Elephants Death : చిత్తూరు జిల్లాలో వాహనం ఢీకొని మూడు ఏనుగులు మృతి
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చిత్తూరు-పలమనేరు జాతీయ రహదారిపై పలమనేరు మండలంలో గల అటవీ సెక్షన్ సమీపంలో రోడ్డు దాటుతున్న మూడు ఏనుగులను ఐచర్ వాహనం ఢీకొట్టింది. దీంతో ఘటనా స్థలంలోనే మూడు ఏనుగులు మృతి చెందాయని స్థానికులు వెల్లడించారు. మృతి చెందిన మూడు
Elephants Death : చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చిత్తూరు-పలమనేరు జాతీయ రహదారిపై పలమనేరు మండలంలో గల అటవీ సెక్షన్ సమీపంలో రోడ్డు దాటుతున్న మూడు ఏనుగులను ఐచర్ వాహనం ఢీకొట్టింది. దీంతో ఘటనా స్థలంలోనే మూడు ఏనుగులు మృతి చెందాయని స్థానికులు వెల్లడించారు. మృతి చెందిన మూడు ఏనుగుల్లో రెండు పిల్ల ఏనుగులు ఉన్నాయని సమాచారం అందుతుంది. విషయం తెలుసుకున్న వెంటనే అటవీశాఖ అధికారులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం ( జూన్ 14, 2023 ) రాత్రి సమయంలో భూతలబండ మలుపు వద్ద రోడ్డు దాటుతున్న ఏనుగులును చెన్నైకి చెందిన కూరగాయల లోడ్ తో వెళ్తున్న వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో మూడు ఏనుగులు అక్కడికక్కడే మృతి చెందాయి. వీటిలో ఒక పెద్ద మగ ఏనుగు, రెండు చిన్న ఏనుగులు ఉన్నాయి. ప్రమాదంలో వాహనం ముందు భాగం నుజ్జునుజ్జు అయింది. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ పరారు కాగా.. భారీగా వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ అయింది. వాహన డ్రైవర్ అతివేగంతో వెళ్లాడమే ఈ ప్రమాదానికి కారణం అని తెలుపుతున్నారు.
సాధారణంగా పలమనేరు జాతీయ రహదారికి అటూ ఇటూ అడవులే ఉంటాయి. ఈ క్రమంలోనే ఏనుగులు ఆహారం కోసం గుంపుగా అటూ ఇటూ వెళ్తుంటాయి. ఒక్కోసారి పగపూట ఏనుగుల పెద్ద గుంపు రోడ్డుపై నిలబడి ఉన్న సందర్భాలు కూడా మనం గమనించవచ్చు. కానీ ఊహించని ఈ ప్రమాదంలో ఏనుగులు చనిపోవడం పట్ల పలువురు విచారం వ్యక్తం చేస్తున్నారు.