Last Updated:

RCB vs DD: బెంగళూరు ఘన విజయం.. ఢిల్లీకి ఐదో ఓటమి

ఐపీఎల్‌లో డబుల్‌ బొనాంజాలో తొలి మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరును దిల్లీ క్యాపిటల్స్‌ ఢీ కొట్టనుంది. మరికాసేపట్లో బెంగళూరు వేదికగా మ్యాచ్‌ ప్రారంభంకానుంది.

RCB vs DD: బెంగళూరు ఘన విజయం.. ఢిల్లీకి ఐదో ఓటమి

RCB vs DD: ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు విజృంభించింది. అటు బ్యాటర్లు, ఇటు బౌలర్లు సమిష్టిగా రాణించడంతో ఢిల్లీ క్యాపిటల్స్ ను చిత్తు చేసింది. ప్రత్యర్థి జట్టును 23 పరుగుల తేడాతో ఓడించి విజయం సాధించింది. తొలుత టాస్ గెలిచిన ఢిల్లీ.. ఆర్సీబీ ని బ్యాటింగ్ కు ఆహ్వానించింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి బెంగళూరు 174 పరుగులు చేసింది. ఈ లక్ష్యంతో ఛేదనకు దిగిన ఢిల్లీకి ఆరంభంలోనే ఎదరుదెబ్బ తగిలింది. ఇక వరుసగా వికెట్లు కోల్పోయిన ఢిల్లీ 9 వికెట్ల నష్టానికి 151 పరుగులకే పరిమితమైంది.

The liveblog has ended.

LIVE NEWS & UPDATES

  • 15 Apr 2023 07:24 PM (IST)

    RCB vs DD: 23 పరుగుల తేడాతో ఆర్సీబీ విజయం

    ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్లో బెంగళూరు 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత టాస్ గెలిచిన ఢిల్లీ.. ఆర్సీబీ ని బ్యాటింగ్ కు ఆహ్వానించింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి బెంగళూరు 174 పరుగులు చేసింది. ఈ లక్ష్యంతో ఛేదనకు దిగిన ఢిల్లీకి ఆరంభంలోనే ఎదరుదెబ్బ తగిలింది. ఇక వరుసగా వికెట్లు కోల్పోయిన ఢిల్లీ 9 వికెట్ల నష్టానికి 151 పరుగులకే పరిమితమైంది. ఢిల్లీ బ్యాటర్స్ లో మనీష్ పాండే ఒక్కడే అర్థశతకంతో మెరిశాడు. ఢిల్లీకి వరుసగా ఇది ఐదో ఓటమి.

    అంతకుముందు 14 ఓవర్ లో హసరంగ బౌలింగ్ లో మనీష్ పాండే 4,6,4 తో ధీటుగా ఆడాడు. తర్వాతి బంతికి అర్ధశతకం పూర్తిచేసుకున్నాడు. ఆ ఓవర్ లో చివరి బంతికి వికెట్ల ముందు దొరికిపోయి.. క్రీజును వీడాల్సి వచ్చింది.

    అనంతరం వచ్చిన బ్యాటర్స్ ఎవరూ క్రీజులో ఉండలేకపోయారు. 15.5 ఓవర్ కు లలిత్ కుమార్ పెవిలియన్ చేరాడు. ఆ సమయానికి ఢిల్లీ స్కోరు 110/8. తర్వాత 18 ఓవర్ 3 బంతికి అమాన్ ఖాన్ (18) కోహ్లీ కి క్యాచ్ ఇచ్చాడు. పార్నెల్ వేసిన 19 ఓవర్ లో నోకియా(18) రెండు ఫోర్లు బాదాడు. అప్పటికి ఢిల్లీ స్కోరు 139/9.

  • 15 Apr 2023 06:41 PM (IST)

    RCB vs DD: ఢిల్లీ ఆరో వికెట్ డౌన్

    బెంగళూరు బౌలర్లు విజృంభిస్తున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ ఆరో వికెట్ కూడా కోల్పోయింది. అక్షర్ పటేల్ (21) వద్ద వెనుదిరిగాడు. విజయ్ కుమార్ వైశాఖ్ వేసిన 12 ఓవర్ రెండో బంతికి సిరాజ్ కు క్యాచ్ ఇచ్చాడు. 13 ఓవర్లకు ఢిల్లీ స్కోరు 82/6 . అమాన్ ఖాన్ (1), మనీష్ పాండే (34) తో క్రీజులో ఉన్నారు.

  • 15 Apr 2023 06:21 PM (IST)

    RCB vs DD: బెంగళూరు బౌలర్ల విజృంభణ

    ఢిల్లీ వికెట్ల పతనం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ ఢిల్లీ... 5 వ వికెట్ ను కోల్పోయింది. 8.5 ఓవర్ కు హర్షల్ పటేల్ బౌలింగ్ లో అభిషేక్ పొరెల్(5) పార్నెల్ క్యాచ్ ఇచ్చాడు. దీంతో 53 పరుగుల వద్ద ఢిల్లీ క్యాపిటల్స్ ఐదవ వికెట్ కోల్పోయిం. 9 ఓవర్ల కు స్కోరు 53/3. మనీష్ పాండే (28), అక్షర్ పటేల్ (0) క్రీజులో ఉన్నారు.

  • 15 Apr 2023 06:04 PM (IST)

    RCB vs DD: పీకల్లోతు కష్టాల్లో ఢిల్లీ.. పెవిలియన్ కు వార్నర్

    హ్యాట్రిక్ బౌండరీలతో ఢిల్లీని ఆదుకుంటున్నాడనుకున్న వార్నర్(19) కూడా ఔట్ అయ్యాడు. దీంతో పీకల్లోతు కష్టాల్లోకి వెళ్లింది ఢిల్లీ. విజయ్ కుమార్ వైఖాఖ్ వేసిన 6 ఓవర్ లో నాల్గో బంతికి కోహ్లికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు ఢిల్లీ కెఫ్టెన్. పవర్ ప్లే పూర్తి అయ్యే సరికి ఢిల్లీ 32/4 గా ఉంది. మనీష్ పాండే (11), అభిషేక్ పొరెల్(1) క్రీజులో ఉన్నారు.

     

  • 15 Apr 2023 06:00 PM (IST)

    RCB vs DD: వరుస బౌండరీలు

    వరుసగా మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ ఢిల్లీని వార్నర్ (15) ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాడు. సిరాజ్ బౌలింగ్ లో మూడు బంతులను బౌండరీకి పంపాడు. 5 ఓవర్లకు ఢిల్లీ స్కోరు 25/3. మనీష్ పాండే (9) పరుగులతో ఉన్నాడు.

  • 15 Apr 2023 05:55 PM (IST)

    RCB vs DD: ఊహించని షాక్.. మూడో వికెట్ డౌన్

    వార్నర్ సేనకు మళ్లీ ఊహించని షాక్ తగిలింది. ఢిల్లీ మూడో వికెట్ కోల్పోయింది. సిరాజ్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూ గా యశ్ ధుల్(1) వెనుదిరిగాడు. వార్నర్ , మనీష్ పాండే క్రీజులో ఉన్నారు.

  • 15 Apr 2023 05:55 PM (IST)

    RCB vs DD: రెండో వికెట్ కోల్సోయిన ఢిల్లీ

    ఢిల్లీ రెండో వికెట్ కూడా కోల్పోయింది. రెండో ఓవర్ లో పార్నెల్ వేసిన నాల్గో బంతికి మిచెల్ మార్ష్ ..విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చాడు. 2 ఓవర్లకు ఢిల్లీ స్కోరు 2/2. యశ్ ధూల్ (1), వార్నర్ (1) క్రీజులో ఉన్నారు.

  • 15 Apr 2023 05:54 PM (IST)

    RCB vs DD: తొలి ఓవర్లోనే ఢిల్లీకి భారీ షాక్

    బెంగళూరు ఇచ్చిన 175 పరుగుల టార్గెట్ తో ఛేదనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ కు తొలి ఓవర్లోనే భారీ షాక్ తగిలింది. ఇంఫాక్ట్ ప్లేయర్ వచ్చిన పృథ్వీ షా (0) రన్ అవుట్ అయ్యాడు. సిరాజ్ బౌలింగ్ లో నాలుగో బంతికి అనవసరంగా పరుగును యత్నించిన పృథ్వీని అనుజ్ రావత్ డైరెక్ట్ త్రో విసిరి ఔట్ చేశాడు. తొలి ఓవర్ కు ఢిల్లీ స్కోరు 1/1.

  • 15 Apr 2023 05:19 PM (IST)

    RCB vs DD: 20 ఓవర్లో ఆర్సీబీ స్కోరు 174/6

     

    బెంగళూరు వేదికగా డిల్లీ క్యాపిటల్స్ తో జరుగున్న మ్యాచ్ లో ఆర్సీబీ ఇన్నింగ్స్ పూర్తయ్యాయి. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లలో మిచెల్ మార్ష్ , కుల్దీప్ యాదవ్ 2 చొప్పున వికెట్లు తీసుకున్నారు. నోకియా, లలిత్ యాదవ్ ఒక్కో వికెట్ తీశారు.

  • 15 Apr 2023 05:14 PM (IST)

    RCB vs DD: 19 ఓవర్ లో దూకుడు

    ఓవర్లు ముగిస్తుండటంతో బెంగళూరు బ్యాటర్లు దూకుడు పెంచారు. 19 ఓవర్లో ముస్తాఫిజుర్ బౌలింగ్ లో షాబాజ్ అహ్మద్ రెండు ఫోర్లు కొట్టాడు. అదే విధంగా నాలుగు సింగిల్స్ వచ్చాయి. దీంతో 19 ఓవర్లకు బెంగళూరు స్కోరు 166/6

  • 15 Apr 2023 04:43 PM (IST)

    RCB vs DD: వరుస బంతుల్లో వికెట్లు.. హ్యాట్రీక్ తీసిన కుల్దీప్

    బెంగళూరు వరుస బంతుల్లో రెండు వికెట్లు కోల్పోయింది. తొలుత హర్షల్ పటేల్ ఔటవ్వగా.. ఆ తర్వాతి బంతికే మాక్స్ వెల్ ఔటయ్యాడు. దినేష్ కార్తీక్ కూడా మెుదటి బంతికే ఔటయ్యాడు. దీంతో కుల్దీప్ యాదవ్ హ్యాట్రీక్ నమోదు చేశాడు.

  • 15 Apr 2023 04:40 PM (IST)

    RCB vs DD: వరుస బంతుల్లో వికెట్లు.. మాక్స్ వెల్ ఔట్

    బెంగళూరు రెండు వరుస బంతుల్లో రెండు వికెట్లు కోల్పోయింది. తొలుత హర్షల్ పటేల్ ఔటవ్వగా.. ఆ తర్వాతి బంతికే మాక్స్ వెల్ ఔటయ్యాడు. కుల్దీప్ యాదవ్ రెండు బంతుల్లో రెండు వికెట్లు తీశాడు.

  • 15 Apr 2023 04:31 PM (IST)

    RCB vs DD: మూడో వికెట్ డౌన్.. మహిపాల్ ఔట్

    బెంగళూరు మూడో వికెట్ కోల్పోయింది. మహిపాల్ మిచెల్ మార్ష్ బౌలింగ్ లో క్యాచ్ ఔటయ్యాడు.

  • 15 Apr 2023 04:15 PM (IST)

    RCB vs DD: విరాట్ కోహ్లీ ఔట్.. రెండో వికెట్ కోల్పోయిన బెంగళూరు

    బెంగళూరు రెండో వికెట్ కోల్పోయింది. అర్దసెంచరీ సాధించిన కోహ్లీ.. లలిత్ యాదవ్ బౌలింగ్ లో క్యాచ్ ఔటయ్యాడు.

  • 15 Apr 2023 04:13 PM (IST)

    RCB vs DD: విరాట్ అర్దసెంచరీ.. 33 బంతుల్లో 50 పరుగులు

    విరాట్ అర్దసెంచరీ సాధించాడు. 33 బంతుల్లో 50 పరుగులు చేశాడు. ఇందులో 6 ఫోర్లు, ఒక సిక్సర్ ఉంది. 10 ఓవర్లకు బెంగళూరు 89 పరుగులు చేసింది.

  • 15 Apr 2023 03:59 PM (IST)

    RCB vs DD: ముగిసిన 8వ ఓవర్.. నెమ్మదిగా బెంగళూరు బ్యాటింగ్

    వికెట్ పడటంతో బెంగళూరు నెమ్మదిగా బ్యాటింగ్ చేస్తోంది. మరోవైపు దిల్లీ స్పిన్నర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నారు. 8 ఓవర్లకు బెంగళూరు 61 పరుగుల చేసింది.

  • 15 Apr 2023 03:55 PM (IST)

    RCB vs DD: తొలి వికెట్ కోల్పోయిన బెంగళూరు.. డూప్లెసిస్ ఔట్

    బెంగళూరు తొలి వికెట్ కోల్పోయింది. డూప్లెసిస్ మిచెల్ మార్ష్ బౌలింగ్ లో క్యాచ్ ఔటయ్యాడు. 16 బంతుల్లో 22 పరుగులు చేశాడు.

  • 15 Apr 2023 03:43 PM (IST)

    RCB vs DD: ముగిసిన మూడో ఓవర్.. 26 పరుగులు చేసిన బెంగళూరు

    మూడు ఓవర్లకు బెంగళూరు 26 పరుగులు చేసింది. ముస్తఫిజుర్ వేసిన ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు వచ్చాయి.

  • 15 Apr 2023 03:38 PM (IST)

    RCB vs DD: రెండో ఓవర్.. కేవలం ఐదు పరుగులే

    అక్షర్ పటేల్ వేసిన రెండో ఓవర్లో కేవలం 5పరుగులు మాత్రమే వచ్చాయి. క్రీజులో డూప్లెసిస్, విరాట్ ఉన్నారు.

  • 15 Apr 2023 03:34 PM (IST)

    RCB vs DD: తొలి ఓవర్లో 11 పరుగులు..

    నోర్జియా వేసిన తొలి ఓవర్లో 11 పరుగులు వచ్చాయి. విరాట్ తొలి బంతికే ఫోర్ బాదాడు.

  • 15 Apr 2023 03:17 PM (IST)

    RCB vs DD: బెంగళూరు బ్యాటింగ్.. జట్టు ఇదే

    విరాట్ కోహ్లి, ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్‌), మహిపాల్ లోమ్రోర్, గ్లెన్ మాక్స్‌వెల్, షాబాజ్ అహ్మద్, దినేష్ కార్తీక్ (వికెట్ కీప‌ర్‌), వనిందు హసరంగా, హర్షల్ పటేల్, వేన్ పార్నెల్, మహ్మద్ సిరాజ్, విజయ్‌కుమార్ వైషాక్

  • 15 Apr 2023 03:17 PM (IST)

    RCB vs DD: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న దిల్లీ.. జట్టు ఇదే

    డేవిడ్ వార్నర్ (కెప్టెన్‌), మిచెల్ మార్ష్, యశ్ ధుల్, మనీష్ పాండే, అక్షర్ పటేల్, అమన్ హకీమ్ ఖాన్, లలిత్ యాదవ్, అభిషేక్ పోరెల్ (వికెట్ కీప‌ర్‌), కుల్దీప్ యాదవ్, అన్రిచ్ నోర్జే, ముస్తాఫిజుర్ రెహమాన్