Last Updated:

Daily Horoscope : నేడు ఈ రాశుల లోని వారు ప్రేమ వ్యవహారాలలో ముందడుగు వేస్తారని తెలుసా..!

జ్యోతిష్యం ప్రకారం నేడు ఈ రాశుల లోని వారు ప్రేమ వ్యవహారాలలో ముందడుగు వేస్తారని తెలుస్తుంది. అలాగే ఏప్రిల్ 30 వ తేదీన రాశి ఫలాలు (Daily Horoscope)  ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా మీకోసం..

Daily Horoscope : నేడు ఈ రాశుల లోని వారు ప్రేమ వ్యవహారాలలో ముందడుగు వేస్తారని తెలుసా..!

Daily Horoscope : జ్యోతిష్యం ప్రకారం నేడు ఈ రాశుల లోని వారు ప్రేమ వ్యవహారాలలో ముందడుగు వేస్తారని తెలుస్తుంది. అలాగే ఏప్రిల్ 30 వ తేదీన రాశి ఫలాలు (Daily Horoscope)  ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా మీకోసం..

మేషం..

ఆర్థిక పరిస్థితి చాలా వరకు ఆశాజనకంగా ఉంటుంది. ఇతరులకు సహాయం చేస్తారు. ఆరోగ్యంలో సానుకూడా మార్పులు చోటు చేసుకుంటాయి. ఆహార విహారాల్లో జాగ్రత్తలు పాటించడం మంచిది. డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, ఇతర టెక్నాలజీ నిపుణులు బాగా బిజీగా ఉండే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు ప్రారంభించడానికి ఇది అనుకూల సమయం. నిరుద్యోగులు దూర ప్రాంతంలో ఉద్యోగం సంపాదించుకోవచ్చు. ప్రేమ వ్యవహారాలలో ముందడుగు వేస్తారు.

వృషభం..

ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఉద్యోగంలో అధికారులు సహకారుల నుంచి ఆశించిన ఆదరణ ప్రోత్సాహాలు లభిస్తాయి. ఆదాయం కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. నిరుద్యోగులు కొద్ది ప్రయత్నంతో సొంత ఊర్లోనే ఉద్యోగం సంపాదించుకునే అవకాశం ఉంది. ఒకరిద్దరు బంధువులతో అపార్ధాలు తలెత్తే సూచనలు ఉన్నాయి. ప్రేమ వ్యవహారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఒకటి రెండు శుభవార్తలు వినే అవకాశం ఉంది.

మిథునం..

నిరుద్యోగులకు విదేశాల నుంచి సైతం ఆఫర్లు అందే అవకాశం ఉంది. ఆరోగ్యం మీద బాగా శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ఆహార నియమాలు పాటించడం మంచిది. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం శ్రేయస్కరం. అనవసర పరిచయాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. బంధుమిత్రుల సహాయ సహకారాలతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి అవుతాయి. కుటుంబ సభ్యులను సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది.

కర్కాటకం..

అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తి అవుతాయి. పెళ్లి ప్రయత్నాలలో సానుకూల స్పందన లభిస్తుంది. ఉద్యోగ జీవితంలో ఆశించిన ప్రోత్సాహం అందుతుంది. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు సఫలం అవుతాయి. నిరుద్యోగులు శుభవార్త వింటారు. కుటుంబ పరంగా ఒకటి రెండు శుభ పరిణామాలు చోటుచేసుకుంటాయి. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

సింహం..

పెళ్లి ప్రయత్నాలు శ్రమ మీద ఫలితాలను ఇస్తాయి. కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. తొందరపాటు నిర్ణ యాలు ఇబ్బంది పెడతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. అనవసర ఖర్చులు బాగా పెరుగుతాయి. పొదుపు పాటించడం మంచిది. ఆహార విహారాల్లో కూడా జాగ్రత్తలను అనుసరించాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు కొద్దిగా ఇబ్బందులు తీసుకువస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

కన్య..

ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. పెళ్లి ప్రయత్నాలు సానుకూల ఫలితాలను ఇస్తాయి. నిరుద్యో గులు శుభవార్త వినే అవకాశం ఉంది. ఉద్యోగ జీవితంలో సహనంతో వ్యవహరించడం మంచిది. ఇప్పుడు తీసుకునే నిర్ణయాల వల్ల భవిష్యత్తులో మంచి ఫలితాలు అనుభవానికి వస్తాయి. వృత్తి వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ప్రేమ వ్యవహారాలు సానుకూల పడతాయి. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండడం మంచిది.

తుల..

ఒకటి, రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఆర్థిక సమస్యలు ఏవైనా ఉంటే అవి వెంటనే పరిష్కారం అవుతాయి. ఆరోగ్యంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగరీత్యా ఎక్కువగా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఆర్థిక లావాదేవీలు మంచి ఫలితాలను ఇస్తాయి. ప్రేమ వ్యవహారాలలో ముందుకు దూసుకు వెళతారు.

ఈ రాశులలోని నిరుద్యోగులకు శుభవార్త Daily Horoscope..

వృశ్చికం..

కుటుంబ జీవితం చాలా వరకు ప్రశాంతంగా సాగిపోతుంది. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. ఒకటి రెండు కుటుంబ సమస్యలు అనుకోకుండా పరిష్కారం అవుతాయి. ఆర్థిక వ్యవహారాలు మంచి ఫలితాలనే ఇస్తాయి. ఈ రాశి వారు ఈ వారం ఎంత పాజిటివ్ గా వ్యవహరిస్తే అంత మంచిది. ఉద్యోగ పరంగా చిన్నా చితకా సమస్యలు ఉంటాయి. పెళ్లి ప్రయత్నాలు కొద్దిగా ఇబ్బంది పెడతాయి. ప్రేమ వ్యవహారాలు నిలకడగా ముందుకు సాగుతాయి.

ధనుస్సు..

అదనపు ఆదాయ ప్రయత్నాలు సఫలం అయ్యే అవకాశం ఉంది. మనసులోని కోరికలలో ఒకటి రెండు నెరవేరే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు చేతికి వస్తాయి. ఉద్యోగం లో ఉన్నవారికి అధికార యోగం పట్టే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాల వారు లాభాలపరంగా పురోగతి సాధించడం జరుగుతుంది. ఎంత పాజిటివ్ గా ఆలోచిస్తే అంత మంచి జరుగుతుంది. ప్రేమ వ్యవహారాలు ముందుకు దూసుకుపోతాయి.

మకరం..

కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం పరవాలేదు. నిరుద్యోగులు శుభవార్త వింటారు. ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. విహారయాత్రకు వెళ్లే అవకాశం ఉంది. బంధుమిత్రులను ఆర్థికంగా ఆదుకోవడం జరుగుతుంది. ముఖ్యమైన వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. అనవసర పరిచయాలకు దూరంగా ఉండటం మంచిది. ప్రేమ వ్యవహారాలు ముందుకు సాగుతాయి.

కుంభం..

అదనపు ఆదాయ ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇస్తాయి. పెళ్లి ప్రయత్నాలు ఒక పట్టాన కొలిక్కి రావు. ముఖ్యమైన విషయాలలో బంధుమిత్రుల సహాయ సహకారాలు ఉంటాయి. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు మీద పడతాయి. ప్రస్తుత పరిస్థితుల్లో వాగ్దానాలు చేయడం, హామీలు ఉండటం శ్రేయస్కరం కాదు. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది. శరీరానికి మధ్య మధ్య విశ్రాంతి అవసరం. ప్రేమ వ్యవహారాలు కొద్దిగా నిరుత్సాహం అసంతృప్తి కలిగించే అవకాశం ఉంది.

మీనం..

అంతా హ్యాపీగా, ప్రశాంతంగా గడిచిపోతుంది. ఆదాయ పరిస్థితి నిలకడగా ఉంటుంది. అనవసర ఖర్చులు తగ్గిపోతాయి. ఆర్థిక సమస్యల పరిష్కారం మీద దృష్టి పెడతారు. ఆరోగ్యం చాలావరకు అను కూలంగా ఉంటుంది. నిరుద్యోగులు శుభవార్త వింటారు. విదేశాల నుంచి ఎదురుచూస్తున్న శుభవార్తలు అందుతాయి. కుటుంబ జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. బంధువర్గంలో గౌరవ మర్యాదలు అభివృద్ధి చెందుతాయి. కొందరు స్నేహితులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. ప్రేమ వ్యవహారాలు ముందుకు సాగుతాయి.