Rafael Nadal: తొలిసారి ఫ్రెంచ్ ఓపెన్ కు నాదల్ దూరం.. రిటైర్మెంట్ పై ప్రకటన
ఈ నెల 28 నుంచి జరగనున్న ఫ్రెంచ్ ఓపెన్ నుంచి వైదొలుగుతున్నట్టు టెన్నిస్ దిగ్గజ ఆటగాడు రఫెల్ నాదల్ ప్రకటించాడు.

Rafael Nadal: ఈ నెల 28 నుంచి జరగనున్న ఫ్రెంచ్ ఓపెన్ నుంచి వైదొలుగుతున్నట్టు టెన్నిస్ దిగ్గజ ఆటగాడు రఫెల్ నాదల్ ప్రకటించాడు. గాయం కారణంగా బరిలోకి దిగడం లేదని తెలిపాడు. అయితే తన కెరీర్ లో 2024 చివరి సీజన్ కావొచ్చని తన అభిమానులకు చేదు వార్త చెప్పాడు నాదల్. ఫ్రెంచ్ ఓపెన్ లో 14 సార్లు టైటిల్ గెలిచిన నాదల్.. తొలిసారి ఈ టోర్నీకి దూరం అవుతున్నాడు. గురువారం జరిగిన ప్రెస్ మీట్ లో నాదల్ మాట్లాడుతూ..‘ ముందు ముందు ఏం జరుగనుందో ఎవరూ చెప్పలేరు. వచ్చే ఏడాది నా కెరీర్ లో చివరి ఏడాది అనుకుంటున్నా’ అని తెలిపాడు.
ఏదో ఒకరోజు ఆట ఆపాలి(Rafael Nadal)
కాగా, ఈ ఏడాది ఆస్ట్రేలియా ఓపెన్ లో రెండో రౌండ్లో ఓడిపోయిన తర్వాత నాదల్ మళ్లీ టెన్నిస్ కోర్టులోకి దిగలేదు. కోర్టులోకి రావడానికి మరింత సమయం పడుతుందన్నాడు. ఇప్పడు ప్రాక్టీస్ చేయనని.. చేసేందుకు కూడా సిద్ధంగా లేనని నాదల్ చెప్పాడు. కానీ ఇన్ని రోజులు ఆటకు దూరంగా ఉండటం అసహనానికి కలిగిస్తోందన.. ఏదో ఒకరోజు ఆట ఆపేయాలన్నాడు. గత ఏడాది అత్యంత పెద్ద వయసులో(36 ఏళ్లు) ఫ్రెంచ్ ఓపెన్ గెలిచి రికార్డు సాధించాడు.
క్లే కోర్టు రారాజుగా పేరున్న నాదల్ తన కెరీర్ లో ఇప్పటి వరకు 22 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ నెగ్గితే.. అందులో 14 ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్స్ ఉన్నాయి. అంతేకాకుండా ఫ్రెంచ్ ఓపెన్ లో 115 మ్యాచ్ లు ఆడిన నాదల్ 112 మ్యాచ్ లు గెలిచి కేవలం 3 మాత్రమే అపజయం పాలయ్యాడు. అత్యధిక గ్రాండ్ స్లామ్ టైటిల్స్ విషయంలో జొకోవిచ్ తో కలిసి సంయుక్తంగా టాప్ ప్లేసులో ఉన్నాడు.
Rafa,
We can’t imagine how hard this decision was. We’ll definitely miss you at this year’s Roland-Garros. Take care of yourself to come back stronger on courts.
Hoping to see you next year in Paris
pic.twitter.com/lTN3GExBFo
— Roland-Garros (@rolandgarros) May 18, 2023
కిర్గియోస్ ఔట్
మరో వైపు ఫ్రెంచ్ ఓపెన్ నుంచి ఆస్ట్రేలియా టెన్నిస్ స్టార్ నిక్ కిర్గియోస్ కూడా దూరమయ్యాడు. కాలి గాయం నుంచి పూర్తిగా కోలుకోక పోవడం వల్ల అతడు గ్రాండ్‌స్లామ్ టోర్నీ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నాడు. మోకాలి గాయం కారణంగా గత ఏడాది అక్టోబరు నుంచి ఆటకు దూరంగా ఉన్న కిర్గియోస్.. ఫ్రెంచ్ ఓపెన్ లో పాల్గొంటాడనుకున్నాడు.
ఇవి కూడా చదవండి:
- CUET UG 2023: సీయూఈటీ యూజీ అడ్మిట్ కార్డులు విడుదల
- Mp Avinash Reddy : సీబీఐ విచారణను కాదని పులివెందులకు వెళ్తున్న ఎంపీ అవినాష్.. కారణం ఏంటంటే?