Discount on Realme Narzo 80x 5G: రియల్‌మి కొత్త ఫోన్.. ఏప్రిల్ 11న సేల్.. సరికొత్త ఆఫర్లు ఇచ్చేసింది..!

Discount on Realme Narzo 80x 5G First Sale: రియల్‌మి ఈరోజు కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. కంపెనీ దీనిని దేశీయ మార్కెట్లో బడ్జెట్ ధరకు ప్రవేశపెట్టింది. Realme Narzo 80x మొబైల్ అధికారికంగా లాంచ్ అయింది. ఈ ఫోన్‌ను యువతను దృష్టిలో ఉంచుకొని రూపొందించారు. ఈ ఫోన్ డిజైన్ చాలా ఆకర్షణీయంగా, అద్భుతంగా ఉంటుంది. మొబైల్ రెండు స్టోరేజ్ వేరియంట్లలో లాంచ్ అయింది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 6400 ప్రాసెస, 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంది. ఈ కొత్త ఫోన్ ధర, స్పెసిఫికేషన్లు తదితర వివరాలు తెలుసుకుందాం.
Realme Narzo 80x 5G Price
ఈ స్మార్ట్‌ఫోన్ ఫోన్ బేస్ మోడల్ ధర రూ.13,999. దీనిపై రూ. 500 బ్యాంక్ ఆఫర్, రూ. 1,500 కూపన్ డిస్కౌంట్ అందిస్తుంది. ఈ ఆఫర్ల తర్వాత రూ.11,999కే కొనుగోలు చేయచ్చు. 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ రూ.14,999 కు లాంచ్ అయింది. ఆఫర్లతో కేవలం రూ.12,999కే ఆర్డర్ చేయచ్చు. ఇది లిమిటెడ్ టైమ్ డీల్. ఈ ఫోన్ సేల్ ఏప్రిల్ 11న సాయంత్రం 6 గంటల నుండి అర్ధరాత్రి 12 గంటల వరకు జరుగుతుంది. మీరు ఈ స్మార్ట్‌ఫోన్‌ను రియల్‌మి, అమెజాన్ అధికారికి సైట్ల నుంచి కొనుగోలు చేయచ్చు.
Realme Narzo 80x 5G Features
ఈ స్మార్ట్‌ఫోనన్ 6.72-అంగుళాల ఫుల్ HD ప్లస్ LCD డిస్‌ప్లేతో వస్తుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 180Hz టచ్ శాంప్లింగ్ రేట్, 950 నిట్స్ పీక్ బ్రైట్నెస్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఇది సూర్యకాంతిలో కూడా గొప్ప వీక్షణ అనుభవాన్ని అందిస్తుంది. ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6400 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. మంచి పనితీరు, శక్తి సామర్థ్యాన్ని అందిస్తుంది. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 15 ఆధారంగా రియల్‌మి UI 6.0పై రన్ అవుతుంది.
మొబైల్‌లో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంది. దీనితో పాటు, సెకండరీ కెమెరా 2 మెగాపిక్సెల్ పోర్ట్రెయిట్ సెన్సార్‌తో లభిస్తుంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ఈ ఫోన్‌లో 8-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా కూడా ఉంది. ఫోన్‌లో 6000mAh సామర్థ్యం కలిగిన పెద్ద బ్యాటరీ ఉంది. ఈ బ్యాటరీని ఛార్జ్ చేయడానికి, 45W ఫాస్ట్ ఛార్జింగ్ అందించారు. ఇది ఫోన్‌ను త్వరగా ఛార్జ్ చేస్తుంది. మరింత బ్యాకప్‌ను అందిస్తుంది. స్మార్ట్‌ఫోన్‌ను వాటర్, డస్ట్ నుంచి రక్షించడానికి IP69 రేటింగ్ ఉంది. దీనితో పాటు, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టెన్స్, 200శాతం సూపర్ వాల్యూమ్ మోడ్ ఫీచర్ కూడా అందుబాటులో ఉన్నాయి.