Last Updated:

Rains In Telangana: తెలంగాణకు చల్లని కబురు.. 3 రోజులు వర్షాలు

3 రోజుల పాటు తెలంగాణలో తేలిక పాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కరిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలోని తూర్పు, దక్షిణ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు పడతాయని ఈ సందర్భంగా హెచ్చరికలు జారీ చేసింది.

Rains In Telangana: తెలంగాణకు చల్లని కబురు.. 3 రోజులు వర్షాలు

Rains In Telangana: 3 రోజుల పాటు తెలంగాణలో తేలిక పాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కరిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలోని తూర్పు, దక్షిణ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు పడతాయని ఈ సందర్భంగా హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్‌ తో పాటు చుట్టు పక్కల జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 39 డిగ్రీల నుంచి 41 డిగ్రీల వరకు నమోదు అవుతున్నట్టు వాతావరణ కేంద్రం పేర్కొంది. తూర్పు మధ్యప్రదేశ్ నుంచి విదర్భ మీదుగా సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ద్రోణి ప్రభావం కొనసాగుతోందని తెలిపింది. తెలంగాణ రాష్ట్రం వైపుకు వాయవ్య దిశ నుంచి దిగువ స్థాయి గాలులు వీస్తున్నట్టు పేర్కొంది. నైరుతి రుతుపవనాలు ఆగ్నేయ బంగాళాఖాతం, నికోబార్ దీవులు, దక్షిణ అండమాన్ సముద్ర ప్రాంతంలోని కొన్ని భాగాల వరకు ప్రవేశించినట్లు ఈ సందర్భంగా వెల్లడించింది.

 

కొనసాగుతోన్న వేడిగాలులు(Rains In Telangana)

మరో వైపు ఆంధ్రప్రదేశ్ లో వడగాలులు ప్రభావం కొనసాగుతోంది. అయితే గత వారంరోజులతో పోలిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గాయని వాతావరణ కేంద్రం తెలిపింది. అయితే వడగాల్పుల ప్రభావం తగ్గినా.. పూర్తిగా పొడి వాతావరణమే కొనసాగుతుందని పేర్కొంది. కోస్తోంధ్ర, రాయలసీమ జిల్లాలో 40 డిగ్రీలకు పైన ఉష్ణోగ్రతలు రికార్డు అవుతున్నాయంది. మరో రెండు మూడు రోజులు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని స్పష్టం చేసింది.

ఏ జిల్లాలో ఎంతంటే..

నెల్లూరులో అత్యధికంగా 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది. శ్రీకాకుళంలో 42.8 డిగ్రీలు, బాపట్లలో 42.7, అనంతపురంలో 42.5, తిరుపతిలో 42.4, కర్నూలు, అన్నమయ్య జిల్లా, ఆళ్లగడ్డ, మహానంది, కడప జిల్లాలో 42.5, ప్రకాశం జిల్లాలో 42.4, పల్నాడు జిల్లాలో 41.8, చిత్తూరు జిల్లాలో 41.7, ఎన్టీఆర్‌ జిల్లాలో 41.4, సత్యసాయి జిల్లాలో 41, నరసరావుపేటలో 41.2, గుంతకల్‌లో 41, సూళ్లూరుపేటలో 41.2, జమ్మలమడుగులో 41.09 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయినట్టు వాతావరణ శాఖ తెలిపింది.