దిగ్గజ కంపెనీ మైక్రోసాఫ్ట్ తమ డేటాను అక్రమంగా ఉపయోగించుకుంటోందని ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫాం ట్విటర్ తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ మేరకు మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్లకు ట్విటర్ లేఖ రాసింది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. చలామణిలో ఉన్న రూ. 2 వేల నోట్లను ఉపసంహరిస్తున్నట్టు ప్రకటించింది.
3 రోజుల పాటు తెలంగాణలో తేలిక పాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కరిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలోని తూర్పు, దక్షిణ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు పడతాయని ఈ సందర్భంగా హెచ్చరికలు జారీ చేసింది.
ప్రముఖ ఎలక్ట్రానిక్ తయారీ దిగ్గజం శామ్ సంగ్ భారత్లో ‘క్రిస్టల్ 4కే ఐస్మార్ట్ యూహెచ్డీ టీవీ 2023’ను లాంచ్ చేసింది. 43 ఇంచులతో మొదలై పలు సైజుల్లో ఈ టీవీ అందుబాటులో ఉంది. ఈ టీవీలో పరిసరాల్లోని వెలుతురుకు తగ్గట్టుగా ఆటోమేటిక్గా బ్రైట్ నెస్ ను సర్దుబాటు చేసే ఐఓటీ పనిచేసే సెన్సర్లు ఇచ్చారు.
ఫ్రాన్స్ లో 76 వ కేన్స్ ఫెస్టివల్ అట్టహాసంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సినీ తారలు, సెలబ్రెటీలు సరికొత్త డిజైనర్ దుస్తుల్లో రెడ్ కార్పెట్ పై హోయలు పోతున్నారు.
ఈ నెల 28 నుంచి జరగనున్న ఫ్రెంచ్ ఓపెన్ నుంచి వైదొలుగుతున్నట్టు టెన్నిస్ దిగ్గజ ఆటగాడు రఫెల్ నాదల్ ప్రకటించాడు.
ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించే ఉమ్మడి విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్ష యూజీ అడ్మిట్ కార్డులు విడుదల అయ్యాయి.
సికింద్రాబాద్ నుంచి రాకపోకలు సాగించే రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అలెర్ట్ ప్రకటించింది. ఈ నెల 20,21 వ తేదీల్లో 17 రైళ్లు రద్దు కాగా, మరికొన్ని ప్రధాన రైళ్లు ఆలస్యంగా నడవనున్నట్టు తెలిపింది.
జున్ మోనీ రాభా మోరికొలాంగ్ పోలీస్ ఔట్ పోస్టు ఇంఛార్జిగా బాధ్యతలు నిర్వహించే వారు. ఈ క్రమంలో సోమవారం అర్థరాత్రి తన ప్రైవేటు కారులో ఆమె ప్రయాణిస్తుండగా.. అర్థరాత్రి 2.30 గంటల ప్రాంతంలో యూపీ నుంచి వస్తున్న ఓ కంటైనర్ వాహనాన్ని కారు ఢీకొట్టింది.