Last Updated:

Samsung TV: భారత్ లో ‘క్రిస్టల్‌ 4కే ఐస్మార్ట్‌ యూహెచ్‌డీ టీవీ 2023’ విడుదల

ప్రముఖ ఎలక్ట్రానిక్ తయారీ దిగ్గజం శామ్ సంగ్ భారత్‌లో ‘క్రిస్టల్‌ 4కే ఐస్మార్ట్‌ యూహెచ్‌డీ టీవీ 2023’ను లాంచ్ చేసింది. 43 ఇంచులతో మొదలై పలు సైజుల్లో ఈ టీవీ అందుబాటులో ఉంది. ఈ టీవీలో పరిసరాల్లోని వెలుతురుకు తగ్గట్టుగా ఆటోమేటిక్‌గా బ్రైట్ నెస్ ను సర్దుబాటు చేసే ఐఓటీ పనిచేసే సెన్సర్లు ఇచ్చారు.

Samsung TV: భారత్ లో ‘క్రిస్టల్‌ 4కే ఐస్మార్ట్‌ యూహెచ్‌డీ టీవీ 2023’ విడుదల

Samsung TV: ప్రముఖ ఎలక్ట్రానిక్ తయారీ దిగ్గజం శామ్ సంగ్ భారత్‌లో ‘క్రిస్టల్‌ 4కే ఐస్మార్ట్‌ యూహెచ్‌డీ టీవీ 2023’ను లాంచ్ చేసింది. 43 ఇంచులతో మొదలై పలు సైజుల్లో ఈ టీవీ అందుబాటులో ఉంది. ఈ టీవీలో పరిసరాల్లోని వెలుతురుకు తగ్గట్టుగా ఆటోమేటిక్‌గా బ్రైట్ నెస్ ను సర్దుబాటు చేసే ఐఓటీ పనిచేసే సెన్సర్లు ఇచ్చారు. క్రిస్టల్‌ టెక్నాలజీ, టైజెన్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో ఈ టీవీ వస్తోంది. ఓటీఎస్‌ లైట్‌, అడాప్టివ్‌ సౌండ్‌ టెక్నాలజీ, క్యూ సింఫనీ లాంటి ఇతర ఫీచర్లు కూడా ఉన్నాయి.

Samsung Crystal 4K iSmart UHD TV 2023 launched in India: Check features,  price

ఈ టీవీ ధరలు ఎలా ఉన్నాయంటే..

Samsung Crystal 4K iSmart UHD TV 43 ఇంచుల స్క్రీన్‌ ధర భారత్‌ లో రూ. 33,990 గా కంపెనీ నిర్ణయించింది. 65 అంగుళాల స్క్రీన్‌తో వస్తున్న టీవీ ధర రూ. 71,990 గా ఉంది. ఇందులో 12 నెలల EMI ఆప్షన్ ను కూడా శామ్‌సంగ్‌ కల్పిస్తోంది. ఈ టీవీని అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, శామ్‌సంగ్‌ ఆన్‌లైన్‌ స్టోర్‌లో ఈ టీవీ అందుబాటులో ఉంచారు.

 

ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

Samsung Crystal 4K iSmart UHD TV ఫీచర్లు విషయానికి వస్తే.. ఇందులో ఉన్న క్రిస్టల్‌ టెక్నాలజీ తక్కువ రెజల్యూషన్‌ కంటెంట్‌ను కూడా బాగా చూపిస్తుంది. అదే విధంగా రంగులను కూడా కంటికి తగ్గట్టుగా మార్చగలదని కంపెనీ తెలిపింది. పిక్చర్‌ పెర్ఫార్మెన్స్‌ను ఆప్టిమమ్‌గా మార్చే ‘పర్‌కలర్‌ సపోర్ట్‌’ కూడా ఇందులో ఉన్నట్లు వెల్లడించింది. ఈ టీవీలో మరో స్పెషల్ ఫీచర్.. వీడియో కాలింగ్. స్లిమ్‌ఫిట్‌ కెమెరాతో వీడియో కాలింగ్‌ ఫీచర్‌ ను అందిస్తున్నట్టు శామ్ సంగ్ తెలిపింది. ఇదే టీవీలో ఐఓటీ హబ్‌ను బిల్ట్‌ ఇన్‌గా అందిస్తోంది. కామ్‌ ఆన్‌బోర్డింగ్‌ ఫీచర్‌ను కూడా దీనికి జత చేసింది. ఈ ఫీచర్‌ తో చుట్టూ ఉన్న శాంసంగ్‌ డివైజ్‌లతో పాటు థర్డ్‌ పార్టీ పరికరాలను కూడా కంట్రోల్‌ చేసేందుకు వీలు ఉంది.

Samsung Crystal 4K iSmart UHD TV launched in India: Price, Specifications,  Features & Availability

స్మార్ట్‌ హబ్‌ ఫీచర్‌.. అంటే ఎంటర్‌టైన్‌మెంట్‌, గేమింగ్‌ సహా ఇతర ఆప్షన్లను ఒకే దగ్గరకు తీసుకు రావచ్చు. ఈ ఫీచర్ కూడా Crystal 4K iSmart UHD TV లో ఇచ్చారు. టైజెన్‌ ఆపరేటింగ్ సిస్టమ్ తో వస్తున్న ఈ టీవీ లో కంపెనీ అందిస్తోన్న యాడ్‌ సపోర్ట్‌ టీవీ, 100 ఛానెళ్లకు పైగా అందించే వీడియో ఆన్‌ డిమాండ్‌ సర్వీస్‌తో కూడిన శామ్‌సంగ్‌ టీవీ ప్లస్‌కు కూడా యాక్సెస్‌ను ఇవ్వనుంది. గేమింగ్‌ అనుభవాన్ని పెంచేలా ఆటో గేమ్‌ మోడ్‌, మోషన్‌ యాక్సిలరేటర్‌ ఫీచర్లు కూడా ఈ టీవీలో ఉన్నాయి.