Home /Author Chaitanya Gangineni
ఇండియన్ ప్రీమియర్ లీగ్ కు చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు అంబటి రాయుడు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆదివారం గుజరాత్ అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగే ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ తన కెరీర్లో చివరిదని అంబటి వెల్లడించాడు.
రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ(డీఆర్డీవో) లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. 181 సైంటిస్ట్ (b) ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తోంది డీఆర్డీవో. సైన్సులో ఇంజినీరింగ్, పోస్టు గ్రాడ్యుయేషన్ చేసిన అభ్యర్థులను ఈ పోస్టులకు అర్హులుగా డీఆర్డీవో పేర్కొంది.
దేశంలో యూపీఐ లావాదేవీలు రోజు రోజుకూ పుంజుకుంటున్నాయి. 2026- 27 నాటికి ఒక రోజు లావాదేవీలు 100 కోట్లకు చేరుతాయని పీడబ్ల్యూసీ ఇండియా నివేదిక అంచనా వేసింది. రిటైల్ డిజిటల్ చెల్లింపుల్లో ఇది 90 శాతానికి సమానమని తెలిపింది
దేశీయ ఈ కామర్స్ రంగంలో ప్రముఖ కంపెనీ రిలయన్స్ దూసుకుపోతోంది. సుమారు రూ. 12.30 లక్షల కోట్ల దేశీయ ఈ కామర్స్ రంగంలో దిగ్గజ సంస్థలు అమెజాన్, వాల్ మార్ట్ కంటే రిలయన్స్ ముందుందని పేర్కొంది.
రాష్ట్రంలో రాబోయే మూడు రోజులు తేలిక పాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడా వర్షాలు పడతాయని తెలిపింది.
నటి కీర్తి సురేశ్.. ఓ బిజినెస్ మ్యాన్ ను పెళ్లి చేసుకుంటుందనే వార్తలు ఈ మధ్య హల్ చల్ చేశాయి. ఓ వ్యక్తి తో కీర్తి సురేష్ దిగిన ఫొటో ఒకటి బయటకు రావడంతో.. కీర్తి పెళ్లి చేసుకోబోతుందంటూ ప్రచారం జరగుతోంది.
భారత దేశ నూతన పార్లమెంట్ భవనాన్ని దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం అంగరంగా వైభవంగా ప్రారంభించారు. ప్రత్యేకంగా జరిపిన హోమాలు, భక్తి శ్రద్ధలతో చేసిన పూజల మధ్య ఈ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి లోక్ సభ సభాపతి ఓం బిర్లా, రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్, పలువురు ముఖ్యమంత్రుల, ఎంపీలు, గవర్నర్లు, తమిళనాదు ఆధీనమ్ ల మఠాధిపతులు పాల్గొన్నారు. ధర్మబద్ధ, న్యాయ పాలనకు చిహ్నమైన రాజదండం(సెంగోల్ ) ను ప్రధాని మోదీ ఈ నూతన పార్లమెంట్ లోని లోక్ సభ స్పీకర్ కుర్చీకి సమీపంలో ప్రతిష్టించారు.
నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. అ వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్ సభ స్వీకర్ ఓంబిర్లాతో పాటు రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్, ఎంపీలు, పలువురు ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు స్టార్స్ శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్లు చేశారు.
భారత మార్కెట్లో వ్యక్తిగత కంప్యూటర్ల రవాణా బాగా పడిపోయింది. ఈ ఏడాది జనవరి నుంచి మార్చి త్రైమాసికంలో పీసీల రవాణా 29.92 లక్షల యూనిట్లకే పరిమితమైంది. ఇది గత ఏడాది తో పోలిస్తే 30 శాతం తక్కువగా నమోదు అయింది.
నూతన పార్లమెంట్ భవనాన్ని మే 28 ప్రధాని నరేంద్ర మోదీ అట్టహాసంగా ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా నూతన పార్లమెంట్ ప్రారంభోత్సవాన్ని విపక్ష పార్టీలు బహిహ్కరించిన విషయం తెలిసిందే.రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కాకుండా ప్రధాని నరేంద్ర మోదీ ఈ భవనాన్ని ప్రారంభించడంపై విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి.