Mumbai Billboard Collapse Case: ముంబై హోర్డింగ్ కేసు: యాడ్ ఏజన్సీ డైరక్టర్ భావేష్ భిండే అరెస్ట్
ముంబైలో గత సోమవారం సాయంత్రం ఘాట్కోపర్ ప్రాంతంలో అతి పెద్ద హోర్డింగ్ కూలి సుమారు 16 మంది చనిపోయిన విషయం తెలిసిందే. దీంతో ముంబై పోలీసులు అడ్వర్టజింగ్ ఏజెన్సీ డైరెక్టర్ భావేష్ భిండేను గురువారం నాడు ఉదయ్‌పూర్‌లో అరెస్టు చేశారు. ఈగో మీడియా ప్రైవేట్ లిమిటెడ్ ఈ హోర్డింగ్ కాంట్రాక్టు దక్కించుకుంది.
Mumbai Billboard Collapse Case: ముంబైలో గత సోమవారం సాయంత్రం ఘాట్కోపర్ ప్రాంతంలో అతి పెద్ద హోర్డింగ్ కూలి సుమారు 16 మంది చనిపోయిన విషయం తెలిసిందే. దీంతో ముంబై పోలీసులు అడ్వర్టజింగ్ ఏజెన్సీ డైరెక్టర్ భావేష్ భిండేను గురువారం నాడు ఉదయ్‌పూర్‌లో అరెస్టు చేశారు. ఈగో మీడియా ప్రైవేట్ లిమిటెడ్ ఈ హోర్డింగ్ కాంట్రాక్టు దక్కించుకుంది.
ముంబై నుంచి పారిపోయిన భిండే..(Mumbai Billboard Collapse Case)
ఈ దుర్ఘటనలో సుమారు 74 మంది వరకు గాయపడ్డారు. కాగా భిండే కంపెనీ 120X120 అడుగుల అడ్వర్టజింగ్ హోర్డింగ్‌ను ఘాట్కోపర్ ఈస్ట్‌లోని పంత్‌నగర్‌లో బిగించింది. కాగా మే 13తేదీ సాయంత్రం వీచిన ఈదురు గాలులకు ఈ హోర్డింగ్ పెట్రోల్ పంప్‌పై పడింది. ఆ సమయంలో పెట్రోల్ పంప్ వద్ద సుమారు వంద మంది ఉన్నారు. వారిలో 16 మంది మృతి చెందారు. మరో 74 మంది వరకు గాయపడ్డారు. సంఘటన జరిగిన తర్వాత భిండే ముంబై నుంచి పారిపోయాడు.వాస్తవానికి ఇక్కడ హోర్డింగ్ 40X40 అడుగుల హోర్డింగ్‌కు మాత్రమే అనుమతి ఉంది. అది పది సంవత్సరాల లీజుకు మాత్రమే. అయితే భావేష్ కంపెనీ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ఎక్కేందుకు ఇండియాలో అతి పెద్ద హోర్డింగ్ ఇదే నంటూ రికార్డు దక్కించుకుంది. సోమవారం జరిగిన సంఘటనతో పోలీసులు సెక్షన్ 304, 337, 337,34 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టింది. ముంబై పోలీసులు.. ముంబై నుంచి గుజరాత్ వరకు గాలింపు మొదలుపెట్టారు. అయితే చివరకు భిండేను ఉదయ్‌పూర్‌లో పోలీసులు గురువారం అరెస్టు చేశారు.
భిండే పై అత్యాచారం కేసు..
అయితే భిండేకు వ్యతిరేకంగా మరో రెండు కేసులు ములుంద్ పోలీసుస్టేషన్లో నమోదు అయ్యాయి. వాటిలో ఒకటి అత్యాచారం, మరోటి అత్యాచార యత్నం , మరోటి చీటింగ్ కేసు. భావేష్ భిండే ఆఫీస్‌లో పనిచేసే ఓ యువతి అతనిపై ఈ ఏడాది జనవరిలో అత్యాచారం కేసు నమోదు చేశారు. అయితే భిండే బాంబే హైకోర్టు నుంచి ముందుస్తు బెయిల్ తీసుకున్నారు. ఇవే కాకుండా ముంబై మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ 1888 కింద అతనిపై సుమారు 21 కేసులు నమోదు అయ్యాయి. ఇవన్నీ కాకుండా భిండే 2009లో ములుంద్ నియోజకవర్గం నుంచి శాసనసభకు పోటీ చేశారు.