Home /Author anantharao b
నేడు ప్రధాని మోదీ పుట్టిన రోజు సందర్భంగా పార్టీలకు అతీతంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీ సీఎం జగన్, టిడిపి అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. గౌరవనీయులైన ప్రధానికి పుట్టినరోజు శుభాకాంక్షలు అని జగన్ ట్వీట్ చేశారు. ప్రధానికి ఆయురారోగ్యాలను భగవంతుడు ఇవ్వాలని ఆకాంక్షిస్తున్నానని అన్నారు.
తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా సీఎం కేసీఆర్ నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్స్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పౌలీసుల గౌరవ వందనం స్వీకరించి, ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
జపనీస్ స్టార్టప్ AERWINS టెక్నాలజీస్ తయారు చేసిన ఫ్లయింగ్ బైక్ గురువారం డెట్రాయిట్ ఆటో షోలో యునైటెడ్ స్టేట్స్లో ప్రారంభమైంది. ప్రపంచంలోనే మొట్టమొదటి ఎగిరే బైక్‌గా పేర్కొనబడిన హోవర్‌బైక్ ప్రముఖ స్టార్ వార్స్ బైక్‌ల పోలికలను కలిగి ఉంది.
ఢిల్లీలోని ఒక నైజీరియన్ మహిళకు మంకీ ఫాక్స్ పాజిటీవ్ గా నిర్దారణ కావడంతో భారత్ లో కేసులసంఖ్య 13కి చేరుకుంది. మంకీపాక్స్‌తో బాధపడుతున్న మరో వ్యక్తి కూడా ఢిల్లీ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఉజ్బెకిస్తాన్‌లోని సమర్ఖండ్లో జరిగిన షాంఘై సహకార సంస్థ (ఎస్సిఓ) శిఖరాగ్ర సమావేశంలో కనెక్టివిటీని మెరుగుపరచాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చినప్పటికీ పొరుగు దేశం చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ నుండి దూరాన్ని కొనసాగించారు.
బుల్లితెర మెగాస్టార్ ఈటీవీ ప్రభాకర్ తనయుడు చంద్రహాస్ త్వరలో హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. చంద్రహాస్ పుట్టిరోజు (17వ తేదీ)ను పురస్కరించుకుని శుక్రవారం ఫిలింనగర్ కల్చరల్ క్లబ్లో మీడియాలో ‘ఇంట్రడ్యూసింగ్ చంద్రహాస్’ పేరుతో మీడియాతో ముఖాముఖి ఏర్పాటు చేశారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మరోసారి ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లోని పలుప్రాంతాల్లో ఈడీ అధికారుల తనిఖీలు చేపట్టారు. 25 బృందాలుగా ఏర్పడి ఈడీ సోదాలు చేస్తున్నారు. ఢిల్లీకి చెందిన ఈడీ అధికారుల ఆధ్వర్యంలో సోదాలు జరుగుతున్నాయి.
పేటీఎం ట్రావెల్ ఫెస్టివల్ సేల్ పేరుతో దేశీయ మరియు అంతర్జాతీయ టిక్కెట్ బుకింగ్‌లపై డిస్కౌంట్లను అందిస్తోంది. సేల్ సెప్టెంబర్ 15న ప్రారంభమై సెప్టెంబర్ 17 వరకు కొనసాగుతుంది. విస్తారా, స్పైస్‌జెట్, గోఫస్ట్ మరియు ఇతర అన్ని ప్రధాన విమానయాన సంస్థల బుకింగ్‌లపై డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి.
టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) జులై 2022కి సంబంధించిన నెలవారీ పనితీరు నివేదిక విడుదలైంది. భారతదేశంలోని అన్ని టెల్కోలు నెలవారీ ప్రాతిపదికన చూసిన క్రియాశీల సబ్స్క్రైబర్లను కోల్పోయినట్లు ఇది చూపించింది.
మూడు రాజధానుల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఏపీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ అన్నారు. 3 రాజధానుల బిల్లును మళ్లీ అసెంబ్లీలో ప్రవేశపెడతామని చెప్పారు. సీఎం జగన్ ఏ క్షణం నుంచైనా విశాఖ నుంచి పాలన ప్రారంభించవచ్చని ఆయన తెలిపారు.